Blurr Movie Review: బ్లర్ మూవీ రివ్యూ - తాప్సీ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే
Blurr Movie Review: తాప్సీ హీరోయిన్‌గా నటించిన బ్లర్ (Blurr) సినిమా డిసెంబర్ 9న (నేడు) జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్పానిష్ చిత్రం జూలియస్ ఐస్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణంలో తాప్సీ భాగస్వామిగా వ్యవహరించింది.
Blurr Movie Review: తాప్సీ(Taapsee) ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ సినిమా బ్లర్ శుక్రవారం (నేడు) థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా జీ5 (Zee5 OTT)ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్పానిష్ చిత్రం జూలియస్ ఐస్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు అజయ్ భల్ దర్శకత్వం వహించారు. తాప్సీ హీరోయిన్‌గా నటిస్తూ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందంటే...
ట్రెండింగ్ వార్తలు
ట్విన్ సిస్టర్స్ కథ...
గౌతమి, గాయత్రి ట్విన్ సిస్టర్స్. గౌతమి (తాప్సీ)అంధురాలు. అనుమానస్పద స్థితిలో ఇంటిలోనే ఉరివేసుకొని చనిపోతుంది. పోలీసులు ఆమెది ఆత్మహత్య అని డిసైడ్ చేస్తారు. కానీ గాయత్రి (తాప్పీ) మాత్రం తన సోదరి ఆత్మహత్య చేసుకోలేదని నమ్ముతుంది. ఆమె మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందని చెబుతుంది కానీ ఆమె మాటలను ఎవరు నమ్మరు. ఆ మిస్టరీ ఏమిటి? గౌతమి మరణానికి కారణమైన అదృశ్యశక్తి ఎవరు? కంటికి కనిపించని ఆ శత్రువుతో గాయత్రి ఎలాంటి పోరాటం సాగించిందన్నదే ఈ సినిమా కథ.
స్పానిష్ రీమేక్...
స్పానిష్ ఫిల్మ్ జూలియస్ ఐస్‌కు ( Julia's Eyes) రీమేక్‌గా బ్లర్ సినిమా తెరకెక్కింది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశానికి ఊహలకు అందని మలుపులను జోడిస్తూ దర్శకుడు అజయ్ భల్ ఈ సినిమాను తెరకెక్కించారు. చీకటి వెలుగుల మధ్య ఉండే భయాన్ని ఆవిష్కరిస్తూ రూపొందిన సినిమా ఇది. సింపుల్ పాయింట్‌ను దర్శకుడు చివరి వరకు థ్రిల్లింగ్‌గా నడిపించారు.
హారర్ పాయింట్‌తో మొదలై…
బ్లర్ సినిమా హారర్ పాయింట్‌తో మొదలవుతుంది. తనను ఎవరో వెంటాడుతున్నట్లుగా గౌతమి భ్రమపడటం, ఉరి వేసుకుని చనిపోయే సీన్‌తోనే దర్శకుడు నేరుగా కథను మొదలుపెట్టాడు. గౌతమిది ఆత్మహత్య కాదని, ఆమెను ఎవరో చంపారని గాయత్రి అనుమానపడటం, ఆమె మాటలను ఎవరు నమ్మకపోవడం లాంటి అంశాల చుట్టూ అల్లుకున్న డ్రామా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.
గౌతమి మర్డర్‌కు సంబంధించి గాయత్రి ఒక్కో క్లూను సేకరించడానికి ప్రయత్నించడం, ఆమె వెళ్లిన ప్రతి చోటుకు కనిపించని అదృశ్య శక్తి ఫాలో కావడం లాంటి సీన్స్ తో ప్రతి క్షణం ఏదో జరుగబోతుందోననే సస్పెన్స్ చివరి వరకు మెయింటేన్ చేశారు డైరెక్టర్. ఈ హత్యలకు కారణం ఎవరనే ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత సినిమాపై ఆసక్తి లోపిస్తుంది. రెగ్యులర్ థ్రిల్లర్ ఫార్మెట్‌లో సినిమాను ఎండ్ చేశారు.
తాప్సీ హైలైట్...
గాయత్రి పాత్రలో తాప్సీ చక్కటి నటనను కనబరిచింది. ఓ వైపు డీ జనరేటివ్ ఐ డిజార్డర్ సమస్యతో బాధపడుతూనే నిజం కోసం అన్వేషించే యువతి పాత్రలో ఒదిగిపోయింది. క్యారెక్టర్‌లో పూర్తిగా లీనమై నటించింది. తాప్సీ భర్త నీల్‌గా గుల్షన్ దేవయ్య పాత్ర పర్వాలేదనిపిస్తుంది. దీపక్ పాత్రలో అభిలాష్ కొన్ని సీన్స్‌లో భయపెట్టాడు.
Blurr Movie Review- ఒరిజినల్ కాపీ పేస్ట్...
స్పానిష్ ఒరిజినల్ చూసిన వారికి బ్లర్ అంతగా నచ్చదు. ఎక్కువగా మార్పులు లేకుండా ఒరిజినల్‌లో ఉన్నది ఉన్నట్లుగా కాపీ పేస్ట్ చేశారు. అయితే తాప్సీ నటన కోసం బ్లర్ సినిమాను ఓ సారి చూడొచ్చు.