Ranveer Nude Photoshoot: రణ్‌వీర్‌కు పోలీసుల నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్ తీసినందుకుగాను అతడిపై పోలీసు కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా పోలీసులు అతడిని విచారణ నిమిత్త పోలీసు స్టేషన్‌కు హాజరు కావాలని నోటీసులు పంపారు.
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ గత నెలలో నగ్న చిత్రాలతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. న్యూడ్ ఫొటోషూట్‌తో నెట్టింట హల్చల్ చేసిన అతడిపై పలు విమర్శలు వచ్చాయి. కొంతమంది అతడిపై ప్రశంసల వర్షం కురిపించగా.. మరికొంతమంది మాత్రం తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ అడుగు ముందుకేసి చాలా మంది అతడిపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. న్యూడ్ ఫొటోలు దిగినందుకు రణ్‌వీర్‌పై కేసు నమోదు కావడంతో అతడిని ప్రశ్నించేందుకు పోలీసులు అతడికి నోటీసులు పంపించారు. అతడి నగ్న చిత్రాల వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని, వారి ఫిర్యాదు మేరకు ఆగస్టు 22న హాజరు కావాలని ఆదేశించారు.
ట్రెండింగ్ వార్తలు
మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఆగస్టు 22న రణ్‌వీర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ముంబయి పోలీసు అధికారి ఒకరు ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది శుక్రవారం నటుడి నివాసానికి వెళ్లి విచారణకు సహకరించాలని నోటీసు ఇచ్చారని సమాచారం. అయితే తను ముంబయిలో లేనని, ఆగస్టు 16న తిరిగి వస్తానని సదరు అదికారికి రణ్‌వీర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ రోజున అతడికి నోటీసు అందించి ఆగస్టు 22న స్టేట్మెంట్ రికార్డు చేయడానికి పిలువనున్నారు.
గత నెలలో పేపర్ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ న్యూడ్‌గా ఫోజులిచ్చాడు. ఈ చిత్రాలు సదరు మ్యాగజైన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వాటిని రణ్‌వీర్ కూడా తన ట్విటర్ ఖాతా ద్వారా పోస్ట్ పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు ఓ ఎన్జీఓతో పాటు మరో వ్యక్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నగ్న చిత్రాలు మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని, వారి నమ్రతనను అవమానపరిచాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో సర్కస్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పూజా హెగ్డే కథానాయికలు. ఇది విలియం షేక్‌స్పియర్స్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్‌కు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ కూడా చేస్తున్నాడు. ఇందులో ఆలియా భట్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయబచ్చన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదల కానుంది.
సంబంధిత కథనం