Bold Web Series OTT: ఓటీటీలోకి మరింత బోల్డ్‌గా వస్తున్న వెబ్ సిరీస్ మూడో సీజన్ సెకండ్ పార్ట్.. టీజర్‌లోనే బోల్డ్‌నెస్
Bold Web Series OTT: ఓ బోల్డ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ రెండో పార్ట్ లో మరింత బోల్డ్ గా వస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ బుధవారం (ఫిబ్రవరి 12) రిలీజ్ కాగా.. త్వరలోనూ ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుంది.

Bold Web Series OTT: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో బోల్డ్ కంటెంట్ కు ఏమాత్రం కరువు లేదు. అయితే అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఐదేళ్ల కిందట వచ్చిన ఆశ్రమ్ వెబ్ సిరీస్ మాత్రం వీటన్నింటిలోనూ ప్రత్యేకం అని చెప్పొచ్చు. బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ లీడ్ రోల్ పోషించిన ఈ సిరీస్ మూడో సీజన్ రెండో పార్ట్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. తాజాగా బుధవారం (ఫిబ్రవరి 12) టీజర్ రిలీజ్ చేశారు.
ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2 టీజర్
అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఏక్ బద్నామ్ ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2 రానుంది. ఈ బోల్డ్ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటికే వచ్చిన మూడు సీజన్లు బోల్డ్ కంటెంట్ తోపాటు మంచి సస్పెన్స్ తోనూ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో సీజన్ పార్ట్ 2 మరింత బోల్డ్ గా రాబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.
తనతోపాటు ఎంతో మందిని భక్తి పేరుతో మోసం చేస్తున్న దొంగ బాబా నిరాళా ఆట కట్టించడానికి రెజ్లర్ పమ్మీ మరోసారి ఆశ్రమంలోకి రావడం ఇందులో చూడొచ్చు. తన పగను పక్కన పెట్టి పూర్తిగా బాబాకు అంకితమైనట్లు ఆమె నటిస్తుంది. అయితే ఈ టీజర్లో ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే.. ఈ సీజన్లో బాబాతోపాటు అతని అసిస్టెంట్ బొప్పాను కూడా పమ్మీ టెంప్ట్ చేయనున్నట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.
ఈ టీజర్ కోసం పాత హిట్ హిందీ సాంగ్ దునియా మే లోగోంకో వాడటం విశేషం. ఈ మూడో సీజన్ పార్ట్ 2 స్ట్రీమింగ్ తేదీని ఎంఎక్స్ ప్లేయర్ ఇంకా అనౌన్స్ చేయలేదు. త్వరలోనే రానున్నట్లు మాత్రం వెల్లడించింది.
ఆశ్రమ్ వెబ్ సిరీస్ ఫ్రీగా చూడండి
బాబీ డియోల్ నటించిన ఆశ్రమ్ వెబ్ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే మూడో సీజన్ పార్ట్ 1 మాత్రమే రాగా.. ఇప్పుడు పార్ట్ 2 రాబోతోంది. ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లను అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఫ్రీగా చూసే వీలుంది. ఈ వెబ్ సిరీస్ లో బాబా నిరాళాగా బాబీ డియోల్ నటించాడు. ప్రకాశ్ ఝా ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు.
బాబీతోపాటు అదితి పోహంకర్, త్రిదా చౌదరి, చందన్ రాయ్ సన్యాల్, దర్శన్ కుమార్ లాంటి వాళ్లు నటించారు. ఆశ్రమ్ వెబ్ సిరీస్ తొలి మూడు సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆశ్రమం పేరుతో డ్రగ్స్ దందాతోపాటు అమ్మాయిలను బలవంతంగా లోబర్చుకునే ఓ దొంగ బాబా చుట్టూ తిరిగే స్టోరీ ఇది.
సంబంధిత కథనం