Bigg Boss Telugu: తింటావ్.. వెళ్లి కూర్చుంటావ్.. అంతకన్నా ఏం చేస్తున్నావ్: శోభ, యావర్ మధ్య గొడవ: వీడియో
Bigg Boss Telugu: బిగ్‍బాస్‍లో చివరి నామినేషన్లకు వేళైంది. ఈ నామినేషన్ల ప్రక్రియలో ప్రిన్స్ యావర్, శోభా శెట్టి మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. శివాజీతోనూ శోభ వారించారు.
Bigg Boss Telugu 7 Day 92 Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ కీలకదశకు చేరుకుంది. 13వ వారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యారు. దీంతో హౌస్‍లో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. 14వ వారం నామినేషన్లు నేటి సోమవారం (నవంబర్ 4) ఎపిసోడ్‍లో జరగనున్నాయి. ఎప్పటిలాగే నామినేషన్లు హీట్‍గా జరిగాయి. అయితే, ఈ సీజన్‍లో ఇదే లాస్ట్ నామినేషన్స్ అని బిగ్‍బాస్ చెప్పారు. ప్రోమోలో ఏముందంటే..
ఈ సీజన్‍లో ఆఖరి నామినేషన్స్ చేసే సమయం వచ్చేసిందని ముందుగా కంటెస్టెంట్లకు బిగ్‍బాస్ చెప్పారు. నామినేట్ చేయాలనుకుంటున్న వారి ముఖాన్ని టైల్‍పై స్టాంప్ వేసి.. టైల్‍ను పగులగొట్టాల్సి ఉంటుందని సూచించారు.
ముందుగా శోభా శెట్టిని నామినేట్ చేశారు ప్రిన్స్ యావర్. ‘ఎవరి మాటనో నువ్వు గుడ్డిగా ఫాలో అవుతున్నావు’ అని శోభతో యావర్ అన్నారు. అయితే, శెట్టి గెట్ లాస్ట్ అని రాయడం తనకు నచ్చలేదని శోభ అంటే.. తాను ఆ మాటే అనలేదని యావర్ చెప్పారు.
కిచెన్‍లో తాను పని చేయడం లేదని అనడంపై యావర్ స్పందించారు. శోభ కూడా తక్కువే చేస్తోందని కదా అని అతడు చెప్పారు. దీంతో తనను పోల్చుకోవద్దని శోభ అన్నారు. “డిన్నర్ అయిన తర్వాత వస్తావు.. తింటావు.. తర్వాత వెళ్లి కూర్చుంటావు.. ఏం చేస్తున్నావ్ నువ్వు” అని యావర్‌తో శోభ వాదించారు. యావర్ వెటకారంగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు.
దీంతో, “విన్న తర్వాత యాక్షన్ చేయ్.. నీకన్నా ఎక్కువ యాక్షన్ చేయగలను నేను” అని శోభ అన్నారు. ఆమె కూడా యావర్‌ను నామినేట్ చేశారు.
శివాజీ - శోభ మధ్య కూడా..
శోభా శెట్టి, శివాజీ మధ్య కూడా వాదన జరిగింది. శివాజీ ఆటను వదిలేసినట్టుగా తనకు అనిపించిందని శోభ అన్నారు. దీంతో “తెలిసి ఎందుకు గివప్ ఇస్తాను. అమర్ గేమ్ తప్పుగా ఆడాడని అందరికీ చూపించాం. అది నీకు తప్పనిపించలేదా.. దాని మీద అతడిపై నామినేషన్ చేయాలనిపించలేదా” అని శోభను శివాజీ ప్రశ్నించారు. తాను అమర్‌ను ఆ పాయింట్‍పై నామినేట్ చేయాలనుకోవడం లేదని శోభ అన్నారు.
“నువ్వు ఏమైనా ఒలింపిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి.. నామినేట్ చేసి ఉంటే తప్పకుండా నేను నీ నామినేషన్‍ను అంగీకరించేవాడిని” అంటూ శోభకు శివాజీ గట్టిగా బదులిచ్చారు. ఇక ఈ వారం ఎవరెవరు నామినేషన్లలో ఉండనున్నారో నేటి ఎపిసోడ్‍లో తేలనుంది.
సంబంధిత కథనం
టాపిక్