బ్లాక్‌బస్టర్ మలయాళం కామెడీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన సినిమా-blockbuster malayalam comedy movie prince and family ott release date zee5 ott malayalam movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బ్లాక్‌బస్టర్ మలయాళం కామెడీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన సినిమా

బ్లాక్‌బస్టర్ మలయాళం కామెడీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన సినిమా

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి మరో మలయాళం కామెడీ డ్రామా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాలలో ఆరో స్థానంలో నిలిచిన మూవీ ఇది. వచ్చే వారం ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుంది.

బ్లాక్‌బస్టర్ మలయాళం కామెడీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన సినిమా

మలయాళ స్టార్ నటుడు దిలీప్ నటించిన తాజా మూవీ 'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ'. ఈ మూవీ త్వరలోనే డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా జూన్ 20 నుండి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. గత నెలలోనే థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించిన మూవీ ఇది.

'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ' ఓటీటీ రిలీజ్

మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటి ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ. దిలీప్, సిద్ధిక్, రానియా, ధ్యాన్ శ్రీనివాసన్, జానీ ఆంటోనీ, మంజు పిళ్ళైలాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ మే 9న థియేటర్లలో రిలీజ్ కాగా.. జూన్ 20 నుంచి జీ5 ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

ఈ మూవీ థియేటర్లలో మంచి ప్రదర్శన కనబరిచి, కుటుంబ ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించింది. 2017లో వచ్చిన 'రామలీల' తర్వాత నటుడు దిలీప్ కు మంచి వసూళ్లు సాధించి పెట్టిన సినిమాగా ఈ ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర రూ.25.47 కోట్లు వసూలు చేసింది.

ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ గురించి..

ఈ సినిమాలో ప్రధాన పాత్ర ప్రిన్స్ చక్రక్కల్ (దిలీప్). అతనికి ఇంకా పెళ్లి కాదు. తన కుటుంబానికి అతడే పెద్ద దిక్కు. జీవిత భాగస్వామిని కనుగొనడం కష్టంగా ఉండటంతో అతను ఒంటరిగా, నిరాశగా భావిస్తూ ఉంటాడు. అయితే, ఒక మ్యారేజ్ వెబ్‌సైట్ నుండి వచ్చిన ఒక ప్రపోజల్ ప్రిన్స్, అతని కుటుంబ సభ్యుల జీవితాలను తారుమారు చేస్తుంది. పెళ్లికూతురు బట్టల షాపు నడిపే ప్రిన్స్ స్వభావానికి పూర్తి భిన్నమైన అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది.

ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ లో కామెడీతోపాటు సెకండాఫ్ లో సోషల్ మీడియాలోని లోపాల గురించి కూడా ఈ సినిమా చర్చిస్తుంది. తొలిసారి దర్శకత్వం వహించిన బింగో స్టీఫెన్స్ మరోసారి దిలీప్ ను అతనికి సూటయ్యే కామెడీ పాత్రలో చూపించినట్లు ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చారు. ఈ బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీని మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్ పై నిర్మించగా.. జూన్ 20 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం