Action Movie OTT: ఓటీటీలోకి రాబోతోన్న మోస్ట్ వ‌యోలెంట్ బాలీవుడ్‌ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-bollywood action movie kill ott rights acquired by disney plus hotstar kill ott release date karan johar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Action Movie Ott: ఓటీటీలోకి రాబోతోన్న మోస్ట్ వ‌యోలెంట్ బాలీవుడ్‌ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Action Movie OTT: ఓటీటీలోకి రాబోతోన్న మోస్ట్ వ‌యోలెంట్ బాలీవుడ్‌ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Action Movie OTT: బాలీవుడ్‌లో మోస్ట్ వ‌యోలెంట్ మూవీగా నిలిచిన కిల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖ‌రారైంది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆగ‌స్ట్ ఫ‌స్ట్ వీక్‌లో కిల్ మూవీ ఓటీటీ ప్రేక్ష‌క‌లు ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

కిల్ ఓటీటీ

Action Movie OTT: బాలీవుడ్‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజైన చిన్న సినిమా కిల్ బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేస్తోంది.యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన కిల్ మూవీకి న‌గేష్ నిఖిల్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాతో ల‌క్ష్య హీరోగా హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

క‌ర‌ణ్ జోహార్ ప్రొడ్యూస‌ర్‌...

కిల్ మూవీని గునీత్ మోంగా, అపూర్వ మెహ‌తాల‌తో క‌లిసి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్ నిర్మించాడు. జూలై 5న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. యాక్ష‌న్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ సినిమాల‌కు ధీటుగా ఉన్నాయంటూ అభిమానులు కామెంట్స్ చేస్తోన్నారు. ఈ యాక్ష‌న్ సినిమాలో హింస‌, ర‌క్త‌పాతం ఎక్కువ‌గానే ఉంద‌ని, మోస్ట్ వ‌యోలెంట్ బాలీవుడ్ మూవీ ఇదంటూ పేర్కొంటోన్నారు.

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌…

కిల్ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న‌ది. థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే ఈ చిన్న సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను భారీ ధ‌ర‌కు హాట్‌స్టార్ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం.

థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగు వారాల్లోనే ఈ యాక్ష‌న్ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు తెలిసింది. ఆగ‌స్ట్ ఫ‌స్ట్ వీక్ నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో కిల్ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. జూలై నెలాఖ‌రున ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఆఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

కిల్ మూవీ క‌థ ఇదే...

అమ్రిత్ రాథోడ్ (ల‌క్ష్య‌) ఎన్ఎస్‌జీలో స్పెష‌ల్ క‌మాండోగా ప‌నిచేస్తాడు. తుల్కియా (తాన్య‌) అనే యువ‌తిని ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ తుల్కియా తండ్రి మ‌రో అబ్బాయితో ఆమె పెళ్లి జ‌రిపించాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. ఆ పెళ్లిని అమ్రిత్ అడ్డుకుంటాడు. తుల్కియాను పెళ్లిచేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఆ పెళ్లి కోసం ఢిల్లీ నుంచి రాంచీకి ట్రైన్‌లో బ‌య‌లుదేరుతారు అమ్రిత్‌, తుల్కియా.

వారి ట్రైన్‌పై కొంద‌రు బందిపోటు దొంగ‌లు ఎటాక్ చేస్తారు. వారి కార‌ణంగా తుల్కియాతో పాటు మిగిలిన ప్ర‌యాణికుల ప్రాణాలు ప్ర‌మాదంలో ప‌డ‌తాయి. ఆ బందిపోటు దొంగ‌ల‌ను ఎదురించి అమ్రిత్ రాథోడ్ ఎలాంటి పోరాటం చేశాడు? తుల్కియా ప్రాణాల‌ను కాపాడాడా లేదా అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ట్రైన్ జ‌ర్నీలోనే...

ఈ సినిమాలో రాఘ‌వ్ జుయాల్ విల‌న్‌గా న‌టించాడు. హీరో, విల‌న్ పాత్ర‌ల‌ను పోటాపోటీగా తీర్చిదిద్దిన తీరుకు ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. ఈ సినిమా క‌థ మొత్తం దాదాపు ట్రైన్ జ‌ర్నీలోనే సాగుతుంది. అయినా ఆద్యంతం యాక్ష‌న్ అంశాల‌తో ద‌ర్శ‌కుడు గ్రిప్పింగ్‌గా తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు.

ఈ చిన్న సినిమా మూడు రోజుల్లోనే ఇర‌వై కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది.