ఆ సీన్ కోసం ముందే మూడు రోజుల పాటు బికినీ వేసుకున్నా..: బాలీవుడ్ నటి కామెంట్స్-bollywood actress nushrratt baruccha bikini wearing made some interesting comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఆ సీన్ కోసం ముందే మూడు రోజుల పాటు బికినీ వేసుకున్నా..: బాలీవుడ్ నటి కామెంట్స్

ఆ సీన్ కోసం ముందే మూడు రోజుల పాటు బికినీ వేసుకున్నా..: బాలీవుడ్ నటి కామెంట్స్

Hari Prasad S HT Telugu

బాలీవుడ్ నటి ఓ సినిమాలో సీన్ కోసం ముందే మూడు రోజుల పాటు బికినీ వేసుకొని దానికి అలవాటు పడిందట. ఈ విషయాన్ని ఆమెనే వెల్లడించింది. ఇంతకీ ఆమె ఎందుకలా చేసిందో తెలుసా?

ఆ సీన్ కోసం ముందే మూడు రోజుల పాటు బికినీ వేసుకున్నా..: బాలీవుడ్ నటి కామెంట్స్

నుస్రత్ బరూచా తెలుసా? ఈమధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చోరీ2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన కెరీర్లో ఎన్నోసార్లు బోల్డ్ సీన్లలో నటించింది. అయితే తొలిసారి బికినీ వేసుకునే సీన్ కోసం మాత్రం ఆమె చాలా ఇబ్బంది పడిందట. ఆ ఇబ్బందిని అధిగమించడానికి నుస్రత్ తీసుకున్న ఓ నిర్ణయం ఆశ్చర్యం కలిగించకమానదు.

మూడు రోజులు బికినీలోనే..

బాలీవుడ్ లో నుస్రత్ బరూచా 2006లో వచ్చిన జై సంతోషి మాతో అడుగుపెట్టింది. అయితే 2011లో వచ్చిన ప్యార్ కా పంచనామా మూవీతో పాపులర్ అయింది. ఆ సినిమా హిట్ అయింది. దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఈ మూవీలోనే నుస్రత్ బికినీ సీన్ చేయాల్సి వచ్చింది. అదే ఆమెకు తొలిసారి. దీంతో ఆ భయాన్ని అధిగమించడానికి ఆమె అంతకుముందు మూడు రోజుల పాటు బికినీలోనే గడిపిందట.

ఆ సీన్ చేయడానికి ముందు ఆమె ఒంటరిగా ఓ ట్రిప్ కు వెళ్లింది. అక్కడ మూడు రోజుల పాటు కేవలం బికినీ వేసుకొనే తిరిగినట్లు ఆమె వెల్లడించింది. హ్యాటర్‌ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆసక్తికర విషయం చెప్పింది. “నేను నిజ జీవితంలో చేసేనవన్నీ స్క్రీన్ పై చేయడానికి పెద్దగా ఇబ్బంది పడను. ఎందుకంటే ఆ విషయాలపై నాకు నిజ జీవిత అనుభవం ఉంటుంది కాబట్టి” అని నుస్రత్ చెప్పింది.

బికినీ అందుకే వేసుకున్నా..

“అంతకుముందు నేనెప్పుడూ బికినీ వేసుకోలేదు. దీంతో అది నాకు పెద్ద సమస్య అయింది. నేను అందులో అంత సౌకర్యంగా ఉండనని డైరెక్టర్ తో చెప్పాను. ఒకవేళ వేసుకున్నా.. నేను అసౌకర్యంగా ఫీలవుతాను. దీంతో దీనిపై ఏం చేయాలా అని ఆలోచించాను. దీనికోసం నాకు నేనుగా సిద్ధమవ్వాలని అనుకున్నాను. ముందుగా నేను దీనిని ట్రై చేసి చూడాలి. అలా చేస్తే స్క్రీన్ పైనా చేయగలను అనిపించింది” అని నుస్రత్ చెప్పింది.

ఇండియాలో బికినీ వేసుకొని తిరగడం ఇబ్బంది కాబట్టి.. తాను విదేశీ పర్యటనకు వెళ్లినట్లు తెలిపింది. “అక్కడ మూడు రోజుల పాటు బికినీపైనే ఉన్నాను. రెండో రోజు నేను బికినీ వేసుకున్నానన్న విషయం కూడా మరచిపోయాను. అది నాకు సాధారణంగా అనిపించింది” అని నుస్రత్ చెప్పింది. బికినీపై తన ఆలోచన మార్చుకోవడానికి కావాలనే ఇలా బికినీ వేసుకొని తిరిగినట్లు తెలిపింది. దీనివల్ల ఆ తర్వాత సినిమాలో పెద్దగా ఇబ్బంది లేకుండానే బికినీ సీన్లలో నటించినట్లు వెల్లడించింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం