Biggest Hit Movie: ఇండియన్ సినిమాలో అతిపెద్ద హిట్.. రూ.25 లక్షల బడ్జెట్.. 5 కోట్ల కలెక్షన్లు.. హీరో, విలన్ లేకుండానే..-biggest hit movie in india jai santoshi maa 2000 percent profit budget 25 lakhs box office collection 5 crores ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Biggest Hit Movie: ఇండియన్ సినిమాలో అతిపెద్ద హిట్.. రూ.25 లక్షల బడ్జెట్.. 5 కోట్ల కలెక్షన్లు.. హీరో, విలన్ లేకుండానే..

Biggest Hit Movie: ఇండియన్ సినిమాలో అతిపెద్ద హిట్.. రూ.25 లక్షల బడ్జెట్.. 5 కోట్ల కలెక్షన్లు.. హీరో, విలన్ లేకుండానే..

Hari Prasad S HT Telugu
Published Jun 15, 2024 09:05 AM IST

Biggest Hit Movie: ఇండియన్ సినిమా చరిత్రలో ఓ చిన్న సినిమాకు అత్యధిక లాభాలు ఆర్జించిన మూవీగా పేరుంది. కేవలం రూ.25 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.5 కోట్లు వసూలు చేయడం విశేషం.

ఇండియన్ సినిమాలో అతిపెద్ద హిట్.. రూ.25 లక్షల బడ్జెట్.. 5 కోట్ల కలెక్షన్లు.. హీరో, విలన్ లేకుండానే..
ఇండియన్ సినిమాలో అతిపెద్ద హిట్.. రూ.25 లక్షల బడ్జెట్.. 5 కోట్ల కలెక్షన్లు.. హీరో, విలన్ లేకుండానే..

Biggest Hit Movie: ఇండియన్ సినిమాలో గత కొన్నేళ్లుగా వందలు, వేల కోట్లు వసూలు చేస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఈ సినిమాలను అదే స్థాయిలో భారీ బడ్జెట్ లతోనే రూపొందిస్తున్నారు. దీంతో లాభాల పరంగా చూస్తే మరీ అంత ఎక్కువగా అనిపించదు. కానీ 1970ల్లో కేవలం రూ.25 లక్షల బడ్జెట్ తో వచ్చిన ఓ సినిమా ఏకంగా రూ.5 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలుసా? ఇప్పటికే అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమాగా నిలుస్తోంది.

బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే

మనం చెప్పుకోబోయే సినిమా 1970ల్లో వచ్చింది. అప్పట్లో హిందీ సినిమాలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలాంటి స్టార్ హీరోల హవా నడుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో అసలు హీరో, విలన్, హీరోయిన్ లాంటి వాళ్లు లేకుండా వచ్చిన ఓ చిన్న సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఆ సినిమా పేరు జై సంతోషి మా. ఈ డివోషనల్ మూవీ కేవలం రూ.25 లక్షల బడ్జెట్ తో తెరకెక్కింది.

అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఏకంగా రూ.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి ధరలతో పోల్చి చూస్తే.. సుమారు రూ.1000 కోట్లుగా చెప్పొచ్చు. ఈ ఆధ్యాత్మిక మూవీ అప్పట్లో ఓ సంచలనం. హిందీ సినిమాలోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. బడ్జెట్ కంటే సుమారు 2000 శాతం ఎక్కువ వసూళ్లు సాధించిన ఏకైన భారతీయ సినిమా ఇదే కావడం విశేషం.

జై సంతోషి మా రికార్డు

1970ల్లో హిందీతోపాటు మిగతా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలు కూడా మెల్లగా కుటుంబ కథల నుంచి యాక్షన్ ఎంటర్టైనర్‌ల వైపు వెళ్తున్న కాలం. అలాంటి సమయంలో జై సంతోషి మా మూవీ ఊహించని రికార్డును సొంతం చేసుకుంది. విజయ్ శర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. స్టార్లు కాదు కదా అసలు హీరో, హీరోయిన్, విలన్ లాంటి వాళ్లు లేకుండా సాధారణ నటీనటులతోనే తీసిన సినిమా ఇది.

ఉత్తర భారతదేశంలోని పల్లెల్లో ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. అదే ఏడాది రిలీజైన హిందీ బ్లాక్ బస్టర్ మూవీ షోలేని కూడా కొన్ని చోట్ల ఈ సినిమా మించిపోయిందంటే ఏస్థాయిలో ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలోనే షోలే సినిమాను సుమారు రూ. 3 కోట్ల బడ్జెట్ తో తీశారు. ఇది చాలా ఎక్కువనే చెప్పాలి.

ఆ మూవీ తన బడ్జెట్ కంటే ఐదు రెట్లు ఎక్కువగా అంటే రూ.15 కోట్లు వసూలు చేసింది. ఆ లెక్కన చూసినా షోలే మూవీ లాభాలు 400 శాతంగానే ఉన్నాయి. జై సంతోషి మాతో పోలిస్తే రీసెంట్ హిట్స్ బాహుబలి 2 (600 శాతం లాభాలు), దంగల్ (1000 శాతం), ఆర్ఆర్ఆర్ (150 శాతం) సినిమాలకు వచ్చిన లాభాలు చాలా తక్కువే. ఇక ఇదే సినిమాను 2006లో రీమేక్ చేశారు. అప్పుడు కూడా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించింది.

Whats_app_banner