Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు కత్తి పోట్లు - గాయాలతో హాస్పిటల్ పాలైన దేవర విలన్ - బాలీవుడ్ వర్గాల్లో కలకలం
Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లతో హాస్పిటల్ పాలయ్యాడు. గురువారం ఉదయం సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడిన ఓ ఆగంతకుడు అతడిపై కత్తితో ఎటాక్ చేశాడు. దొంగ ఎటాక్‌లో సైఫ్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన బాలీవుడ్ వర్గాల్లో కలకలాన్ని సృష్టిస్తోంది.
Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తి పోట్లతో హాస్పిటల్ పాలయ్యాడు. సైఫ్ ఇంట్లో చొరబడిన ఓ దొంగ అతడిపై దాడిచేశాడు. ప్రస్తుతం ముంబాయిలోని లీలావతి హాస్పిటల్‌లో సైఫ్ అలీఖాన్ చికిత్సను పొందుతోన్నాడు. అతడి ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని సమాచారం.

కత్తితో ఎటాక్...
బంద్రాలో ఉన్న సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఇంటిలోకి గురువారం ఉదయం ఓ గుర్తుతెలియని ఆగంతకుడు చొరబడ్డాడు. దొంగ ఇంట్లోకి చొరబడిన విషయం గమనించిన సైఫ్ అలీఖాన్ అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో దొంగ…. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో ఎటాక్ చేసినట్లు సమాచారం. ఉదయం రెండున్నర గంటల సమయంలో ఈ ఎటాక్ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎటాక్ జరిగిన సమయంలో కరీనా కపూర్, తైమూర్ మినహా మిగిలిన సైఫ్ అలీఖాన్ కుటుంబసభ్యులందరూ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.
ఆరు చోట్ల గాయాలు...
దొంగ దాడిలో గాయపడిన సైఫ్ అలీఖాన్‌ను కుటుంబసభ్యులు హుటాహుటినా ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సైఫ్‌కు డాక్టర్లు చికిత్సను అందిస్తోన్నారు. న్యూరో, కాస్మోటిక్ సర్జన్స్ ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతోన్నట్లు తెలిసింది.. సైఫ్ అలీఖాన్ ఒంటిపై ఆరు చోట్ల గాయాలు అయినట్లు తెలుస్తోంది. రెండు కత్తిపోట్లు లోతుగా దిగాయని వైద్యులు తెలిపారు. ఓ గాయం వెన్నుముకకు సమీపంలో అయ్యిందని, సైఫ్‌కు సర్జరీ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. సర్జరీ తర్వాతే సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి క్లారిటీ వస్తుందని తెలిపారు.
బాలీవుడ్ వర్గాల్లో కలకలం....
మరోవైపు కట్టుదిట్టమైన భద్రత కలిగిన సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి దొంగ చొరబడటం బాలీవుడ్ వర్గాల్లో కలకలాన్ని సృష్టిస్తోంది. ఆ ఆగంతకుడు ఎవరు? సైఫ్ అలీఖాన్‌పై ఎందుకు ఎటాక్ చేశాడనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తోన్నట్లు సమాచారం. దొంగతనం చేయడానికే వచ్చాడా? మరేదైనా కారణంతోనే సైఫ్‌పై ఎటాక్ చేశాడా అనే విషయాలపై ఎంక్వైరీ చేస్తోన్నట్లు సమాచారం. ఈ ఎటాక్‌తో ముంబాయిలో సినీ, రాజకీయ వర్గాలతో ప్రముఖుల భద్రతాపై అనేక ప్రశ్నలు తలెత్తుతోన్నాయి.
దేవరలో విలన్...
ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించాడు. ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భైర పాత్రలో తన విలనిజంతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడు. ప్రభాస్ ఆదిపురుష్‌లో లంకేష్‌గా సైఫ్ అలీఖాన్ నటించాడు.
టాపిక్