బోల్డ్ ఓటీటీ: ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కేవలం పెద్దలకు మాత్రమే.. మొత్తం అలాంటి కంటెంటే..-bold ott platforms with adult content in india ullu alt balaji kooku voovi rabbit movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బోల్డ్ ఓటీటీ: ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కేవలం పెద్దలకు మాత్రమే.. మొత్తం అలాంటి కంటెంటే..

బోల్డ్ ఓటీటీ: ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కేవలం పెద్దలకు మాత్రమే.. మొత్తం అలాంటి కంటెంటే..

Hari Prasad S HT Telugu

ఓటీటీ వచ్చిన తర్వాత బోల్డ్ కంటెంట్ మన నట్టింట్లోకి వచ్చింది. అయితే ఇండియాలో కేవలం పెద్దలకు మాత్రమే అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఉన్నాయి. వీటి జోలికి పిల్లలను అస్సలు వెళ్లనీయొద్దు. మరి అవేంటో చూడండి.

బోల్డ్ ఓటీటీ: ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కేవలం పెద్దలకు మాత్రమే.. మొత్తం అలాంటి కంటెంటే..

ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్ ఉండాల్సిందే అన్న డిమాండ్ కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలుసు కదా. అంతలా బోల్డ్ కంటెంట్ ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వెళ్తోంది. కొన్నిసార్లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీ లివ్ లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కంటెంట్ లోనూ బోల్డ్ సీన్లు, బూతులు ఉంటున్నాయి. అయితే మొత్తంగా బోల్డ్ కంటెంట్ కోసమే కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? అవేంటో చూడండి.

ఉల్లు ఓటీటీ (Ullu)

ఉల్లు అంటే గుడ్లగూబ అని అర్థం. ఇండియాలో బోల్డ్ కంటెంట్ అందించే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఇదీ ఒకటి. 2018లో మొదలైంది. ప్రతి వారం ఇందులోకి హాట్ హాట్ వెబ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. అంతా ఎ రేటెడ్ కంటెంటే. కేవలం పెద్దలకు మాత్రమే. పిల్లలను అసలు ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దగ్గరికి కూడా వెళ్లనీయొద్దు.

ఏఎల్‌టీ బాలాజీ (ALT Balaji)

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ మొదలుపెట్టిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ ఏఎల్‌టీ బాలాజీ. గంధీ బాత్ అనే వెబ్ సిరీస్ ఇందులో చాలా పాపులర్. అసలు ఇండియాలో బోల్డ్ కంటెంట్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లిన సిరీస్ ఇది. ఈ ప్లాట్‌ఫామ్ అన్నీ అలాంటి సిరీసే కనిపిస్తాయి.

వూవి (Voovi)

ఈ వూవి కూడా అంతే. ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంది. 2022 నుంచీ ఈ ఓటీటీ అందుబాటులోకి వచ్చింది. ఎన్నో బోల్డ్ వెబ్ సిరీస్, అడల్ట్ కంటెంట్ ఇందులో చూడొచ్చు. ఏటీఎం భాబీ, ప్యార్ ఇదర్ ఉదర్ లాంటి సిరీస్ ఇందులో పాపులర్.

కూకు (Kooku)

కూకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 2020లో లాంచ్ అయింది. ఇందులోనూ పెద్దలకు మాత్రమే అనే బోల్డ్ వెబ్ సిరీస్ ఎన్నో ఉన్నాయి.

ఎంఎక్స్ ప్లేయర్ (MX Player)

ఈమధ్యే అమెజాన్ కొనుగోలు చేసిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్. ఇందులో అన్ని జానర్ల కంటెంట్ ఉన్నా కూడా గతంలో కాస్త బోల్డ్ కంటెంట్ ఎక్కువగా వచ్చేది. ఇప్పటికీ అలాంటి కంటెంట్ చాలానే ఉంది. ఆశ్రమ్, మస్త్రమ్ లాంటి వెబ్ సిరీస్ ఇందులో ఉన్నాయి.

వావ్ (Woow)

వావ్ కూడా అడల్ట్ కంటెంట్ మాత్రమే అందించే మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్. దీంతోపాటు బేషరమ్స్, అత్రంగిలాంటివి కూడా బోల్డ్ వెబ్ సిరీస్ ఉన్న ఓటీటీలే.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం