Intimate scenes: సెక్స్ సీన్లను మీరే ఎంజాయ్ చేస్తారు.. మాకు బోరింగ్: బాలీవుడ్ నటుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్-bollywood actor gulshan devaiah interesting comments about intimate scenes says they are boring ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Intimate Scenes: సెక్స్ సీన్లను మీరే ఎంజాయ్ చేస్తారు.. మాకు బోరింగ్: బాలీవుడ్ నటుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Intimate scenes: సెక్స్ సీన్లను మీరే ఎంజాయ్ చేస్తారు.. మాకు బోరింగ్: బాలీవుడ్ నటుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

Intimate scenes: సెక్స్ సీన్ల గురించి బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వాటిని ప్రేక్షకులే ఎంజాయ్ చేస్తారని, తాము మాత్రం బోరింగా ఫీలవుతామని చెప్పడం విశేషం.

సెక్స్ సీన్లను మీరే ఎంజాయ్ చేస్తారు.. మాకు బోరింగ్: బాలీవుడ్ నటుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Intimate scenes: సెక్స్ సీన్లను స్క్రీన్ పై చూస్తుంటే వాటిని చేసే నటీనటులు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అని మనకు అనిపిస్తుంది కదా. కానీ అలాంటి సీన్లు చాలా బోర్ అంటున్నాడు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య. జాన్వీ కపూర్ తో కలిసి తన నెక్ట్స్ మూవీ ఉలఝ్ లో నటించిన అతడు.. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు అతడు ఇలా స్పందించాడు.

సెక్స్ సీన్లు బోర్

జాన్వీ కపూర్, గుల్షన్ దేవయ్య కలిసి నటిస్తున్న ఉలఝ్ మూవీ ట్రైలర్ మంగళవారం (జులై 16) రిలీజైన విషయం తెలిసిందే. దీని తర్వాత అతడు రెడిట్ లో అభిమానులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు అతడు ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చాడు. "భాయ్ మొదట్లో సెక్స్ సీన్లు చేసేటప్పుడు ఎలా అనిపించేది.. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది" అని ఆ అభిమాని అడిగాడు.

దీనికి గుల్షన్ స్పందిస్తూ.. "చాలా బోరింగా అనిపించేది. ఇప్పుడు కూడా బోరింగానే అనిపిస్తోంది. వాటిని మీరు మాత్రమే చూసి ఎంజాయ్ చేస్తారు" అని అనడం విశేషం. గతంలో హంటర్ లాంటి సినిమాల్లో గుల్షన్ ఇలాంటి సీన్లలో నటించాడు. ఈ మధ్యే మరో నటి అవికా గోర్ కూడా సరిగ్గా ఇలాగే స్పందించింది. తెలుగులో ఉయ్యాల జంపాలాలాంటి సినిమాలో నటించిన ఈ చిన్నారి పెళ్లి కూతురు నటి సెక్స్ సీన్లు నటీనటులకు చాలా బోరింగా ఉంటాయని చెప్పింది.

ఆ వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తుందా?

గుల్షన్ దేవయ్య సిల్వర్ స్క్రీన్ పైనే కాదు.. ఓటీటీలోనూ అఫ్సోస్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ సిరీస్ సరదాగా సాగిపోయింది. ఈ సిరీస్ రెండో సీజన్ ఏమైనా వస్తుందా అని ఓ అభిమాని ప్రశ్నించారు. దీనికి గుల్షన్ స్పందిస్తూ.. మరచిపోండి అని సింపుల్ గా సమాధానమిచ్చాడు. ఇక మరో నటుడి సినిమా ఏదైనా చేసి ఉంటే బాగుండేదని అనిపించిందా అని ప్రశ్నించగా.. అంధాధున్ అని అతడు చెప్పాడు.

గుల్షన్ తన నెక్ట్స్ మూవీ ఉలఝ్ లో ఓ అండర్ కవర్ ఏజెంట్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. మంగళవారం రిలీజైన ట్రైలర్ లో అతని పాత్ర ఏంటన్నది రివీలైంది. ఈ సినిమాలో జాన్వీ లండన్ లో ఇండియా డిప్యూటీ హైకమిషనర్ గా నటించడం విశేషం. నేషనల్ అవార్డు విన్నర్ సుధాంషు సారియా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.