ఓటీటీలోకి ఆ బోల్డ్ సిరీస్ మరో రెండు ఎపిసోడ్లు.. లిప్ కిస్ లు.. ఎరోటిక్ సీన్లు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-bold web series sshhh season 2 new episodes 3 and 4 streaming on aha tamil from september 26th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి ఆ బోల్డ్ సిరీస్ మరో రెండు ఎపిసోడ్లు.. లిప్ కిస్ లు.. ఎరోటిక్ సీన్లు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి ఆ బోల్డ్ సిరీస్ మరో రెండు ఎపిసోడ్లు.. లిప్ కిస్ లు.. ఎరోటిక్ సీన్లు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలో అదరగొడుతున్న బోల్డ్ వెబ్ సిరీస్ ష్.. సీజన్ 2 మరో రెండు ఎపిసోడ్లు రిలీజ్ కానున్నాయి. కొత్త ఎపిసోడ్లు ఓటీటీలోకి రాబోతున్నాయి. లిప్ కిస్, ఎరోటిక్ సీన్లతో ఉన్న ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఓటీటీలో బోల్డ్ సిరీస్ (x/ahatamil)

ఓటీటీలో అదరగొడుతున్న బోల్డ్ వెబ్ సిరీస్ ష్.. సీజన్ 2లో మరో రెండు ఎపిసోడ్లు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ సూపర్ హిట్ ఆంథాలజీ సిరీస్ ష్.. సీజన్ 1 ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీజన్ 2లో ఫస్ట్ రిలీజైన రెండు ఎపిసోడ్లు కూడా ఓటీటీ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో రెండు ఎపిసోడ్లు రిలీజ్ కానున్నాయి.

ఓటీటీలో బోల్డ్ సిరీస్

లిప్ కిస్ లు, ఎరోటిక్ సీన్లు, ఇంటిమేట్ సీన్లతో వేరే లెవల్ బోల్డ్ నెస్ తో తెరకెక్కిన సిరీస్ ఇది. ష్.. సీజన్ 1 నాలుగు కథల ఆంథాలజీ సిరీస్ కు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసింది. ఇప్పుడు ష్.. సీజన్ 2 కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లో అలరిస్తోంది. ఈ సీజన్ లో మూడు, నాలుగు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి.

ఓటీటీలో ఎప్పుడు?

బోల్డ్ సిరీస్ ష్.. సీజన్ 2 ఫస్ట్ రెండు ఎపిసోడ్లు సెప్టెంబర్ 19న ఓటీటీలోకి వచ్చాయి. ఆహా తమిళ్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ సీజన్ లో భాగంగా మూడు, నాలుగు ఎపిసోడ్లు ఓటీటీలోకి రాబోతున్నాయి. సెప్టెంబర్ 26 అంటే రేపటి నుంచి ఇవి ఓటీటీ లవర్స్ కు అందుబాటులో ఉంటాయి.

రెండు ఎపిసోడ్లు

ఇప్పటికే ష్.. సీజన్ 2లో రెండు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ఒకటి ‘గిగోలో’. ఫస్ట్ ఎపిసోడ్ లో ఓ యంగ్ కుర్రాడు, ఒంటరి హౌస్ వైఫ్ మధ్య రిలేషన్ షిప్ ను చూపించారు. అప్పుల్లో కూరుకుపోయిన వెట్రి ఓ కంపెనీలో జాబ్ లో జాయిన్ అవుతాడు. అప్పుడే ఓ అందమైన, ఒంటరిగా ఉండే నమ్రత అనే మహిళను కలుస్తాడు.

నమ్రతకు గర్భం పోతుంది. మ్యారేజీ లైఫ్ కు బ్రేక్ పడుతుంది. ఆ పరిస్థితుల్లో వెట్రి, నమ్రత ఒకరికొకరు దగ్గరవుతారు. ఓ నైట్ బాగా ఎంజాయ్ చేస్తారు. రొమాన్స్ తో నిండిన ఈ ఎపిసోడ్ 44 నిమిషాలు ఉంది.

వర్జినిటీ కోల్పోవాలని

రెండో ఎపిసోడ్ ‘దబిడి దిబిడి’ 36 నిమిషాలుంది. ఇందులో శ్రద్ధ అనే అమ్మాయి బోల్డ్, స్లైలిష్ గా ఉంటుంది. వాలీబాల్ స్టార్ ఆదిని లవ్ చేస్తుంది. ఆమె పేరేంట్స్ ఓ రోజు వేరే ఊరికి వెళ్తారు. ఆ నైట్ శ్రద్ధ, ఆది వర్జినిటీ కోల్పోవడానికి ప్లాన్ చేసుకుంటారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది సస్పెన్స్.

ఈ ఆంథాలజీ వెబ్ సిరీస్ ష్.. సీజన్ 2కు గౌతమ్, రవిశంకర్, వినోద్, అమిత్, మథివనన్ డైరెక్టర్లు. ఇందులో వెట్రి, ప్రేమ్ జీ, వేదిక, జినాల్ జోషి, ఐశ్వర్య దత్తా, అరోరా తదితరులు నటించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం