Black Panther 2 OTT Release Date: ఆస్కార్ నామినేటెడ్ మార్వెల్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది - రిలీజ్ డేట్ ఇదే
Black Panther 2 OTT Release Date: ఆస్కార్‌కు నామినేట్ అయిన మార్వెల్ మూవీ బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ ఓటీటీలోకి రాబోతున్నది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...
Black Panther 2 OTT Release Date: మార్వెల్ మూవీ బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ ఓటీటీలోకి రాబోతున్నది. ఈ సూపర్ హీరో సినిమా ఫిబ్రవరి 1న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. ఇంగ్లీష్‌తో భారతీయ భాషలన్నింటిలో బ్లాక్ పాంథర్ -2ను రిలీజ్ చేయబోతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
2018లో వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమాకు సీక్వెల్‌గా బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ సినిమ రూపొందింది. ఇటీవల అనౌన్స్ చేసిన 95వ ఆస్కార్ నామినేషన్స్‌లో బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ నాలుగు విభాగాల్లో నామినేట్ అయ్యింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్- హెయిర్ స్టైలింగ్ విభాగాల్లో ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్‌ను దక్కించుకున్నది. ఈ నాలుగింటిలో ఏదో ఒక విభాగానికి ఆస్కార్ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
250 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ 840 మిలియన్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 2018లో విడుదైలన బ్లాక్ పాంథర్ సినిమాలో టైటిల్ పాత్రలో చాడ్విక్ బోస్‌మన్ నటించాడు. 2020లో క్యాన్సర్‌తో అతడు కన్నుమూశాడు. అతడి మరణంతోనే ఈ సీక్వెల్ కథ మొదలవుతోంది.
బ్లాక్ పాంథర్ మరణంతో వకాండాలో ఉన్న విలువైన వైబ్రేనియం ఖనిజం కోసం శత్రువులు దాడులు చేయడం మొదలుపెడతారు. ఆ దాడులను బ్లాక్ పాంథర్ సోదరితో పాటు అతడి అనుచరులు ఎలా ఎదుర్కొన్నారన్నదే ఈ సీక్వెల్ కథ. చాడ్విక్ బోస్‌మన్‌కు నివాళిగా బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ సినిమాను రూపొందించారు.
మార్వెల్ సినిమాల్లో భారీ కలెక్షన్స్ రాబట్టిన వాటిలో ఒకటిగా బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ నిలిచింది.ఇందులో లెటీటీయా రైట్, నయోంగో, డానియల్ గుర్రిరా, విన్‌స్టన్ డ్యూక్ ప్రధాన పాత్రల్లో నటించారు.