Biggest Hit Movie: ఇండియాలో ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే.. 25 కోట్ల టికెట్లు.. అత్యధిక వసూళ్లు
Biggest Hit Movie: ఇండియాలో ఎక్కువ మంది చూసిన సినిమా ఏదో తెలుసా? ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయంటే నమ్మగలరా? గతేడాది వచ్చిన జవాన్ మూవీకి అమ్ముడైన టికెట్ల కంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ కావడం విశేషం.
Biggest Hit Movie: ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని కలెక్షన్ల విషయంలో రికార్డులు తిరగరాస్తే.. మరికొన్ని మనసుకు హత్తుకునే స్టోరీలతో ఆకట్టుకున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమా ఏదో తెలుసా? ఈ మూవీకి ఏకంగా 25 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ సినిమా 50 ఏళ్ల కిందట వచ్చి సంచలన విజయం సాధించింది.
ఎక్కువ మంది చూసిన సినిమా షోలే..
ఇండియాలో గత పదేళ్లలో ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్ వచ్చాయి. వందల, వేల కోట్ల వసూళ్లు సాధించాయి. బాహుబలి, కేజీఎఫ్, పఠాన్, జవాన్.. ఇలా ఈ లిస్టు చాలా పెద్దదే. కానీ వీటి కంటే కొన్ని దశాబ్దాల ముందు వచ్చిన ఓ హిందీ సినిమా.. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన ఇండియన్ మూవీగా నిలిచింది. ఆ సినిమా పేరు షోలే.
అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించిన ఈ మూవీకి ఏకంగా 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయంటే నమ్మగలరా? గతేడాది అతిపెద్ద హిట్ గా నిలిచిన షారుక్ ఖాన్ జవాన్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 5 రెట్ల టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఆ లెక్కన చూస్తే షోలే మూవీకి ఐదు రెట్లు ఎక్కువ టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. అంతేకాదు ఇప్పటి ధరలతో పోల్చి చూస్తే ఇప్పటికే ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ కూడా ఇదే.
షోలే.. కల్ట్ క్లాసిక్
షోలే మూవీ 1975లో ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో రిలీజైంది. రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇది. అప్పట్లో ఇండియన్ సినిమాలో ఇదే అత్యధికం. ఇక సుమారు రూ.15 కోట్లు వసూలు చేసింది. దశాబ్దకాలం పాటు అత్యధిక వసూళ్ల మూవీగా నిలిచింది. అంతేకాదు ఇప్పటి ధరలతో పోలిస్తే ఈ మొత్తం ఏకంగా రూ.2800 కోట్లు కావడం విశేషం.
ఆ లెక్కన అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా ఇదే. దంగల్ (రూ.2650 కోట్లు), బాహుబలి 2 (రూ.2170 కోట్లు) సినిమాల కంటే కూడా ఎక్కువే అని చెప్పాలి. ఇక టికెట్ల విషయానికి వస్తే ఒక్క ఇండియాలోనే ఈ సినిమా టికెట్లు 15 కోట్ల వరకూ అమ్ముడయ్యాయి. ఆ తర్వాత రీరిలీజ్ లు కలుపుకుంటే 18 కోట్లు అయ్యాయి. ఇక సోవియట్ యూనియన్ (ఇప్పటి రష్యా)లో మొత్తంగా 6 కోట్ల టికెట్లు, యూరప్, నార్త్ అమెరికా, మిగతా ఆసియా దేశాల్లో 2 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి.
ఆ లెక్కన మూవీ రీరిలీజ్ లతో కలుపుకుంటే మొత్తంగా 25 కోట్ల వరకు టికెట్లు అమ్ముడవడం విశేషం. రమేష్ సిప్పీ డైరెక్ట్ చేసిన షోలే ఓ కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జయా బచ్చన్, హేమా మాలినిలాంటి వాళ్లు ఈ సినిమాలో నటించారు. ఇండియాలో తొలిసారి రిలీజ్ అయినప్పుడు రూ.15 కోట్ల వరకు వసూలు చేసిన ఈ సినిమా.. రీరిలీజ్ లు కలుపుకుంటే రూ.35 కోట్ల వరకు వెళ్లింది.
ఫ్లాప్ మూవీ అనుకుంటే..
నిజానికి షోలే మొదట్లో రిలీజైనప్పుడు ఓ పెద్ద ఫ్లాప్ మూవీ అనుకున్నారు. తొలిరోజు అయితే దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. అప్పట్లోనే రూ.3 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ కావడంతో ప్రొడ్యూసర్లు బెంబేలెత్తిపోయారు. మూవీ క్లైమ్యాక్స కూడా మార్చేద్దామని మేకర్స్ భావించారు. కానీ మూవీ రైటర్లు సలీం-జావెద్ లు వద్దని వారించారు.
అయితే రెండు రోజుల తర్వాత మెల్లగా షోలే పాజిటివ్ టాక్ మొదలైంది. అది కాస్తా ఓ ప్రభంజనంలా మారింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా క్రియేట్ చేసిన హల్చల్ అంతాఇంతా కాదు. అదే ఊపులో రికార్డు కలెక్షన్లు, రికార్డు టికెట్ల అమ్మకాలతో దుమ్ము రేపింది.
టాపిక్