Prabhas Movie: అనుపమ్ ఖేర్ 544వ సినిమా ఫిక్స్ - ప్రభాస్ మూవీలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్!
Prabhas Movie: ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతోన్న పీరియాడికల్ మూవీలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తోన్న విషయాన్ని అనుపమ్ ఖేర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ప్రభాస్‌తో కలిగి దిగిన ఫొటోలను షేర్ చేశాడు.

ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతోన్న మూవీలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నటిస్తోన్న విషయాన్ని అఫీషియల్‌గా అనుపమ్ ఖేర్ ప్రకటించాడు. నటుడిగా ఇది తనకు 544వ సినిమా అని అనుపమ్ ఖేర్ చెప్పాడు. ఇండియన్ బాహుబలి ప్రభాస్, టాలెలెండ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో వస్తోన్న సినిమాలో తాను నటిస్తోన్నట్లు ఓ ట్వీట్ చేశాడు. ప్రభాస్, హను రాఘవపూడిలతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
హైదరాబాద్‌లో షూటింగ్...
ప్రభాస్ మూవీ సెట్స్‌లోకి హను రాఘవపూడి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 1940 కాలాన్ని తలపించేలా భారీ వ్యయంతో ఈ సినిమా కోసం కొన్ని స్పెషల్ సెట్స్ వేసినట్లు సమాచారం. ఈ సెట్స్‌లోనే ప్రభాస్, అనుపమ్ ఖేర్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తోన్నట్లు సమాచారం. ఇదివరకు తెలుగులో కార్తికేయ 2, రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేశాడు అనుపమ్ ఖేర్.
పీరియాడికల్ లవ్‌స్టోరీ...
పీరియాడికల్ యాక్షన్ లవ్ స్టోరీగా డైరెక్టర్ హను రాఘవపూడి ఈ మూవీని తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం. రజాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియడ్‌లో ఈ మూవీ సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ మూవీకి ఫౌజీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు చెబుతోన్నారు. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియన్ పారా మిలిటరీకి చెందిన సైనికుడిగా ప్రభాస్ ఈ మూవీలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సోషల్ మీడియా సెన్సేషన్..
ప్రభాస్, హను రాఘవపూడి మూవీలో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ హీరోయిన్‌గా నటించనుంది. ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
ఈ మూవీలో అనుపమ్ ఖేర్‌తో పాటు మరో బాలీవుడ్ సీనియర్ మిథున్ చక్రవర్తితో పాటు సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక పాత్రల్లో నటిస్తోన్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.
రాజా సాబ్...
ప్రస్తుతం ఫౌజీతో పాటు రాజాసాబ్, కల్కి 2 సినిమాలు చేస్తోన్నాడు ప్రభాస్. సలార్ 2 కూడా పూర్తిచేయాల్సివుంది. వీటితో పాటు మంచు విష్ణు కన్నప్పలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడు.
సంబంధిత కథనం