OTT Action Movie: ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన రూ.350కోట్ల మల్టీస్టారర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Movie: సింగం అగైన్ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ముందుగా హిందీలో ఒక్కటే ఓటీటీలోకి వచ్చిన ఈ మల్టీస్టారర్ యాక్షన్ మూవీ.. ఇప్పుడు మరో రెండు భాషల్లో అడుగుపెట్టింది. ఈ చిత్రాన్ని ఎక్కడ చూడొచ్చంటే..
సింగం అగైన్ చిత్రం బాలీవుడ్‍లో భాలీ మల్టీస్టారర్ మూవీగా రూపొందింది. అజయ్ దేవ్‍గణ్, రణ్‍వీర్ సింగ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, దీపికా పదుకొణ్, టైగర్ ష్రాఫ్ లాంటి బాలీవుడ్ స్టార్లు కలిసి ఈ చిత్రంలో నటించారు. ఈ యాక్షన్ మూవీ దీపావళి సందర్భంగా నవంబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన సింగం అగైన్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కాగా, సింగం అగైన్ ఓటీటీలో ముందుగా హిందీలో ఒక్కటే అడుగుపెట్టగా.. ఇప్పుడు తెలుసు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలు ఇవే..

స్ట్రీమింగ్ ఎక్కడంటే..
సింగం అగైన్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ముందుగా హిందీలో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. అయితే, తాజాగా ఇప్పుడు ఈ సినిమా తెలుగు, తమిళంలోనూ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. మూడు భాషల్లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
సింగం అగైన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ముందుగా రెంటల్ విధానంలో వచ్చింది. ఆ తర్వాత గత నెల డిసెంబర్ 27న రెగ్యులర్ స్ట్రీమింగ్ షురూ అయింది. రెంట్ తొలగిపోయింది. అయితే, హిందీలో ఒక్కటే అందుబాటులోకి వచ్చింది. స్ట్రీమింగ్‍కు వచ్చిన నెల తర్వాత ఇప్పుడు ఈ చిత్రానికి తెలుగు, తమిళం ఆడియోలను అమెజాన్ ప్రైమ్ వీడియో యాడ్ చేసింది. దీంతో మూడు భాషల్లో సింగం అగైన్ మూవీని చూడొచ్చు.
సింగం అగైన్ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. భారీ యాక్షన్ సీక్వెన్సులతో, స్టార్ నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రామాయణం రిఫరెన్సులను కూడా తీసుకున్నారు. అజయ్, కరీనా ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేశారు. రణ్‍వీర్, అక్షయ్ కుమార్, దీపికా, టైగర్ ష్రాఫ్ సపోర్టింగ్ పాత్రలు చేయగా.. అర్జున్ కపూర్ విలన్‍గా నటించారు.
రూ.350కోట్ల బడ్జెట్.. కలెక్షన్లు ఇలా..
సింగం అగైన్ సినిమా సుమారు రూ.350కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.389 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. అంచనాలకు తగ్గట్టుగా భారీ వసూళ్లను ఈ మూవీ సాధించలేకపోయింది. స్టార్ నటీనటులతో భారీ మల్టీస్టారర్‌గా వచ్చినా మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సత్తాచాటలేకపోయింది. మోస్తరు వసూళ్లపై పరిమితం అయింది.
సింగం అగైన్ చిత్రానికి రవి బస్రూర్, థమన్ మ్యూజిక్ ఇచ్చారు. జియో స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‍మెంట్స్, రోహిత్ శెట్టి పిక్చర్స్, దేవ్‍గణ్ ఫిల్మ్స్, సినర్జీ బ్యానర్లు సంయుక్తంగా ఈ మూవీని ప్రొడ్యూజ్ చేసింది.
సంబంధిత కథనం