Biggest Disasters 2024: ఈ ఏడాది ఢమాల్ అయిన రెండు భారీ బడ్జెట్ చిత్రాలు.. ఒక్కో మూవీకి రూ.200కోట్లకుపైగా నష్టం-biggest disasters of 2024 bade miyan chote miyan and kanguva disappoints and suffers more than 200 crore loss ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Biggest Disasters 2024: ఈ ఏడాది ఢమాల్ అయిన రెండు భారీ బడ్జెట్ చిత్రాలు.. ఒక్కో మూవీకి రూ.200కోట్లకుపైగా నష్టం

Biggest Disasters 2024: ఈ ఏడాది ఢమాల్ అయిన రెండు భారీ బడ్జెట్ చిత్రాలు.. ఒక్కో మూవీకి రూ.200కోట్లకుపైగా నష్టం

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 31, 2024 03:30 PM IST

Biggest Box-office Disasters 2024: ఈ ఏడాది రెండు సినిమాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ రెండు చిత్రాలు తలా రూ.200కోట్లకుపైగా లాస్ అయ్యాయి. ఆ వివరాలు ఇవే..

Biggest Disasters 2024: ఈ ఏడాది ఢమాల్ అయిన రెండు భారీ బడ్జెట్ చిత్రాలు.. ఒక్కో మూవీకి రూ.200కోట్లకుపైగా నష్టం
Biggest Disasters 2024: ఈ ఏడాది ఢమాల్ అయిన రెండు భారీ బడ్జెట్ చిత్రాలు.. ఒక్కో మూవీకి రూ.200కోట్లకుపైగా నష్టం

ఈ ఏడాది 2024 సంవత్సరంలో భారీ బ్లాక్‍బస్టర్లతో పాటు డిజాస్టర్లు కూడా గట్టిగానే ఎదురయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి. ప్రేక్షకులను మెప్పించలేక పరాభవాన్ని చవిచూశాయి. ఈ జాబితాలో రెండు చిత్రాలు ముందు వరుసలో ఉన్నాయి. రిలీజ్‍కు ముందు ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ చిత్రాలు భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. చెరో రూ.200కోట్లకు పైగా నష్టాన్ని మూటగట్టుకున్నాయి. అవే బడే మియా చోటే మియా, కంగువ సినిమాలు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

yearly horoscope entry point

బడే మియా చోటే మియా

బాలీవుడ్ సినిమా బడే మియా చోటే మియా ఈ ఏడాది భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ భారీ యాక్షన్ మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ అయింది. చాలా అంచనాలతో వచ్చిన ఈ చిత్రం నెగెటివ్ టాక్ తెచ్చుకొని చతికిలపడింది. ప్రమోషన్లను జోరుగా చేసినా.. సినిమా ఆకట్టుకునేలా లేకపోవటంతో ప్రేక్షకులు తిరస్కరించేశారు. దీంతో భారీ ప్లాఫ్ అయింది.

బడే మియా చోటే మియా చిత్రం సుమారు రూ.350కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. భారీ యాక్షన్ సీక్వెన్సులతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జనాలను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆరంభం నుంచే పేలమైన కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రానికి ఓవరాల్‍గా సుమారు రూ.110 కోట్ల కలెక్షన్లే వచ్చాయి. ఏకంగా దాదాపు రూ.240కోట్ల కోట్ల నష్టం వచ్చింది. పెద్ద డిజాస్టర్ అయింది. బడే మియా చోటే మియా చిత్రాన్ని ఎంటర్‌టైన్‍మెంట్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్ బ్యానర్లు ప్రొడ్యూజ్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

కంగువ

తమిళ స్టార్ సూర్య హీరోగా నటించిన కంగువ సినిమా భారీ అంచనాలతో వచ్చింది. ఈ చిత్రం రూ.2వేల కోట్ల కలెక్షన్లు సాధించే రేంజ్‍లో ఉంటుందని రిలీజ్‍కు ముందు ప్రొడ్యూజర్ జ్ఞానవేల్ రాజా హైప్ పెంచేశారు. మూవీ టీమ్ చాలా గట్టిగా ప్రమోషన్లను చేసింది. దీంతో ఈ చిత్రంపై భారీ హైప్, అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, నవంబర్ 14న కంగువ చిత్రం రిలీజ్ కాగా తీవ్రమైన నెగెటివ్ టాక్ వచ్చింది. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

కంగువ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ షాక్ తగిలింది. ఈ చిత్రం సుమారు రూ.320 కోట్ల భారీ బడ్జెట్‍తో రూపొందింది. భారీ సెట్లు, విజువల్స్ కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెట్టారు. అయితే, కథ, కథనం, సంగీతం ఇలా చాలా విషయాలను ఈ మూవీలో మైనస్‍లు ఉన్నాయి. ఈ మూవీ ఫుల్ రన్‍లో సుమారు రూ.105 కోట్ల కలెక్షన్లకే పరిమితమైంది. దీంతో రూ.200కోట్లకు పైగా నష్టం వచ్చింది. కంగువ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీకష్ణ, ప్రమోద్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది.

Whats_app_banner