Blockbuster Pongal Song Lyrics: సంక్రాంతికి వస్తున్నాం నుంచి బ్లాక్‌బస్టర్ పొంగల్ సాంగ్.. వెంకీ పాడిన పాట లిరిక్స్ ఇవే
Blockbuster Pongal Song Lyrics: సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తో సంక్రాంతికే వస్తున్న మూవీ ఇది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన రెండు పాటలూ ఇన్‌స్టాంట్ హిట్ కాగా.. తాజాగా బ్లాక్‌బస్టరు పొంగలు అంటూ మూడో పాట్ కూడా అదిరిపోయే బీట్‌తో ఉర్రూతలూగిస్తోంది.
Blockbuster Pongal Song Lyrics: సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి వెంకటేశ్ పాడిన పాటను సోమవారం (డిసెంబర్ 30) రిలీజ్ చేశారు ఈ మూవీ మేకర్స్. బ్లాక్‌బస్టర్ పొంగల్ అంటూ సాగిపోయిన ఈ పాటకు బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా.. వెంకటేశ్, భీమ్స్ సిసిరోలియో, రోహిణి సోరట్ పాడారు. ఇప్పటి వరకూ వచ్చిన రెండు పాటల్లాగే ఈ సాంగ్ కూడా ఇన్‌స్టాంట్ హిట్ అయింది. మరి ఈ సాంగ్ లిరిక్స్ చూసి మీరు కూడా వెంకీ మామలాగా కాస్త గొంతు సవరించుకోండి.
బ్లాక్‌బస్టర్ పొంగల్ సాంగ్ ఇలా..
సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి ఇప్పటికే గోదారి గట్టు అంటూ వచ్చిన పాట ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. ఎక్కడ చూసినా ఈ పాట రీల్సే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు బ్లాక్‌బస్టర్ పొంగల్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మరో అదిరిపోయే సాంగ్ అందించాడు. ఈ పాటను వెంకటేశ్ కూడా పాడటం విశేషం. అంతేకాదు మూవీలో ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించిన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లతో వెంకీ వేసిన స్టెప్పులు కూడా అదుర్స్ అనేలా ఉన్నాయి. పాట మొత్తం అతడు లుంగీపైనే కనిపిస్తాడు.
సంక్రాంతి పండగను రెండు వారాల ముందే తీసుకొచ్చింది వెంకీ మామ పాడిన ఈ పాట. సర్వస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. గొబ్బియల్లో అంటూనే ఈ జనరేషన్ కు తగినట్లుగా ట్రెండీగా ఈ లిరిక్స్ ఉండటం విశేషం. సంక్రాంతికి వస్తున్నాం మూవీ జనవరి 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నాడు. సంక్రాంతికే వస్తున్న డాకూ మహరాజ్, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలతో ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీ పోటీ పడనుంది. ఇప్పటికే అనిల్ రావిపూడితో కలిసి ఎఫ్2, ఎఫ్3లాంటి మూవీస్ చేసిన కడుపుబ్బా నవ్వించిన వెంకటేశ్.. ఇప్పుడీ సినిమాతో మరింత నవ్వించబోతున్నాడు.
బ్లాక్‌బస్టర్ పొంగల్ సాంగ్ లిరిక్స్ ఇవే
ఏ.. కొక్కొరొకో కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకీ..
ఎంతలేసి వణికిందో.. ఏ మూలా పండుకుందో..
రథం ముగ్గు ఏసుకుంట.. ఏటుకూరి నాగలచ్చిమి..
ఎంత దూరమెళ్లిందో.. ఎటు పోయిందో..
హే.. గొబ్బియల్లో.. గొబ్బియల్లో..
పండగొచ్చె గొబ్బియల్లో..
ఎవ్రీబాడీ గొబ్బియల్లో
సింగ్ దిస్ మెలోడీ గొబ్బియల్లో..
పెద్ద పండగండీ గొబ్బియల్లో..
లెట్స్ గెట్ ట్రెండీ గొబ్బియల్లో.. కమాన్..
బేసికల్లీ.. టెక్నికల్లీ.. లాజికల్లీ.. ప్రాక్టికల్లీ..
బేసికల్లీ.. టెక్నికల్లీ.. లాజికల్లీ.. ప్రాక్టికల్లీ..
అండ్ ఫైనల్లీ.. ఇట్స్ యాన్ యాటిట్యూడు పొంగలూ..
ఇట్స్ ఎ బ్లాక్‌బస్టరు పొంగలూ..
గర్ల్స్ గర్ల్స్ గర్ల్స్.. నో దంగల్.. సెలబ్రేట్ ద పొంగల్..
హే.. గొబ్బియల్లో.. గొబ్బియల్లో..
పండగొచ్చె గొబ్బియల్లో..
ఎవ్రీ ఇయరూ గొబ్బియల్లో..
కమ్ టు పల్లెటూరు గొబ్బియల్లో..
కలిసి మెలిసి గొబ్బియల్లో..
లెట్స్ హావ్ ఫన్నూ గొబ్బియల్లో..
యాక్చువల్లీ.. యానువల్లీ.. కలరుఫుల్లీ.. హౌజ్‌ఫుల్లీ..
యాక్చువల్లీ.. యానువల్లీ.. కలరుఫుల్లీ.. హౌజ్‌ఫుల్లీ..
అండ్ ఫైనల్లీ.. ఇట్స్ యాన్ యాటిట్యూడు పొంగలూ..
ఇట్స్ ఎ బ్లాక్‌బస్టరు పొంగలూ..