OTT Bold Movie: ఓటీటీ టాప్ 1 ప్లేసులో ఆ బోల్డ్ మూవీ ట్రెండింగ్.. ఏ ఓటీటీలో చూడాలో తెలుసా?-bold movie mix up ott streaming on aha and response mix up trending in top 1 place ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Bold Movie: ఓటీటీ టాప్ 1 ప్లేసులో ఆ బోల్డ్ మూవీ ట్రెండింగ్.. ఏ ఓటీటీలో చూడాలో తెలుసా?

OTT Bold Movie: ఓటీటీ టాప్ 1 ప్లేసులో ఆ బోల్డ్ మూవీ ట్రెండింగ్.. ఏ ఓటీటీలో చూడాలో తెలుసా?

Sanjiv Kumar HT Telugu
Mar 25, 2024 11:16 AM IST

Mix Up OTT Trending: ఓటీటీలోకి వివిధ రకమైన జోనర్లతో సినిమాలు వచ్చేస్తుంటాయి. వాటిలో బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ఉంటాయి. అలా ఇటీవల వచ్చిన బోల్డ్ మూవీ మిక్స్ అప్ ఓటీటీలో టాప్ 1 ప్లేసులో ట్రెండ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎక్కడ చూడాలనే వివరాల్లోకి వెళితే..

ఓటీటీ టాప్ 1 ప్లేసులో ఆ బోల్డ్ మూవీ ట్రెండింగ్.. ఏ ఓటీటీలో చూడాలో తెలుసా?
ఓటీటీ టాప్ 1 ప్లేసులో ఆ బోల్డ్ మూవీ ట్రెండింగ్.. ఏ ఓటీటీలో చూడాలో తెలుసా?

OTT Bold Movie Mix Up: ఎప్పటికప్పుడు సరికొత్త, విభిన్నమైన, డిఫరెంట్ జోనర్ల సినిమాలు, వెబ్ సిరీసులను ఓటీటీ ప్రేక్షకులకు అందిస్తుంటాయి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్. కాన్సెప్ట్ బాగుండి, సరికొత్తగా ఉంటే ఎలాంటి జోనర్ సినిమాలనైనా ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. కొన్నిసార్లు థియేటర్లలో ఆడని చిత్రాలు సైతం ఓటీటీలో మంచి క్రేజ్ తెచ్చుకుంటాయి. ఇక నేరుగా ఓటీటీలోకి వచ్చే సినిమాల్లో కొన్ని వర్కౌట్ కాకపోతే.. మరికొన్ని బాగా ట్రెండ్ అవుతాయి.

అలాంటి వాటిలో ఇటీవల వచ్చిన బోల్డ్ కంటెంట్ మూవీ ఒకటి ఓటీటీలో టాప్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమా పేరే మిక్స్ అప్. న్యూ ఏజ్ బోల్డ్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో కమల్ కామరాజు, పూజా జావేరి, ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ మెయిన్ పాత్రలు పోషించారు. వీరితోపాటు పొలిమేర, పొలిమేర 2, విరూపాక్ష సినిమాలతో పాపులర్ అయిన కామాక్షి భాస్కర్ల, బిందు చంద్రమౌళి మరో రెండు పాత్రల్లో ఆకట్టుకున్నారు.

బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ సినిమాగా వచ్చిన మిక్స్ అప్ చిత్రానికి ఆకాష్ బిక్కీ దర్శకత్వం వహించారు. స్ప్రింట్ ఫిల్మ్స్ పతాకంపై తిరుమల్ రెడ్డి అమిరెడ్డి నిర్మించారు. ఇక ఈ సినిమాకు కౌశిక్ సంగీతం అందించారు. భార్యాభర్తల మధ్య సెక్సువల్ లైఫ్, ప్రేమ, ఆప్యాయత, గౌరవం వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా నేరుగా మార్చి 15న ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలైంది. స్ట్రీమింగ్ తొలి రోజు నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

గత కొన్ని రోజులుగా ఆహా ఓటీటీలో నెంబర్ వన్ ప్లేసులో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది మిక్స్ అప్ సినిమా. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌లో చూపించిన బోల్డ్ సీన్స్, అడల్ట్ కంటెంట్‌తో తెగ ట్రెండ్ అయింది. ఇప్పుడు ఏకంగా సినిమానే ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా చివరిగా మాత్రం మంచి సందేశం ఇచ్చారు. ఇలా మరోసారి మిక్స్ అప్ సినిమా హైలెట్ అవుతోంది.

ఇక మిక్స అప్ కథ విషయానికొస్తే.. అభయ్ (కమల్ కామరాజు)-నిక్కీ (అక్షర గౌడ), సాహు (ఆదర్శ్ బాలకృష్ణ)-మైథిలీ (పూజా జావేరి) భార్యభర్తలు. వారికి సెక్స్, లవ్ పరంగా సమస్యలు తలెత్తుతాయి. దాంతో ఈ రెండు జంటలు విడి విడిగా సైకాలిజిస్ట్ (బిందు చంద్రమౌళి)ను కలుస్తారు. వారి వాదనలు విన్న ఆ థెరపిస్ట్ తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, ఏదైనా టూర్ ప్లాన్ చేసుకోండని సలహా ఇస్తుంది. డాక్టర్ సలహాతో ఇరు జంటలు గోవాకు వెళ్తాయి.

గోవాకు వెళ్లిన ఈ జంటల మధ్య ఏం జరిగింది? అసలు తమ బంధంలో ఉన్న ఇబ్బందులు ఏంటీ? గోవాకు వెళ్లడానికి ఇంకో కారణం ఏంటీ? సాహు, నిక్కీలకు ఫ్రెండ్ అయిన రీతు (కామాక్షి భాస్కర్ల) పాత్ర ఏంటీ? గోవాలో చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి? చివరికి ఈ రెండు జంటల పరిస్థితి ఏమైంది? వంటి తదితర ఆసక్తిర విషయాలు తెలియాలంటే మిక్స్ అప్ సినిమా చూడాల్సిందే.