Injury To Bhagya Shree: రాధేశ్యామ్ లో ప్రభాస్ మదర్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్.. అందాల తార తలకు 13 కుట్లు.. అసలేమైందంటే?
Injury To Bhagya Shree: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ లో నటించిన బాలీవుడ్ నటి భాగ్యశ్రీకి తీవ్ర గాయమైంది. ఆమె తలకు 13 కుట్లు పడ్డాయి.

ఒకప్పటి బాలీవుడ్ అందాల తార భాగ్యశ్రీకి తీవ్ర గాయమైంది. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా ఆమె నటించింది. పికిల్ బాల్ ఆడుతుండగా భాగ్యశ్రీకి ఇంజూరీ అయింది. నుదురుపై గాయంతో తీవ్రంగా రక్తం కారింది. ఈ ఇంజూరీకి శస్త్రచికిత్స చేశారు. ఆమె ఫోర్ హెడ్ పై 13 కుట్లు వేశారు.
ఆడుతుంటే ఇంజూరీ
పికిల్ బాల్ ఆడుతుంటే భాగ్యశ్రీకి ఇంజురైంది. గాయమైన విషయాన్ని 54 ఏళ్ల భాగ్యశ్రీ సోషల్ మీడియాలో వెల్లడించింది. హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆమె ఫోటో వైరల్ గా మారింది. తలపై బ్యాండేజీతో ఆమె కనిపించింది. ఆమె త్వరగా రికవరీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆమె పోస్టుకు కామెంట్లు పెడుతున్నారు.
డెబ్యూ మూవీతోనే
భాగ్యశ్రీ డెబ్యూ మూవీతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1989లో వచ్చిన హిందీ మూవీ ‘మైనే ప్యార్ కియా’తో ఆమె సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టింది. ఆ మూవీలో సల్మాన్ ఖాన్ తో భాగ్యశ్రీ నటించింది. ఈ సినిమాలో యాక్టింగ్ తో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. అంతే కాకుండా ‘బెస్ట్ ఫిమేల్ డెబ్యూ’గా ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకుంది.
తెలుగులో
1997లో ఓంకారం సినిమాతో భాగ్యశ్రీ తెలుగులో అడుగుపెట్టింది. ఈ మూవీకి ఉపేంద్ర డైరెక్టర్ కావడం గమనార్హం. ఉపేంద్రకు డైరెక్టర్ గా ఇదే ఫస్ట్ తెలుగు మూవీ. ఈ సినిమాలో రాజశేఖర్, ప్రేమ, భాగ్యశ్రీ లీడ్ రోల్స్ చేశారు. తెలుగులో ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది.
గ్యాప్ తర్వాత
మధ్యలో కొంత కాలం పాటు భాగ్యశ్రీ సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది. సెలెక్టెడ్ మూవీస్ మాత్రమే చేస్తూ వచ్చింది. 2021 నుంచి ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఊపందుకుంది. సపోర్టింగ్ రోల్స్ చేస్తోంది. 2021లో ‘తలైవి’లో నటించింది. 2022లో ‘రాధేశ్యామ్’లో ప్రభాస్ మదర్ గా యాక్ట్ చేసింది. అప్పుడు ప్రభాస్ మదర్ ఎవరా అంటూ ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేశారు. 2023లో జోరు పెంచిన భాగ్యశ్రీ నాలుగు సినిమాలో చేసింది.
సంబంధిత కథనం