ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన హారర్ చిత్రం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి చూడొచ్చంటే..-body horror movie grafted now streaming on amazon prime video ott in telugu also ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన హారర్ చిత్రం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి చూడొచ్చంటే..

ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన హారర్ చిత్రం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి చూడొచ్చంటే..

గ్రాఫ్టెడ్ సినిమా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ బాడీ హారర్ థ్రిల్లర్ చిత్రం తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ థ్రిల్లింగ్‍గా సాగుతుంది.

ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన హారర్ చిత్రం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో..

బాడీ హారర్ సినిమా ‘గ్రాఫ్టెడ్’ గతేడాది సెప్టెంబర్ 12న రిలీజైంది. ఈ న్యూజిలాండ్ ఇంగ్లిష్ మూవీకి శాషా రెయిన్‍బో దర్శకత్వం వహించారు. జెయేనా సన్, జెస్ హాంగ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో క్రూరమైన సన్నివేశాలు కూడా ఉంటాయి. గ్రాఫ్టెడ్ మూవీ ఇటీవలే రెంట్ విధానంలో ఓటీటీలోకి వచ్చింది. అయితే, ఇప్పుడు రెంట్ తొలగిపోయి సాధారణంగా స్ట్రీమ్ అవుతోంది.

స్ట్రీమింగ్ వివరాలివే.. తెలుగులోనూ..

గ్రాఫ్టెడ్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, హిందీలోనూ నేడు (ఏప్రిల్ 29) సాధారణ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.

ఈ చిత్రం గతంలోనే కొన్ని ఓటీటీల్లో రెంటల్ విధానంలో అడుగుపెట్టింది. అయితే, నేడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ తొలగిపోయింది. సాధారణంగా అందుబాటులోకి వచ్చింది. ప్రైమ్ వీడియో సబ్‍స్క్రిప్షన్ ఉన్న వారంతా ఇప్పుడు గ్రాఫ్టెడ్ చిత్రాన్ని చూడొచ్చు.

బాడీ హారర్‌గా..

సాధారణంగా హారర్ చిత్రాలంటే దెయ్యాలు, పిశాచాలతో ఉంటాయి. బాడీ హారర్ జానర్ కాస్త డిఫరెంట్. మనిషే రూపాలు మారుస్తూ భయపెట్టేలా సాగేదే ఈ జానర్. గ్రాఫ్టెడ్ మూవీ బాడీ హారర్‌గా రూపొందింది. ఈ మూవీలో కొన్ని ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు ఉంటాయి. కొన్ని క్రూరంగా అనిపించే సీన్లు కూడా ఉంటాయి. ఈ చిత్రం థ్రిల్లింగ్‍గా సాగుతుంది. ఈ సినిమా రన్‍టైమ్ సుమారు గంటన్నరే.

స్టోరీలైన్

వీ (జొయేనా సన్) అనే అమ్మాయి, అతడి తండ్రికి ముఖం, మెడపై పుట్టుకతోనే కొన్ని మచ్చలు ఉంటాయి. దీంతో వీ బాధపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో పరిశోధన చేసి ఓ సీరమ్ కనిపెట్టిన కొన్ని రోజులకు వీ తండ్రి చనిపోతాడు. తన తండ్రి చేసిన ఓ పరిశోధనను డెవలప్ చేసి తన ముఖాన్ని ఎవరిలాగైనా మార్చేసుకుంటుంది వీ. పాపులారిటీ కోసం ఆమె భయానక పనులు చేస్తుంటుంది. తనకు ప్రమాదం అనుకున్న వారిని మట్టుబెట్టేస్తుంది. వీ ఏమేం చేస్తుంది? పరిస్థితులు ఎలా మారాయి? అనే విషయాలు గ్రాఫ్టెడ్ సినిమాలో ఉంటాయి.

గ్రాఫ్టెడ్ చిత్రంలో జోయేనా సన్, జెస్ హాంగ్‍తో పాటు ఈడెన్ హార్ట్, జారెడ్ టర్నర్, సెపీ టోయా, షియా హూ, జిన్నెట్ మెక్‍డొనాల్డ్ కీరోల్స్ చేశారు. ప్రొపగాండ, ఫ్లురో బ్లాక్ బ్యానర్లపై ముర్రే ఫ్రాన్సిస్, లీలా మీనన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. లచ్లన్ అండర్సన్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీని చూసేయవచ్చు.

కాగా, నవీన్ చంద్ర హీరోగా నటించిన తెలుగు సినిమా 28 డిగ్రీల సెల్సియస్ నేడు (ఏప్రిల్ 29) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంలో నవీన్ సరసన షాలినీ హీరోయిన్‍గా చేశారు. శరీర ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్‍గా ఉండకపోతే హెల్త్ వచ్చే విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీని డైరెక్టర్ అనిల్ విశ్వంత్ తెరకెక్కించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం