Kriti wants to marry Prabhas: ప్రభాస్‌ను పెళ్లాడతానన్న కృతి సనన్.. వీడియో వైరల్!
Kriti wants to marry Prabhas: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా బ్యాచిలర్‌గానే ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతడు ప్రస్తుతం కృతి సనన్‌తో రిలేషన్‌లో ఉన్నాడని బీటౌన్‌లో వార్తలు వస్తున్నాయి.
Kriti wants to marry Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్‌తో పాటు ఆదిపురుష్, ప్రాజెక్టు కే లాంటి పలు చిత్రాల్లో అతడు హీరోగా నటిస్తున్నాడు. పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలతోనే కాకుండా మరో విషయంలోనూ ప్రభాస్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అదే డార్లింగ్ పెళ్లెప్పుడు అనే ప్రశ్న గత కొన్నేళ్లుగా ఎక్కువగా వినిపిస్తోంది. నాలుగు పదుల వయస్సు దాటిన ప్రభాస్.. ఇంకా సింగిల్‌గానే ఉన్నాడు. అయితే అతడు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు ఇటీవల కాలంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఆదిపురుష్ సినిమాలో కలిసి నటిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
సెట్‌లో సైలెంట్‌గా ప్రభాస్.. కృతి సనన్‌తో మాత్రం కబుర్లు చెబుతున్నాడని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. ఆమె కూడా డార్లింగ్‌తో పనిచేయడంపై పలు సందర్భాల్లో ఆనందం వ్యక్తం చేసింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా ఆ మధ్య వచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని బదులిచ్చింది. అవకాశం వస్తే ప్రభాస్, టైగర్ ష్రాఫ్, కార్తిక్ ఆర్యన్ ఈ ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు? అలాగే ఎవరిని ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నారు? అన విలేకరి అడిగిన ప్రశ్నకు కృతి.. కార్తిక్ ఆర్యన్‌ను ఫ్లర్ట్ చేస్తానని, టైగర్‌తో డేటింగ్ చేస్తానని, ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని బదులిచ్చింది.
ఇటీవల కృతి సనన్.. వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన తోడేలు చిత్రం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ తన అభిమాన నటుడని, షూట్ సమయంలో భాషాపరంగా ఆయన సహాయం చేశారని చెప్పింది. రామాయాణం ఆధారంగ చేసుకుని తెరకెక్కుతోన్న ఆదిపురుష్ చిత్రంలో ఈ కృతి నటిస్తోంది.
ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానుంది. సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తొలుత టీమ్ భావించినప్పటికీ.. ఆ తర్వాత చిత్ర విడుదలను వాయిదా వేసింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపంచగా.. కృతి సీత పాత్రలో నటించింది. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించారు.
సంబంధిత కథనం