స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు తెలుగు నాట ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. చియాన్ విక్రమ్ నట వారసుడుగా ఆయన కుమారుడు ధృవ్ హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ధృవ్ హీరోగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం బైసన్.
అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్స్‌పై బైసన్ సినిమాను రూపొందించారు. ఈ మూవీకి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. బైసన్ సినిమాలో ధృవ్‌కు జోడీగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసింది. మరో హీరోయిన్ రజీషా విజయన్ కీలక పాత్ర పోషించింది.
అక్టోబర్ 24న తెలుగు రాష్ట్రాల్లో బైసన్ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా (అక్టోబర్ 13) సోమవారం రాత్రి 9 గంటల సమయంలో బైసన్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రా అండ్ రస్టిక్ సీన్లతో బైసన్ సినిమాను కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. సినిమా అంతా కబడ్డీ చుట్టు సాగుతుంది.
ఓ గ్రామంలో కబడ్డీ, రాజకీయ పరమైన అంశాలు, హత్యలు, కుటుంబాల ఎమోషన్ వంటి అన్ని రకాల ఎలిమెంట్స్‌తో పక్కా రస్టిక్‌గా తెరకెక్కించారు. ట్రైలర్‌లో ఫస్ట్ షాట్ బర్రె పుర్రెను చూపించడం, చివరిలో అదే పుర్రెను హీరో తండ్రి నీళ్లలో పడేయడం వంటి సీన్స్ బిగినింగ్, ఎండింగ్ బాగా ఆకట్టుకున్నాయి.
బైసన్ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌తో లవ్ ట్రాక్, కబడ్డీ ప్లేయర్ కోసం హీరో పడే కష్టం, దాన్ని వద్దని చెప్పే తండ్రి, ఓ పొలిటిషియన్, హత్యలు, హింస ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా బైసన్ ట్రైలర్ సాగింది.
కబడ్డీ వద్దని చెప్పే తండ్రి చివరిలో చేయికి కట్టు ఉన్న హీరో పుషప్స్ చేసేటప్పుడు పక్కనే ఉండే సీన్ హైలెట్‌గా ఉంది. ఇక బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. చాలా డ్రామాటిక్‌గా ప్రారంభమైన బైసన్ ట్రైలర్ చివరి వరకు డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ఈ సినిమా అంతా 1990 కాలం నాటి పరిస్థితుల చుట్టు సాగుతుందని తెలుస్తోంది.
సంబంధిత కథనం