Mallika Sherawat: ఆడపిల్లగా పుట్టినందుకు మా అమ్మ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది: బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్-bollywood actress mallika sherawat says her parents never supported her mother went into depression ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mallika Sherawat: ఆడపిల్లగా పుట్టినందుకు మా అమ్మ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది: బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

Mallika Sherawat: ఆడపిల్లగా పుట్టినందుకు మా అమ్మ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది: బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

Mallika Sherawat: తాను ఆడపిల్లగా పుట్టినందుకు తన పేరెంట్స్ ఎన్నో ఆంక్షలు పెట్టేవారని, తన తల్లి ఏకంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె చాలా రోజుల తర్వాత విక్కీ ఔర్ విద్య కా వో వాలా వీడియో మూవీలో నటించింది.

ఆడపిల్లగా పుట్టినందుకు మా అమ్మ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది: బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

Mallika Sherawat: బాలీవుడ్ లో ఒకప్పుడు సెక్స్ బాంబ్ గా పేరుగాంచిన నటి మల్లికా షెరావత్. అలాంటి నటి తాను ఓ ఆడపిల్లగా పుట్టినందుకు సొంతింటి వాళ్ల నుంచే ఎలాంటి వివక్ష ఎదుర్కొన్నానో ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పడం షాక్ కు గురి చేసింది. తన కుటుంబం ఆడపిల్లను వద్దనుకుందని, తన తల్లి దాదాపు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని ఆమె చెప్పడం గమనార్హం.

చాలా వివక్ష చూపారు: మల్లికా షెరావత్

మల్లికా షెరావత్ ఈ మధ్యే హాటర్‌ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించింది. "మా పేరెంట్స్ నాకు, నా సోదరుడి మధ్య ఎంతో వివక్ష చూపేవారు. నాపై నా పేరెంట్స్ ఎందుకింత వివక్ష చూపుతున్నారో తెలియక నేను నా చిన్నతనంలో చాలా బాధ అనుభవించేదాన్ని.

అప్పట్లో ఆ విషయం అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు తెలిసింది. అతడు అబ్బాయి కాబట్టి విదేశాలకు పంపించండి, చదివించండి, అతనిపై డబ్బు ఖర్చు చేయండి అనే వారు. కుటుంబ ఆస్తి మొత్తం కొడుకుకే వెళ్తుంది. మనవడికే వెళ్తుంది. ఆడపిల్లలకు ఎందుకు? వాళ్లు పెళ్లి చేసుకుంటారు. వాళ్లో బాధ్యత, భారం అని అనేవారు" అని మల్లికా షెరావత్ చెప్పింది.

"అది నాకు చాలా బాధ కలిగించేది. కానీ అది నా ఒక్కదానికే కాదు.. నా ఊళ్లో ఉన్న ఆడపిల్లలందరికీ అలాంటి అన్యాయమే జరిగింది. మా పేరెంట్స్ నాకు అన్నీ ఇచ్చారు. మంచి చదువు చదివించారు. కానీ మంచి ఆలోచనలు, ఓపెన్ మైండ్ సెట్ మాత్రం ఇవ్వలేదు. నాకు స్వేచ్ఛ ఇవ్వలేదు.

నన్ను అర్థం చేసుకోలేదు. నేను చాలా స్పోర్ట్స్ ఆడేదాన్ని. కానీ అలా ఆడితే శరీరం బలంగా మారుతుందని, అలా అయితే ఎవరూ పెళ్లి చేసుకోరని ఆడనిచ్చేవాళ్లు కాదు. నాపై చాలా ఆంక్షలు ఉండేవి. నేను పుట్టినప్పుడు మా ఫ్యామిలీలో ఓ రకమైన విషాదం నెలకొంది. మా అమ్మ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది" అని మల్లికా షెరావత్ చెప్పింది.

బాలీవుడ్‌లో మల్లికా షెరావత్ ఇలా

మల్లికా షెరావత్ బాలీవుడ్ లోకి 2003లో వచ్చిన ఖ్వాహిష్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మర్డర్, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, వెల్‌కమ్, డర్టీ పాలిటిక్స్, ఆర్కే లాంటి సినిమాలతో పాపులర్ అయింది.

ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత విక్కీ ఔర్ విద్య కా వో వాలా వీడియోతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్, తృప్తి డిమ్రి, విజయ్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాజ్ శాండిల్య డైరెక్ట్ చేశాడు.