Biggest Flop Movie: ఇండియాలో అతిపెద్ద డిజాస్టర్ మూవీ.. బడ్జెట్ రూ.225 కోట్లు.. వచ్చింది ఏమీ లేదు.. ఇప్పుడు ఓటీటీలోకి..-biggest flop movie indian 2 made on a budget of 225 crores earns just 148 crores gross kamal haasan shankar shanmugham ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Biggest Flop Movie: ఇండియాలో అతిపెద్ద డిజాస్టర్ మూవీ.. బడ్జెట్ రూ.225 కోట్లు.. వచ్చింది ఏమీ లేదు.. ఇప్పుడు ఓటీటీలోకి..

Biggest Flop Movie: ఇండియాలో అతిపెద్ద డిజాస్టర్ మూవీ.. బడ్జెట్ రూ.225 కోట్లు.. వచ్చింది ఏమీ లేదు.. ఇప్పుడు ఓటీటీలోకి..

Hari Prasad S HT Telugu
Aug 06, 2024 10:43 AM IST

Biggest Flop Movie: ఇండియాలో అతిపెద్ద డిజాస్టర్ సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో తాజాగా వచ్చి చేరిన సినిమా ఇండియన్ 2. ఈ సినిమా మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి వస్తోంది.

ఇండియాలో అతిపెద్ద డిజాస్టర్ మూవీ.. బడ్జెట్ రూ.225 కోట్లు.. వచ్చింది ఏమీ లేదు.. ఇప్పుడు ఓటీటీలోకి..
ఇండియాలో అతిపెద్ద డిజాస్టర్ మూవీ.. బడ్జెట్ రూ.225 కోట్లు.. వచ్చింది ఏమీ లేదు.. ఇప్పుడు ఓటీటీలోకి..

Biggest Flop Movie: ఇండియన్ సినిమాను ఈ మధ్య కాలంలో సౌత్ మూవీస్, సీక్వెల్స్ ఏలుతున్నాయి. అలా ఈ రెండు కేటగిరీలకు చెందిన సినిమాగా ఎన్నో ఆశలు, అంచనాల మధ్య రిలీజైన మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిపోయింది. ఇప్పుడు సినిమా మరో రెండు రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది.

ఇండియన్ 2.. అతిపెద్ద డిజాస్టర్

ఈ మధ్య సౌత్ లో కాస్త పెద్ద బడ్జెట్ సినిమా అయితే చాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. సీక్వెల్స్ కూడా భారీ బిజినెస్ చేస్తున్నాయి. కానీ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ 2 మాత్రం అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఎప్పుడో 28 ఏళ్ల కిందట రిలీజై సంచలన విజయం సాధించిన ఇండియన్ (తెలుగులో భారతీయుడు) మూవీకి సీక్వెల్ గా వచ్చిన సినిమా ఇది.

ఏకంగా రూ.225 కోట్ల బడ్జెట్ తో నాలుగేళ్ల పాటు సాగదీసి తీసిన మూవీ. తీరా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశ పరిచింది. కమల్ హాసన్ కెరీర్లోనే డిజాస్టర్ గా మిగిలిపోయింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి వచ్చింది కేవలం రూ.148 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే. షేర్ ఇంకా చాలా చాలా తక్కువే. ఆ లెక్కన చూస్తే నిర్మాతలకు సుమారు రూ.100 కోట్లకుపైనే నష్టాలు మిగిల్చింది.

అప్పుడు బ్లాక్‌బస్టర్.. ఇప్పుడు డిజాస్టర్

1996లో రిలీజైన భారతీయుడు ఓ సంచలనం. అప్పట్లో శంకర్ మార్క్ స్టోరీ, మేకింగ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. కానీ ఇప్పటికీ అలాంటి స్టోరీ, అదే మేకింగ్ ఆడియెన్స్ ను నిరాశకు గురి చేశాయి. నిజానికి ట్రైలర్ రిలీజ్ కాగానే సినిమాపై పెదవి విరిచారు. పాత చింత పచ్చడి స్టోరీ అంటూ తేల్చేశారు. ఇక మూవీ రిలీజైన తర్వాత దారుణమైన రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా బోల్తా పడింది.

తొలి రోజు ఉన్న అంచనాల నేపథ్యంలో రూ.65 కోట్ల ఓపెనింగ్ లభించినా.. నెగటివ్ రివ్యూలతో క్రమంగా తగ్గుతూ వెళ్లాయి. తమిళంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచినా.. తెలుగుతోపాటు ఇతర భాషల్లో మాత్రం దారుణమైన కలెక్షన్లు వచ్చాయి.

ఇండియన్ 2 ఓటీటీ

కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 మూవీ జులై 12న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెల రోజులు కూడా కాక ముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆగస్ట్ 9 నుంచి ఈ సినిమా అన్ని భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో ఆ ఓటీటీ ఏకంగా రూ.120 కోట్లకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. అయితే మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభిస్తుందన్న అంచనాలు లేవు.