Biggest Flop Movie: బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లు నష్టపోయిన ఈ సినిమా ఏదో మీకు తెలుసా?-biggest flop movie in the world john carter lose nearly 1000 crores at the box office hollywood news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Biggest Flop Movie: బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లు నష్టపోయిన ఈ సినిమా ఏదో మీకు తెలుసా?

Biggest Flop Movie: బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లు నష్టపోయిన ఈ సినిమా ఏదో మీకు తెలుసా?

Hari Prasad S HT Telugu
Feb 08, 2024 01:42 PM IST

Biggest Flop Movie: బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్ల కలెక్షన్లు రాబట్టడమే చాలా చాలా గొప్ప విషయం. అలాంటి సినిమాలను మన దేశంలో వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. కానీ రూ.1000 కోట్లు నష్టపోయిన సినిమా ఉందని మీకు తెలుసా?

బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.1000 కోట్లు నష్టపోయిన మూవీ జాన్ కార్టర్
బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.1000 కోట్లు నష్టపోయిన మూవీ జాన్ కార్టర్

Biggest Flop Movie: ఓ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటం, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోవడం సహజమే. అయితే బడ్జెట్ ను బట్టి ఈ నష్టాలు ఉంటాయి. కానీ ప్రపంచ సినిమా చరిత్రలో ఒక సినిమా ఏకంగా రూ.1000 కోట్ల వరకూ నష్టపోయిందంటే నమ్మగలరా? ఆ సినిమా పేరు జాన్ కార్టర్. 2012లో రిలీజైన ఈ సినిమాకు అన్ని నష్టాలు ఎందుకు వచ్చాయో తెలుసుకోండి.

yearly horoscope entry point

అతిపెద్ద ఫ్లాప్ మూవీ ఇదే

ఈ మధ్య టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ భారీ బడ్జెట్ సినిమాలు చాలా కామన్ అయిపోయాయి. తెలుగులోనే వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. కానీ 2012లోనే వచ్చిన ఈ జాన్ కార్టర్ మూవీ అప్పట్లోనే ఏకంగా 30.6 కోట్ల డాలర్ల (సుమారు రూ.2 వేల కోట్లపైనే..) బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు సుమారు 20 కోట్ల డాలర్ల వరకూ నష్టాలు ఎదురయ్యాయి.

అప్పటి డాలర్ తో మన రూపాయి విలువ చూసుకుంటే.. ఈ నష్టం రూ.వెయ్యి కోట్ల వరకూ ఉండటం గమనార్హం. జాన్ కార్టర్ ఓ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఈ సినిమాను ఆండ్రూ స్టాంటన్ డైరెక్ట్ చేశాడు. ప్రపంచంలో అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఎడ్గార్ రైస్ బరౌస్ రాసిన బుక్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

భారీ బడ్జెట్.. భారీ నష్టాలు

30 కోట్ల డాలర్లకుపైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో టేలర్ కిట్ష్, లిన్ కొలిన్స్, సమంతా మోర్టాన్, మార్క్ స్ట్రాంగ్, డొమినిక్ వెస్ట్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు, వీఎఫ్ఎక్స్ లాంటివి అద్భుతంగా ఉన్నా సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ప్రపంచవ్యాప్తంగా 28.4 కోట్ల డాలర్ల గ్రాస్ కలెక్షన్లను మాత్రమే రాబట్టింది.

మార్కెటింగ్ ఖర్చులు, పన్నులూ తీసేస్తే.. ఈ జాన్ కార్టర్ మూవీకి 11 కోట్ల నుంచి 20 కోట్ల డాలర్ల (సుమారు రూ.1000 కోట్లు) నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ప్రపంచ సినిమా చరిత్రలో అతిపెద్ద ఫ్లాప్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన జాన్ కార్టర్.. కొందరి కెరీర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ స్థాయి నష్టాలు మరే సినిమాకూ రాలేదు. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ నిండా మునిగింది.

స్టూడియో అప్పటి హెడ్ రిచ్ రోస్ రాజీనామా చేశాడు. మూవీ డైరెక్టర్ ఆండ్రూ స్టాంటన్ కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. మూవీలో ఫిమేల్ లీడ్ గా కనిపించిన లిన్ కొలిన్స్ కూడా చాలా కాలం పాటు ఆఫర్లు లేక ఇబ్బంది పడింది. నిజానికి ఆమెను అసలు కొన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా ఉండాలని చెప్పినట్లు కొలిన్సే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

భారీ బడ్జెట్, మంచి పేరున్న నటీనటులు ఉన్నంత మాత్రాన సినిమాలు కాసుల వర్షం కురిపించవు అని చెప్పడానికి ఈ జాన్ కార్టర్ ఫెయిల్యూరే నిదర్శనం. కాకపోతే మరీ ఈ స్థాయిలో రూ.1000 కోట్లు నష్టపోవడం మాత్రం అసాధారణమే.

Whats_app_banner