Bigg Boss Telugu 6 Episode 97: విన్నర్ ప్రైజ్ మనీ భారీగా పెరుగుదల.. నటనలో జీవించేసిన హౌస్ మేట్స్-bigg boss telugu winner prize money increasing task completed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Bigg Boss Telugu Winner Prize Money Increasing Task Completed

Bigg Boss Telugu 6 Episode 97: విన్నర్ ప్రైజ్ మనీ భారీగా పెరుగుదల.. నటనలో జీవించేసిన హౌస్ మేట్స్

Maragani Govardhan HT Telugu
Dec 10, 2022 06:52 AM IST

Bigg Boss Telugu 6 Episode 97: బిగ్‌బాస్ సీజన్ 6 విన్నర్ ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. మొదట ప్రైజ్ మనీ కత్తిరించుకుంటూ వచ్చిన బిగ్‌బాస్.. ఆ తర్వాత పెంచుకునేలా పలు ఛాలెంజ్‌లు ఇచ్చారు. మొత్తానికి 47 లక్షలుకు చేరింది.

బిగ్ బాస్ ప్రైజ్ మనీ టాస్క్
బిగ్ బాస్ ప్రైజ్ మనీ టాస్క్

Bigg Boss Telugu 6 Episode 97: బిగ్‌బాస్ సీజన్ 6 ఆరంభం నుంచి నత్తనడకలా సాగింది. మొదట్లో టీఆర్పీలు ఘోరంగా రావడంతో వాటిని పెంచడం కోసం టీమ్ నానా విధాలు కష్టపడింది. దీంతో ఆరో వారం నుంచి నెమ్మదిగా పైకి లేచినప్పటికీ మళ్లీ వెనుకంజ వేసింది. గొడవలు, కలహాలు, వాదనలతో రసవత్తరంగా సాగింది. ఎంతలా ఉన్నప్పటికీ గత సీజన్లతో పోలిస్తే ఈ సారి కాస్త వినోదం తగ్గిందనే చెప్పాలి. ఫినాలే వారానికి ఇంకో వారం మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో ఆసక్తికరంగా మారింది. ఈ వారం ప్రైజ్ మనీ పెంచుకునేలా బిగ్‌బాస్ పలు ఛాలెంజ్‌లు ఇచ్చారు. గతంలో దాన్ని కత్తిరించుకుంటూ వెళ్లి బిగ్‌బాస్.. ఈ సారి మళ్లీ పెంచుకుంటూ వెళ్లిపోయారు. సోమవారం ప్రారంభమైన ఈ టాస్క్ శుక్రవారంతో ముగిసింది.

ట్రెండింగ్ వార్తలు

హౌస్ మేట్స్ కూడా పలు ఛాలెంజ్‌ల్లో పోటీ పడిన కష్టానికి ప్రతిఫలంగా ఎట్టకేలకు ఫైనల్ ప్రైజ్ మనీ ప్రకటించారు బిగ్‌బాస్. రెండు రోజులుగా ఇంటి సభ్యులను దెయ్య టాస్క్‌తో హడలెత్తిస్తున్నారు. చీకటి గదిలోకి పంపించి వస్తువులను తీసుకురామని చెప్పడం, అందుకు ప్రతిఫలంగా కొంత మేరు డబ్బు విన్నర్ ప్రైజ్ మనీకి ఎటాచ్ చేయడం చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నాటి ఎపిసోడ్ శ్రీసత్య, కీర్తిలను చీకటి గదిలోకి పంపించారు. వీళ్లిద్దరూ గడ్డిని చూసి కూడా గజ గజ వణికిపోయారు. కాస్త అతిగా అనిపించినప్పటికీ.. ప్రేక్షకులకు మాత్రం ఫుల్ వినోదం దొరికింది.

ఎలాగోలా కష్టపడి చివరకు బిగ్‌బాస్ చెప్పిన వస్తువులు తీసుకురావడంతో రూ.20 ఎటాచ్ చేశారు. తర్వార రోహిత్‌ను.. ఇలా అందర్నీ పంపించారు. అక్కడ ఇనాయ, కీర్తి దెయ్యాల్లా భయపెడుతూ అందరినీ ఓ ఆటాడుకున్నారు. ఈ సారి మరో రూ.13 వేలు గెలిచారు. ఎలాగైతేనేం దెయ్యం టాస్క్‌లో బిగ్‌బాస్.. హౌస్ మెట్స్ నుంచి తను అనుకున్న వినోదాన్ని రాబట్టారు. ప్రతిఫలంగా వారికి మెరుగైన విన్నింగ్ అమౌంట్‌ను కూడా ఇచ్చారు.

అనంతరం మనీ బాల్ ఛాలెంజ్‌లో రేవంత్, రోహిత్ గెలుపొందారు. ఇందులో రేవంత్ రూ.500, రోహిత్ రూ.1500లు గెలుచుకున్నారు. దీంతో ప్రైజ్ మనీ మరింతగా పెరిగింది. ఈ టాస్క్ తర్వాత ఆరో సీజన్‌లో గుర్తుండిపోయే సంఘటనలను, గొడవలను మరోసారి ప్రదర్శించి ఎంటర్టైన్ చేయాలని ఆదేశించారు.

ఈ క్రమంలో ఇనాయా-శ్రీహాన్‌ పిట్టకథ, హోటల్ టాస్క్‌లో శ్రీసత్య-అర్జున్ ఒప్పందం, అర్జున్-రేవంత్ పప్పు గొడవ, మిషన్ ఇంపాజిబుల్ టాస్క్‌లో ఆదిరెడ్డి సీక్రెట్ టాస్క్(బాత్రూమ్‌ను అశుభ్రపరిచి చేసిన గొడవ), కీర్తి వేలు గాయపడ్డ సంఘటన, కెప్టెన్సీ టాస్క్‌లో రోహిత్ గోనె సంచులను తన్నిన సీన్.. వీటన్నింటిని మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించారు. అన్నింటిలో కంటే కూడా ఇనాయ-శ్రీహాన్ పిట్ట కథ గొడవను.. రేవంత్-శ్రీసత్య రీక్రియేట్ చేసిన టాస్క్ ఆకట్టుకుంది. రేవంత్.. అచ్చం శ్రీహాన్ మాదిరిగానే గొడవ పడటం.. చెవిలో రక్తం వస్తుందంటూ హౌస్‌లో పరిగెత్తడం ఫుల్ వినోదాన్ని పంచుతుంది. మరోపక్క శ్రీసత్య కూడా అచ్చం ఇనాయా మాదిరిగానే నువ్వు నన్ను పిట్ట అని ఎలా అంటావ్.. రేవంత్‌తో గొడవకు దిగింది. వీరిద్దరు ఆ సన్నివేశాన్ని బాగా పండించారు.

వీరి మాదిరిగానే మిగిలిన సన్నివేశాలను కూడా అందరూ నటించడం కాదు ఏకంగా జీవించేశారు. వీరి యాక్టింగ్స్ స్కిల్స్‌లో బిగ్‌బాస్‌ను అలరించి రూ.43,000 గెలుచుకున్నారు. అన్ని ఛాలెంజ్‌లు, టాస్కులు పూర్తయిన తర్వాత ఫైనల్‌గా విన్నర్ ప్రైజ్ మనీ రూ.47,00,000కి చేరింది. ఈ సంతోషంలో రేవంత్ పాట పాడగా కీర్తి, శ్రీసత్య తమ స్టెప్పులతో అలరించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.