Blurr Trailer: థ్రిల్లింగ్‌గా ఉన్న బ్లర్‌ ట్రైలర్‌.. తాప్సీ నటించి, నిర్మించిన సినిమా ఇది-blurr trailer is thrilling and intriguing ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Blurr Trailer Is Thrilling And Intriguing

Blurr Trailer: థ్రిల్లింగ్‌గా ఉన్న బ్లర్‌ ట్రైలర్‌.. తాప్సీ నటించి, నిర్మించిన సినిమా ఇది

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 04:13 PM IST

Blurr Trailer: థ్రిల్లింగ్‌గా ఉన్న బ్లర్‌ ట్రైలర్‌ వచ్చేసింది. తాప్సీ డ్యుయల్‌ రోల్‌లో నటించి, నిర్మించిన ఈ సినిమాలో పాక్షిక అంధురాలిగా కనిపిస్తోంది. ఓ ఆత్మహత్య చుట్టూ తిరిగే కథ ఈ బ్లర్‌.

బ్లర్ మూవీలో తాప్సీ పన్ను
బ్లర్ మూవీలో తాప్సీ పన్ను

Blurr Trailer: టాలీవుడ్‌, బాలీవుడ్‌ నటి తాప్సీ పన్ను తొలిసారి నిర్మిస్తున్న సినిమా బ్లర్‌ (Blurr). ఈ మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ ట్రైలర్‌ మంగళవారం (నవంబర్‌ 29) రిలీజైంది. ఇందులో తాప్సీ డ్యుయల్‌ రోల్‌లో కనిపిస్తోంది. ఇద్దరిలో ఒకరు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. తన కవల సోదరి గౌతమి ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో చంపేశారని గాయత్రి బలంగా నమ్ముతుంది.

అసలు ఆ ఆత్మహత్య వెనుక ఏం జరిగిందన్నది ఈ మూవీ ప్రధాన కథాంశం. గౌతమి అంధురాలు కాగా.. గాయత్రి పాక్షిక అంధురాలు. గౌతమి ఆత్మహత్య వెనుక కారణమేంటన్ని అన్వేషించే క్రమంలో గాయత్రి చూపు కూడా మందగిస్తూ వస్తుంది. ఇలా అయితే ఏదో ఒకరోజు పూర్తిగా చూపు కోల్పోయే ప్రమాదం ఉన్నదని, వెలుతురు చాలా ప్రమాదమని ఈ ట్రైలర్‌లో ఓ సీన్‌లో డాక్టర్‌ ఆమెతో చెబుతాడు.

ఆ తర్వాత ఆమె తన కళ్లకు గంతలతో కనిపిస్తుంది. ఈ ట్రైలర్‌ మొత్తం ఎంతో థ్రిల్లింగ్‌, ఇంట్రెస్టింగ్‌గా సాగింది. తన కవల సోదరి గౌతమి ఎవరితోనూ డేటింగ్‌లో ఉన్నదని గాయత్రి గుర్తిస్తుంది. ఆ విషయం తన భర్తకు ముందే తెలిసినా ఎందుకు చెప్పలేదంటూ నిలదీస్తుంది. పవన్‌ సోనీ ఈ మూవీకి కథ అందించగా.. అజయ్‌ బెహల్‌ డైరెక్ట్‌ చేశాడు.

ఈ మూవీలో తాప్సీ భర్తగా గుల్షన్‌ దేవయ్య కనిపించాడు. బ్లర్‌ మూవీ జీ5లో డిసెంబర్‌ 9న రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమా గురించి తాప్సీ గతంలో మాట్లాడుతూ.. తాను సగం సినిమాను కళ్లకు గంతలతోనే చేయాల్సి వచ్చిందని చెప్పింది. తాప్సీ ఈ మధ్యే దొబారా అనే మరో థ్రిల్లర్‌లోనూ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు పాజిటివ్‌ రివ్యూలే వచ్చినా.. బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది.

జీస్టూడియోస్‌, ఔట్‌సైడర్‌ ఫిల్మ్స్, ఎకెలోన్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాలో కొంత భాగాన్ని నైనితాల్‌లోని చారిత్రక భవనాల్లో చిత్రీకరించారు. ఈ సినిమా కథ వినగానే సరే అన్నానని, సగం సినిమా కళ్లకు గంతలతోనే తీసినట్లు చెప్పిన తాప్సీ.. నిజమైన గాయాలు కూడా అయినట్లు తెలిపింది.

IPL_Entry_Point