Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు నుంచి నయా పోస్టర్.. ఆ రూమర్లకు చెక్ పడినట్టేనా!
Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు సినిమా నుంచి బాబీ డియోల్ కొత్త పోస్టర్ వచ్చింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా దీన్ని మూవీ టీమ్ తీసుకొచ్చింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రంపై క్రేజ్ ఓ రేంజ్‍లో ఉంది. ఈ పీరియడ్ యాక్షన్ మూవీ షూటింగ్ ఐదేళ్ల కిందటే మొదలైనా.. పెండింగ్ పడుతూ వచ్చింది. చాలా ఆలస్యమైంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఏఎం జ్యోతికృష్ణ ఈ మూవీకి దర్శకుడిగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 28వ తేదీన హరి హర వీరమల్లు మూవీని రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ చెబుతోంది. డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక పవన్ నుంచి రానున్న తొలి మూవీ కావటంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా, హరి హర వీరమల్లు చిత్రం నుంచి నేడు (జనవరి 27) ఓ నయా పోస్టర్ వచ్చింది.
కత్తి పట్టిన బాబీ డియోల్
హర హరి వీరమల్లు చిత్రం నుంచి బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నయా పోస్టర్ రిలీజ్ అయింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్ తీసుకొచ్చింది మూవీ టీమ్. ఈ పోస్టర్‌లో బాబీ డియోల్ కత్తి దూస్తున్నట్టుగా ఉంది. ఈ చిత్రంలో మొఘల్ రాజు ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు బాబీ.
వాయిదా రూమర్లకు చెక్ పడినట్టేనా!
హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడుతుందంటూ కొంతకాలంగా రూమర్లు బలంగా వస్తున్నాయి. మార్చి 28న ఈ చిత్రం రాదనే వాదనలు వినిపిస్తున్నాయి. నితిన్ రాబిన్‍హుడ్ చిత్రం మార్చి 28, ‘మ్యాడ్ 2’ మూవీ మార్చి 29 డేట్లను రిలీజ్‍కు లాక్ చేసుకున్నాయి. హరి హర వీరమల్లు వాయిదా పడుతుందనే భరోసాతోనే ఈ చిత్రాలు ఆ డేట్లు ఖరారు చేసుకున్నాయని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. అయితే, కొత్తగా తీసుకొచ్చిన బాబీ డియోల్ పోస్టర్‌లో రిలీజ్ డేట్‍ను మార్చి 28గానే హరి హర వీరమల్లు మూవీ టీమ్ ఉంచింది. దీంతో వాయిదా రూమర్లకు చెక్ పెట్టింది. మరి ఈ చిత్రం మార్చి 28నే వస్తుందో.. ఆలస్యమవుతుందో చూడాలి.
హరి హర వీరమల్లు చిత్రం నుంచి ఇటీవలే మాట వినాలి అంటూ ఫస్ట్ సాంగ్ వచ్చింది. ఈ పాటను పవన్ కల్యాణ్ స్వయంగా పాడారు. ఈ సాంగ్ చాలా పాపులర్ అయింది. ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు.
హరి హర వీరమల్లు సినిమాలో పవన్, బాబీ డియోల్‍తో పాటు నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, పావని రెడ్డి, విక్రమ్‍జీత్ విర్క్, జిస్సు సెంగుప్త కీలకపాత్రలు పోషిస్తున్నారు. మొఘలుల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కోహినూర్ వజ్రాన్ని అపహరించడం చుట్టూ స్టోరీ సాగుతుందని తెలుస్తోంది. క్రిష్ తప్పుకున్నాక జ్యోతి కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని దయాకర్ రావు నిర్మిస్తుండగా.. ఏఎం రత్నం సమర్పిస్తున్నారు.
సుజీత్ దర్శకత్వంలో ఓజీ చిత్రం కూడా పవన్ కల్యాణ్ లైనప్‍లో ఉంది. ఈ సినిమాపై హైప్ మరింత ఎక్కువగా ఉంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని కూడా పవన్ ఫినిష్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొన్ని కీలకమైన శాఖల బాధ్యతలను చేపడుతూ పవన్ బిజీగా ఉన్నారు. అయితే, పెండింగ్‍లో ఉన్న సినిమాలను త్వరలోనే పూర్తి చేస్తానని ఆయన ఇటీవలే చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్