Biggest Hit Movie: కేవలం రూ.60 కోట్ల బడ్జెట్.. 11 రోజుల్లోనే రూ.560 కోట్ల కలెక్షన్లు.. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ చూశారా?-biggest hit movie horror comedy stree 2 budget 60 crores box office collections in 11 days 560 crores ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Biggest Hit Movie: కేవలం రూ.60 కోట్ల బడ్జెట్.. 11 రోజుల్లోనే రూ.560 కోట్ల కలెక్షన్లు.. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ చూశారా?

Biggest Hit Movie: కేవలం రూ.60 కోట్ల బడ్జెట్.. 11 రోజుల్లోనే రూ.560 కోట్ల కలెక్షన్లు.. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ చూశారా?

Hari Prasad S HT Telugu
Aug 26, 2024 02:06 PM IST

Biggest Hit Movie: కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఓ చిన్న సినిమా 11 రోజుల్లోనే రూ.560 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అత్యంత విజయవంతమైన, లాభాలు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిందీ హారర్ కామెడీ మూవీ.

కేవలం రూ.60 కోట్ల బడ్జెట్.. 11 రోజుల్లోనే రూ.560 కోట్ల కలెక్షన్లు.. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ చూశారా?
కేవలం రూ.60 కోట్ల బడ్జెట్.. 11 రోజుల్లోనే రూ.560 కోట్ల కలెక్షన్లు.. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ చూశారా?

Biggest Hit Movie: తక్కువ బడ్జెట్.. భారీ లాభాలు.. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తున్నాయి. భారీ బడ్జెట్, పెద్ద పెద్ద స్టార్లు ఎవరూ లేకపోయినా కేవలం కథనే నమ్ముకొని ఈ మూవీస్ లాభాల పంట పండిస్తున్నాయి. అలాంటి సినిమానే ఇప్పుడు బాలీవుడ్ నూ ఊపేస్తోంది. ఈ హారర్ కామెడీ మూవీ పేరు స్త్రీ 2.

బిగ్గెస్ట్ హిట్ మూవీ స్త్రీ2

2024లో రిలీజైన సినిమాల్లో అత్యంత లాభదాయకమైన సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది స్త్రీ2. ఆరేళ్ల కిందట అంటే 2018లో వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ హారర్ కామెడీ సినిమా కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే నాడు రిలీజై సంచలనం విజయం సాధించింది.

ఇప్పటికి 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.560 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి దూసుకెళ్తోంది. పైగా ఈ సినిమాలో బాలీవుడ్ కు చెందిన పెద్ద పెద్ద స్టార్లు కూడా ఎవరూ లేరు.

స్త్రీ 2 బాక్సాఫీస్ సక్సెస్

అమర్ కౌశిక్ డైరెక్ట్ చేసిన హారర్ కామెడీ మూవీ స్త్రీ 2 ఓ వుమన్ సెంట్రిక్ మూవీ. అలాంటి సినిమా గతేడాది షారుక్ ఖాన్ నటించి భారీ వసూళ్లు సాధించిన సినిమాల కంటే కూడా ఎక్కువ వసూళ్లు సాధిస్తోంది. ఈ ఏడాది ఫస్ట్ వీకెండ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా స్త్రీ 2 నిలిచింది.

ఆ తర్వాత రూ.400 కోట్లు, రూ.500 కోట్ల మార్క్ కూడా సులువుగా అందుకుంది. నిజానికి ఈ మూవీ ఆరో రోజు రూ.25.8 కోట్లు వసూలు చేసింది. ఇది గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన జవాన్ మూవీ ఆరో రోజు కలెక్షన్ల (రూ.24 కోట్లు) కంటే ఎక్కువ కావడం విశేషం.

స్త్రీ 2 సక్సెస్ ఇలా

స్త్రీ 2 మూవీలో రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్, అపర్‌శక్తి ఖురానా, పంకజ్ త్రిపాఠీ, అభిషేక్ బెనర్జీలాంటి వాళ్లు నటించారు. నిజానికి ఈ స్టార్లలో ఎవరికీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్టార్లకు ఉన్న చరిష్మా లేదు. కానీ కేవలం కథనే నమ్ముకొని ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. 11 రోజుల్లో ఇండియాలోనే రూ.474 కోట్ల గ్రాస్ రాగా.. ఓవర్సీస్ కలెక్షన్లు రూ.85.5 కోట్లుగా ఉన్నాయి.

సెకండ్ వీకెండ్ కూడా రూ.93 కోట్లు వసూలు చేయడం చూస్తుంటే.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ సినిమాకు ఇది చాలా చాలా ఎక్కువనే చెప్పాలి.

స్త్రీ2లో హీరో ఎవరు?

స్త్రీ2 మూవీలో హీరో ఎవరు? మూవీ రిలీజై బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్న వేళ ఈ చర్చ జోరుగా నడుస్తోంది. పెద్ద స్టార్ ఎవరూ లేకపోవడంతో రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ లలో ఎవరిది లీడ్ రోల్ అనేది ఈ చర్చ. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన వుమన్ సెంట్రిక్ మూవీస్ లో ఒకటిగా నిలివడంతో ఆ క్రెడిట్ శ్రద్ధా కపూర్ కే ఇవ్వాలని ఒకరు.. రాజ్ కుమార్ రావ్ కూడా తక్కువేమీ కాదని మరొకరు వాదించుకుంటున్నారు.

అయితే అసలు ఈ మూవీ కథ, డైరెక్షన్, ట్రీట్మెంట్ కే ఈ ఘనత దక్కుతుందని.. ఆ లెక్కన అసలు హీరో డైరెక్టర్ అమర్ కౌశిక్ అన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి స్త్రీ 2 మాత్రం బాక్సాఫీస్ దగ్గర తన రికార్డుల పరంపరను కొనసాగిస్తూనే ఉంది.