Horror Comedy OTT: ఓటీటీ కంటే ముందుగానే టీవీలోకి రాబోతున్న వంద కోట్ల బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ
Horror Comedy OTT: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ మూవీ ముంజ్య ఓటీటీ కంటే ముందు టీవీల్లోకి రాబోతోంది. ఈ సినిమా ఆగస్ట్ 24న స్టార్ గోల్డ్ ఛానెల్‌లో టెలికాస్ట్ కాబోతోంది.
Horror Comedy OTT: ఈ ఏడాది బాలీవుడ్‌లో చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది ముంజ్య. కొత్త హీరోహీరోయిన్లతో దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ హారర్ కామెడీ మూవీ 140 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
నిర్మాతలకు వంద కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ హారర్ కామెడీ మూవీ ఓటీటీ కంటే ముందు టీవీల్లోకి రాబోతోంది. ముంజ్య మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్‌ను స్టార్ గోల్డ్ ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. ఆగస్ట్ 24న రాత్రి ఎనిమిది గంటల నుంచి ఈ హారర్ కామెడీ మూవీ టీవీలో టెలికాస్ట్ అవుతుందని ప్రకటించింది. థియేటర్లలో ముంజ్య మూవీ ఆడుతోండగానే టీవీ ప్రీమియర్ డేట్‌ను వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్...
ముంజ్య డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నది. ఈ సినిమా థియేటర్లలో రిలీజై రెండు నెలలు కావస్తోన్న ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. టీవీ ప్రీమియర్ డేట్‌ను అనౌన్స్ చేసిన హాట్ స్టార్‌కు స్టార్ గోల్డ్ ఛానెల్ షాకిచ్చింది. టీవీ ప్రీమియర్ కంటే ముందుగానే ఓటీటీలోకి ముంజ్య మూవీని తీసుకురావాలన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రయత్నాలు చేస్తోన్నట్లు సమాచారం. ఆగస్ట్ 9 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతోన్నారు.
కోలీవుడ్ యాక్టర్ సత్యరాజ్...
ముంజ్య మూవీలో శార్వరీ, అభయ్ వర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. కోలీవుడ్ యాక్టర్ సత్యరాజ్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ఈ హారర్ కామెడీ మూవీకి ఆదిత్య సర్పోట్దర్ దర్శకత్వం వహించాడు. 1952, 2023 రెండు బ్యాక్‌డ్రాప్‌లలో ముంజ్య మూవీ సాగుతుంది. పురాణాల నుంచి స్ఫూర్తి పొందుతూ కల్పిత అంశాలతో దర్శకుడు ఈ హారర్ మూవీని రూపొందించాడు.
ముంజ్య కథ ఇదే...
1952లో గోట్య తనకంటే వయసులో ఆరేళ్లు పెద్దదైన మున్నిని ప్రేమిస్తాడు. కానీ మున్నికి వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్సవుతుంది. నరబలి ద్వారా మున్నిని తన వశం చేసుకోవాలని గోట్య ప్రయత్నిస్తాడు. అనుకోకుండా చనిపోయిన గోట్య...ముంజ్య అనే బ్రహ్మరాక్షసుడిగా మారతాడు.
2023లో బిట్టు ద్వారా బంధింపబడబిన ముంజ్య ఆత్మ మళ్లీ బయటకు వస్తుంది. ముంజ్య కారణంగా బిట్టు ఎలాంటి కష్టాలు పడ్డాడు? బిట్టు ప్రేమించిన బెల్యా ఎవరు? బిట్టు వెంట ముంజ్య ఎందుకు పడింది అన్నదే ఈ మూవీ కథ.
ఐదో సినిమా...
బాక్సాఫీస్ పరంగా ముంజ్య పలు రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ 140 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది. ఈ ఏడాది బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఐదో మూవీగా నిలిచింది.