Biggest Flop Movie: ఒక్క సినిమాతోనే రూ.170 కోట్ల నష్టం.. ఇండియన్ సినిమాలో భారీ నష్టాలను మిగిల్చిన మూవీస్ ఇవే-biggest flop movies in indian cinema prabhas radhe shyam tops the list with 170 crore losses chiranjeevi acharya also ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Biggest Flop Movie: ఒక్క సినిమాతోనే రూ.170 కోట్ల నష్టం.. ఇండియన్ సినిమాలో భారీ నష్టాలను మిగిల్చిన మూవీస్ ఇవే

Biggest Flop Movie: ఒక్క సినిమాతోనే రూ.170 కోట్ల నష్టం.. ఇండియన్ సినిమాలో భారీ నష్టాలను మిగిల్చిన మూవీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Apr 29, 2024 01:57 PM IST

Biggest Flop Movie: ఇండియన్ సినిమాలో భారీ లాభాలు తీసుకొచ్చిన సినిమాలే కాదు.. పీకల్లోతు నష్టాలను మిగిల్చిన మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. అందులో ఒక మూవీ అయితే ఏకంగా రూ.170 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.

ఒక్క సినిమాతోనే రూ.170 కోట్ల నష్టం.. ఇండియన్ సినిమాలో భారీ నష్టాలను మిగిల్చిన మూవీస్ ఇవే
ఒక్క సినిమాతోనే రూ.170 కోట్ల నష్టం.. ఇండియన్ సినిమాలో భారీ నష్టాలను మిగిల్చిన మూవీస్ ఇవే

Biggest Flop Movie: ఒకే ఒక్క సినిమాకు రూ.170 కోట్ల నష్టం వాటిల్లిందంటే నమ్మగలరా? అది కూడా ఓ తెలుగు సినిమా కావడం గమనార్హం. భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఆ మూవీ పేరు రాధేశ్యామ్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఆ మూవీ ఇచ్చిన షాక్ నుంచి ప్రభాస్ ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు. ఇక ఇందులో ఫిమేల్ లీడ్ గా నటించిన పూజా హెగ్డే కూడా ఐరన్ లెగ్ పేరు తెచ్చుకొని టాలీవుడ్ నుంచి వెళ్లిపోయింది.

రాధేశ్యామ్.. రూ.170 కోట్ల నష్టాలు

బాహుబలి, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ పెద్ద పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అందుకే వీటి తర్వాత అతడు నటించిన ప్రతి సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించారు. బాహుబలి 2 తర్వాత మొదట సాహో రిలీజైంది. ఆ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి భారీ నష్టాలనే మిగిల్చింది. అయితే రాధేశ్యామ్ మాత్రం ఊహకందని రీతిలో ఫ్లాపయింది.

ఈ పాన్ ఇండియా మూవీని రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం రూ.130 కోట్ల నెట్ కలెక్షన్లనే రాబట్టింది. దీంతో రూ.170 కోట్ల నష్టం వాటిల్లింది. రెండేళ్ల కిందట రిలీజైన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఆ ఏడాది ఈ మూవీతోపాటు బీస్ట్, ఆచార్య, ఎఫ్3లాంటి సినిమాలు కూడా బోల్తా పడటంతో ఆమె ఇప్పటి వరకూ మరో తెలుగు సినిమా చేయలేదు.

రాధేశ్యామ్ తర్వాత వచ్చిన ఆదిపురుష్ కూడా ప్రభాస్ కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆ సినిమాకు భారీగానే నష్టాలు వచ్చాయి. అయితే మూవీపై ఉన్న అంచనాల నేపథ్యంలో తొలి మూడు రోజుల్లోనే చాలా వరకూ వసూలు చేసి ఈ నష్టాలను కొంత మేర తగ్గించుకోగలిగింది.

భారీ నష్టాలను మిగిల్చిన ఇండియన్ మూవీస్

రాధే శ్యామ్ తర్వాత భారీ నష్టాలను మిగిల్చిన ఇండియన్ మూవీస్ చాలానే ఉన్నాయి. అందులో తర్వాతి స్థానంలో వచ్చేది అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీ. ఈ సినిమాను రూ.220 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా.. రూ.140 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇక రణ్‌బీర్ కపూర్ నటించిన షంషేరా మూవీ రూ.100 కోట్ల నష్టాలతో మూడో స్థానంలో నిలిచింది.

మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ రూ.80 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. 2022లో వచ్చిన ఈ సినిమా చిరు కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన కబ్జా మూవీకి కూడా రూ.80 కోట్ల నష్టాలు వచ్చాయి. ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా కూడా రూ.70 కోట్ల నష్టాలను చవిచూసింది.

మరో ఆమిర్ ఖాన్ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కు రూ.60 కోట్లు, హృతిక్ రోషన్ నటించిన విక్రమ్ వేదాకు రూ.35 కోట్ల నష్టాలు వచ్చాయి.