Amitabh Bachchan: అమితాబ్‌కు కరోనా.. మరోసారి మహమ్మారి బారిన పడిన బిగ్‌బీ
అమితాబ్ బచ్చన్‌కు మరోసారి కరోనా సోకింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటునన్నారు. బిగ్ బీకి కరోనా సోకడం ఇది రెండో సారి. 2020లో తొలిసారిగా ఆయన కోవిడ్ బారిన పడ్డారు.
కరోనా మహమ్మారి ఇప్పడప్పుడే ప్రపంచాన్ని వదిలేలా లేదు. ఇప్పటికే మూడు పర్యాయాలు తన వ్యాప్తిని కొనసాగించిన కోవిడ్.. ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎంతోమందికి ప్రాణాంతకంగా మారింది. తాజాగా బాలీవుడ్ దిగ్గజం బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా తెలియజేశారు.
ట్రెండింగ్ వార్తలు
"నాకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఇటీవల కాలంలో నన్ను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను." అని అమితాబ్ బచ్చన్ ట్విటర్ వేదికగా కోరారు. బిగ్ బీకి కరోనా సోకడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పలువురు ట్విటర్ వేదికగా తమ స్పందనలను తెలియజేశారు. త్వరగా కోలుకోవాలని, ఇందుకోసం తాము దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అమితాబ్ బాగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడటం ఇది రెండో సారి. 2020లో తొలిసారిగా ఆయనకు కోవిడ్ సోకింది. ఆ సమయంలో కూడా చికిత్స తీసుకుని కోలుకున్నారు. అప్పుడు అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్య బచ్చన్‌కు కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.
ప్రస్తుతం బిగ్ బీ ప్రముఖ టీవీ షో కౌన్ బనేగా కరోడ్ పతి కొత్త సీజన్ షూటింగ్‌లో ఉన్నారు. ఇది కాకుండా రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మాస్త్ర చిత్రంలో నటించారు. ఇది త్వరలో విడుదల కానుంది. తాజాగా ఆయనకు కరోనా సోకడంతో షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.
సంబంధిత కథనం