Ntr Devara: అప్పుడు రామ్‌చరణ్...ఇప్పుడు ఎన్టీఆర్ - దేవర కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్
Ntr Devara: ఎన్టీఆర్ దేవర మూవీకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డ్యాన్స్‌మాస్టర్ బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ అందించనున్నాడు. తెలుగులో ఆరెంజ్, ధృవ తర్వాత బాస్కో మార్టిస్ దేవర మూవీకి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తోన్నాడు.
Ntr Devara: దేవర కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డ్యాన్స్‌మాస్టర్ బాస్కో మార్టిస్ రంగంలోకి దిగాడు. ఎన్టీఆర్ మూవీకి కొరియోగ్రాఫర్‌గా పనిచేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాస్కో మార్టిస్ రివీల్ చేశాడు. ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను బాస్కో మార్టిస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఎన్టీఆర్ మూవీకి డ్యాన్స్‌లను కంపోజ్ చేయనుండటంపై ఈ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. బాస్కో మార్టిస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో క్లాస్ లుక్‌లో ఎన్టీఆర్ కనిపిస్తోన్నాడు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ అందిస్తోన్న పాట షూట్ థాయిలాండ్‌లో జరుగనుంది. ఎన్టీఆర్‌పై సోలోగా ఈ పాటను షూట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ పాటలో ఎన్టీఆర్ స్టెప్పులుహైలైట్‌గా ఉండబోతున్నట్లు చెబుతోన్నారు.
టాప్ కొరియోగ్రాఫర్...
బాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్స్‌లో ఒకరిగా బాస్కో మార్టిస్ కొనసాగుతోన్నాడు. పఠాన్, వార్, ఫైటర్‌తో పాటు పలు బాలీవుడ్ మూవీస్‌కు కొరియోగ్రఫీని అందించాడు బాస్కో బార్టిస్. అతడు స్టెప్పులు, డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌కు భారీగా అభిమానులు ఉన్నారు. జిందగీ నా మిలేగీ దొబారా సినిమాకుగాను నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. తెలుగులోనూ రామ్‌చరణ్ ఆరెంజ్, ధృవ సినిమాలకు మాత్రమే కొరియోగ్రఫీ అందించాడు బాస్కో సీజన్. రామ్ చరణ్ సినిమాల తర్వాత తెలుగులో ఎన్టీఆర్ దేవరకు అతడు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేయనుండటం ఆసక్తికరంగా మారింది.
సరికొత్త బ్యాక్‌డ్రాప్...
దేవర మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో తీర ప్రాంత ప్రజల కోసం పోరాడే ఓ నాయకుడిగా పవర్‌ఫుల్ రోల్‌లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఇది వరకు తెలుగు తెరపై రాని సరికొత్త బ్యాక్‌డ్రాప్‌తో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
జాన్వీకపూర్ హీరోయిన్...
దేవర మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తోన్నాడు.
సెప్టెంబర్ 27న రిలీజ్...
ఇటీవల దేవరలోని ఫియర్ సాంగ్ రిలీజ్ చేయటం ద్వారా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశారు. . ఈ పాట సెన్సేషన్‌గా నిలిచింది. రికార్డ్ స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కబోతున్నది. దేవర పార్ట్ 1ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. తొలుత ఏప్రిల్ 5న విడుదల చేయాలని అనుకున్నారు. షూటింగ్ ఆలస్యం కావడంతో అక్టోబర్ 10కి వాయిదావేశారు. సెప్టెంబర్ 27న రావాల్సిన ఓజీ వాయిదాపడటంతో దేవర మూవీని ప్రీ పోన్ చేశారు. సెప్టెంబర్ 27గా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు.
కళ్యాణ్ రామ్...
దేవర మూవీలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ, సాబు శిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
టాపిక్