Swara Bhaskar: వెజిటేరియన్ అయినందుకు గర్వంగా ఉందన్న అభిమాని.. దూడకు తల్లిపాలను దూరం చేస్తున్నారంటూ బాలీవుడ్ నటి సీరియస్-bollywood actress swara bhaskar reacted to a fan tweet saying she is proud of being a vegetarian ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Swara Bhaskar: వెజిటేరియన్ అయినందుకు గర్వంగా ఉందన్న అభిమాని.. దూడకు తల్లిపాలను దూరం చేస్తున్నారంటూ బాలీవుడ్ నటి సీరియస్

Swara Bhaskar: వెజిటేరియన్ అయినందుకు గర్వంగా ఉందన్న అభిమాని.. దూడకు తల్లిపాలను దూరం చేస్తున్నారంటూ బాలీవుడ్ నటి సీరియస్

Hari Prasad S HT Telugu
Jun 17, 2024 11:00 AM IST

Swara Bhaskar: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఓ అభిమానికి ఘాటు రిప్లై ఇచ్చింది. తాను వెజిటేరియల్ అయినందుకు గర్వపడుతున్నానని ఆమె చేసిన ట్వీట్ పై స్పందిస్తూ.. దూడకు దక్కాల్సిన పాలు తాగుతూ అంటూ సీరియస్ అయింది.

వెజిటేరియన్ అయినందుకు గర్వంగా ఉందన్న అభిమాని.. దూడకు తల్లిపాలను దూరం చేస్తున్నారంటూ బాలీవుడ్ నటి సీరియస్
వెజిటేరియన్ అయినందుకు గర్వంగా ఉందన్న అభిమాని.. దూడకు తల్లిపాలను దూరం చేస్తున్నారంటూ బాలీవుడ్ నటి సీరియస్

Swara Bhaskar: ఓ ఫుడ్ బ్లాగర్ చేసిన ట్వీట్ పై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ స్పందించిన తీరు ఇప్పుడు వైరల్ అవుతోంది. బక్రీద్ సందర్భంగా నళినీ ఉనగర్ చేసిన వెజిటేరియన్ ట్వీట్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను వెజిటేరియన్ అయినందుకు గర్విస్తున్నా అని చేసిన ట్వీట్ పై స్వర స్పందిస్తూ.. దూడకు దక్కాల్సిన పాలు మీరు తాగుతున్నారంటూ మండిపడటం గమనార్హం.

yearly horoscope entry point

స్వర భాస్కర్ సీరియస్

దేశవ్యాప్తంగా సోమవారం (జూన్ 17) ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ పండుగనాడు లక్షల సంఖ్యలో మేకలను బలి ఇవ్వడంపై చాలా రోజులుగా సోషల్ మీడియాలో ఓ వర్గం నుంచి వ్యతిరేకత వస్తోంది. తాజాగా ఫుడ్ బ్లాగర్ నళినీ ఉనగర్ ఈ పండుగనాడే పరోక్షంగా చేసిన ట్వీట్ వైరల్ అయింది.

"ఓ వెజిటేరియన్ అయినందుకు గర్వంగా ఉంది. నా ప్లేట్ లో కన్నీళ్లు, క్రూరత్వం, అపరాధ భావం ఉండవు" అని ట్వీట్ చేసింది. దీనికి స్వర భాస్కర్ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది. "నిజాయతీగా చెప్పాలంటే ఈ వెజిటేరియన్లు తమకు తామే సరైన వాళ్లమని అనుకోవడం ఏంటో అర్థం కాదు. మీ మొత్తం ఆహారం దూడకు తన తల్లి పాలను దూరం చేయడం వల్లే తయారవుతోంది.

బలవంతంగా ఆవులకు గర్భం దాల్చేలా చేయడం, తర్వాత దూడలను తల్లులకు దూరం చేసి వాటి పాలను దొంగిలిస్తున్నారు. మీరు వేరు కాయగూరలను తింటారా? అది మొత్తం మొక్కనే చంపేస్తుంది. కేవలం బక్రీద్ అనే ఉద్దేశంతో ఇలాంటివి పోస్ట్ చేయడం మానండి" అని స్వర భాస్కర్ రిప్లై ఇచ్చింది.

స్వర మన తెలుగమ్మాయే

బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కొన్ని నెలల కిందట రంజాన్ సెలబ్రేట్ చేసుకోగా.. ఇప్పుడు బక్రీద్ కు సిద్ధమవుతోంది. ఆమె ముస్లిం అయిన ఫహాద్ అహ్మద్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో కుటుంబంతో కలిసి రంజాన్ పండుగ జరుపుకున్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయతే స్వర భాస్కర తెలుగమ్మాయే అన్న విషయం తెలుసా?

ఆమె తండ్రి ఉదయ్ భాస్కర్ ఏపీలోని గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తే. గతంలో ఇండియన్ నేవీలో సేవలందించారు. ఢిల్లీలో ఉన్న సమయంలోనే బీహార్ కు చెందిన ఇరాను పెళ్లి చేసుకున్నాడు. స్వర అక్కడే జన్మించింది. తన సంస్కృతిలో 62.5 శాతం యూపీ, 12.5 శాతం బీహార్, 25 శాతం ఆంధ్ర ఉంటుందని ఆమె గతంలో చెప్పింది. ఇప్పుడు భర్త ముస్లిం అయినా కూడా ఇంట్లో ఇటు హిందూ, అటు ముస్లిం సంప్రదాయాలను పాటిస్తారు. అన్ని పండుగలను కలిసే జరుపుకుంటారు.

Whats_app_banner