Bigg Boss 6 Telugu Episode 19: కెప్టెన్సీ రేసులో ముగ్గురు - అర్జున్, శ్రీసత్య, ఇనాయా ట్రయాంగిల్ లవ్ స్టోరీ
Bigg Boss 6 Telugu Episode 19: ఆడవిలో ఆట టాస్క్ గొడవలతో ముగిసింది. ఈ టాస్క్ లో పోలీస్ టీమ్ విజయం సాధించింది. మరోవైపు కెప్టెన్ రేసులో గీతూ రాయల్, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీహాన్ నిలిచారు. వారి కోసం నిర్వహించిన పిరమిడ్ కట్టు పడగొట్టు టాస్క్ లో గీతూ, ఫైమా డిస్ క్వాలిఫై అయ్యారు.
ట్రెండింగ్ వార్తలు
Bigg Boss 6 Telugu Episode 19: ఆడవిలో ఆట టాస్క్ చివరలో నేహా, మరీనా గొడవపడ్డారు. దొంగల టీమ్ మరీనాను బెడ్ రూమ్ లో లాక్ చేశారు. మరీనా లోపల ఉన్న కప్ బోర్డ్ లలో బొమ్మల కోసం వెతకడంతో ఆమెకు యాక్సస్ లేదంటూ నేహా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె మాటలకు మరీనా హర్ట్ అయ్యింది. దెబ్బ తగలడంతో మెడిసిన్ కోసం తన కప్ బోర్డ్ లోనే వెతుకుతున్నానని చెప్పింది. అది కూడా అర్ధం చేసుకోకుండా ప్రతి మాటకు నేహా గుర్రు మంటుందని, బుద్ది లేదా అంటూ నేహాపై మరీనా సీరియస్ అయ్యింది.
బొమ్మకు వంద…
బొమ్మకు వంద అంటూ ఆఫర్ ప్రకటించింది గీతూ. ఎక్కువ బొమ్మలు అమ్మినవారికి స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని గీతూరాయల్ ప్రకటించింది. అర్జున్ కళ్యాణ్, అరోహి అమ్ముతున్న బొమ్మలపై ఆర్జే సూర్య అభ్యంతరం వ్యక్తం చేశాడు. అవి బాత్ రూమ్ నుంచి తెచ్చిన బొమ్మలని, బాత్ రూమ్ లో బొమ్మలు దాయం ఫౌల్ అని పేర్కొన్నాడు. ఈ రౌండ్ సూర్య అధికంగా బొమ్మలు అమ్మాడు. అతడికి మూడు వేల రూపాయలు బహుమతిగా ఇస్తున్నట్లు గీతూ ప్రకటించింది.
మరోవైపు శ్రీసత్యను ఇంప్రెస్ చేయడానికి అర్జున్ కళ్యాణ్ ట్రై చేస్తూ కనిపించాడు. కానీ ఆమె మాత్రం హౌజ్ లో తాను అందరిని అన్నయ్య అనే పిలుస్తానని చెప్పింది. ఆ పిలుపును తాను యాక్సెప్ట్ చేయనంటూ అర్జున్ చెప్పాడు.
పోలీస్ టీమ్ విన్…
ఆడవిలో ఆట టాస్క్ పూర్తయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ గేమ్ లో పోలీస్ టీమ్ విజయం సాధించింది. వారి వద్ద 71 రెడ్ ట్యాగ్ ఉన్న బొమ్మలు ఉండగా దొంగల టీమ్ వద్ద కేవలం 18 మాత్రమే రెడ్ ట్యాగ్ ఉన్న బొమ్మలు మిగిలాయి.
బంగారు కొబ్బరి బొండాం శ్రీసత్య వద్ద ఉండటంతో గీతూతో పాటు ఆమె కూడా కెప్టెన్ పోటీదారుగా నిలిచినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. తమ టీమ్‌లో ఎవరూ నిజాయితీగా ఆడటం లేదని ఆదిరెడ్డితో రేవంత్ చెప్పాడు. ప్రతి కెప్టెన్ టాస్క్‌లో తాను ఓడిపోవడం వెనుక ఏదో మతాలబు జరుగుతుందని అన్నాడు. మరోవైపు ఇనాయా సరిగా ఆడలేదని శ్రీహాన్, నేహా, గీతూ అనగా ఆదిరెడ్డి మాత్రం ఆమె బాగా ఆడిందని ప్రశంసించాడు.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ...
అర్జున్ కళ్యాణ్, శ్రీసత్య, ఇనాయా మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు అనిపిస్తుందని శ్రీహాన్ నేహాతో చెబుతూ కనిపించాడు. శ్రీసత్యపై అర్జున్ కళ్యాణ్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నాదని అన్నాడు. పోలీస్ టీమ్ నుంచి కెప్టెన్ కంటెండర్స్ గా ఇద్దరిని ఏకాభిప్రాయంతో ఎంపికచేయాలని సభ్యులను బిగ్‌బాస్ కోరాడు. వారు ఆదిరెడ్డి, ఫైమాను సెలెక్ట్ చేశారు. దొంగల టీమ్ సభ్యులు శ్రీహాన్‌ను ఎంపికచేస్తున్నట్లుగా ప్రకటించారు.
మొత్తంగా గీతూ, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీహాన్ కెప్టెన్ కంటెడర్స్ గా నిలిచారు. సుదీప తనను జంతువులతో పోల్చడంతో హర్ట్ అయిన రేవంత్ భోజనం చేయలేదు. ఈ విషయమై రేవంత్, సుదీప గొడవపడ్డారు. రేవంత్ తో తనకు ఎప్పుడూ ప్రాబ్లెమ్ ఉందని సుదీప చెప్పింది.
పిరమిడ్ కట్టు పడగొట్టు...
కెప్టెన్ పోటీ దారుల కోసం బిగ్ బాస్ పిరమిడ్ కట్టు పడగొట్టు అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ కు రేవంత్ సంచాలకుడిగా వ్యవహరించాడు. ఈ టాస్క్ ఆరంభంలోనే గీతూ డిస్ క్వాలిఫై అయ్యింది. తన పిరమిడ్ ను కాపాడే క్రమంలో వాటిని చేతితో తాకడంతో ఫైమాను ఫౌల్‌గా ప్రకటించాడు రేవంత్. ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీసత్య మాత్రమే కెప్టెన్ రేసులో మిగిలినట్లు రేవంత్ ప్రకటించాడు.
శ్రీహాన్ తనను పిట్ట అనడంపై వాసంతి సీరియస్ అయ్యింది. శ్రీహాన్ తనను బాడీ షేమింగ్ చేశాడంటూ అతడితో గొడవకు దిగింది. కానీ ఆమె అరుపులకు భయపడిన శ్రీహాన్ తప్పించుకొని పారిపోయాడు. శ్రీహాన్ కు సపోర్ట్ గా గీతూ వచ్చింది. తననే శ్రీహాన్ పిట్ట అని పిలిచాడని వాసంతితో చెప్పింది.