Bigg Boss Utsavam: బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్స్ రీ యూనియ‌న్ - న‌బీల్‌పై ప్రేర‌ణ రివేంజ్ - అక్క అంటే అర్థం చెప్పిన గౌత‌మ్‌-bigg boss telugu season 8 contestants reunion with bb utsavam show star maa unveiled promo anil ravipudi vishwak sen att ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Utsavam: బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్స్ రీ యూనియ‌న్ - న‌బీల్‌పై ప్రేర‌ణ రివేంజ్ - అక్క అంటే అర్థం చెప్పిన గౌత‌మ్‌

Bigg Boss Utsavam: బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్స్ రీ యూనియ‌న్ - న‌బీల్‌పై ప్రేర‌ణ రివేంజ్ - అక్క అంటే అర్థం చెప్పిన గౌత‌మ్‌

Nelki Naresh Kumar HT Telugu
Published Feb 11, 2025 10:10 AM IST

Bigg Boss Utsavam: బిగ్‌బాస్ సీజ‌న్ 8 కంటెస్టెంట్స్ మ‌ళ్లీ ఒకే వేదిక‌పై క‌లిసి సంద‌డి చేయ‌బోతున్నారు. బిగ్‌బాస్ సీజ‌న్ 8 కంటెస్టెంట్స్‌తో స్టార్ మా బిగ్‌బాస్ ఉత్స‌వం పేరుతో స్పెష‌ల్ షో ప్లాన్ చేసింది. ఫిబ్ర‌వ‌రి 16న ఈ షో టెలికాస్ట్ కాబోతోంది. బిగ్‌బాస్ ఉత్స‌వం ప్రోమోను రిలీజ్ చేసింది.

బిగ్‌బాస్ ఉత్స‌వం
బిగ్‌బాస్ ఉత్స‌వం

Bigg Boss Utsavam: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 కంటెస్టెంట్స్ అంద‌రూ క‌లిసి మ‌ళ్లీ ఒకే స్టేజ్‌పై క‌నిపించ‌బోతున్నారు. త‌మ ఆట పాట‌ల‌తో సంద‌డి చేయ‌బోతున్నారు. బిగ్‌బాస్ సీజ‌న్ 8 కంటెస్టెంట్స్‌తో స్టార్ మా బిగ్‌బాస్ ఉత్స‌వం పేరుతో స్పెష‌ల్ టీవీ షోను ప్లాన్ చేసింది. ఫిబ్ర‌వ‌రి 16న బిగ్‌బాస్ ఉత్స‌వం షో టెలికాస్ట్ కాబోతుంది. సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ఈ షో ప్ర‌సార‌మ‌వుతుంద‌ని స్టార్ మా అనౌన్స్‌చేసింది. బిగ్‌బాస్ ఉత్స‌వం తాలూకు ప్రోమోను రిలీజ్ చేసింది.

విశ్వ‌క్‌సేన్‌, అనిల్ రావిపూడి...

ఈ బిగ్‌బాస్ ఉత్స‌వం షోకు హీరోలు సందీప్‌కిష‌న్‌, విశ్వ‌క్‌సేన్‌, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు గెస్ట్‌లుగా రాబోతున్నారు. ఈ షోలో బిగ్‌బాస్ సీజ‌న్ 8 విన్న‌ర్ నిఖిల్‌, ర‌న్న‌ర‌ప్స్ గౌత‌మ్ కృష్ణ‌, ప్రేర‌ణ‌, న‌బీల్‌తో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. బిగ్‌బాస్ హౌజ్‌లో జ‌రిగిన గొడ‌వ‌ల‌పై ఈ షోలో ఒక‌రిపై మ‌రొక‌రు పంచ్‌లు వేసుకుంటూ న‌వ్వించారు.

సిగ్గుప‌డిన రోహిణి...

బిగ్‌బాస్ ఉత్స‌వం షోకు శ్రీముఖి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించింది. ఈ ప్రోమోలో నిఖిల్‌ను ఉద్దేశించి అంద‌రూ అమ్మాయిలు నీకు ఐల‌వ్ యూ చెబుతున్నారు. మ‌రి నువ్వెప్పుడు ఒక‌రికి ఐ ల‌వ్ యూ చెబుతావు అని నిఖిల్‌ను శ్రీముఖి అడిగింది. అంత టైమ్ తీసుకోకు చెప్పేయ్ ఏం కాదు అని రోహిణి సిగ్గుప‌డుతూ చెప్ప‌డం న‌వ్వుల‌ను పంచింది.

రివేంజ్ తీర్చుకుంటా...

కోర్టు బోనులో నిల‌బ‌డ్డ న‌బీల్‌తో ...ఒరేయ్...నేను తీర్చుకుంటా రివేంజ్ అంటూ ప్రేర‌ణ ఛాలెంజ్ చేసింది. ఆమె మాట్లాడ‌కుండా నోటికి ప్లాస్ట‌ర్ వేశాడు న‌బీల్‌. య‌ష్మి అన్నాడు..పువ్వు ఇచ్చాడు, ల‌వ్వు అన్నాడు..ఆఖ‌రికి అక్కా అన్నాడు అని గౌత‌మ్‌తో రోహిణి అన్న‌ది. అక్క అంటే ఫుల్‌ఫామ్ తెలుసా,...అంద‌మైన క‌ళ్లు క‌ల అమ్మాయి అంటూ య‌ష్మిని తాను పిల‌వ‌డం వెన‌కున్న సీక్రెట్‌ను గౌత‌మ్ కృష్ణ బ‌య‌ట‌పెట్టాడు.

అనిల్ రావిపూడి సెటైర్లు...

నాగ‌మ‌ణికంఠ‌ను పాట పాడ‌మ‌ని డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి అడిగాడు. మ‌ణికంఠ భ‌క్తి పాట పాడాడు. పాట పాడ‌మంటే ఇంత సీరియ‌స్‌గా తీసుకున్నాడు ఏంటి అని మ‌ణికంఠ‌పై అనిల్ రావిపూడి సెటైర్లు వేశారు.

విశ్వ‌క్‌సేన్‌, సందీప్‌కిష‌న్ కూడా ఈ షోలో త‌మ డ్యాన్సులు, స్కిట్‌ల‌తో ఆక‌ట్టుకున్నారు.బిగ్‌బాస్ సీజ‌న్ 8 కంటెస్టెంట్స్ స్పెష‌ల్ డ్యాన్స్ ప‌ర్పార్మెన్స్‌లు కూడా కూడా ఉండ‌నున్న‌ట్లు ప్రోమోలో క‌నిపిస్తోంది. బిగ్‌బాస్ ఉత్స‌వం షోకు భ‌ర్త‌తో క‌లిసి సోనియా హాజ‌రైంది.మ‌ళ్లీ నిఖిల్‌, య‌ష్మిల‌ను జంట‌గా స్క్రీన్‌పై చూడ‌టం ఆనందంగా ఉంద‌ని ప్రోమోను ఉద్దేశించి బిగ్‌బాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ...

బిగ్‌బాస్ సీజ‌న్ 8 విన్న‌ర్‌గా నిఖిల్ నిలిచాడు. వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన గౌత‌మ్ కృష్ణ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. నిఖిల్‌కు గౌత‌మ్ గ‌ట్టి పోటీ ఇచ్చినా టైటిల్ మాత్రం గెల‌వ‌లేక‌పోయాడు. విన్న‌ర్‌గా నిలిచిన నిఖిల్ ప్రైజ్‌మ‌నీ 55 ల‌క్ష‌ల‌తో పాటు రెమ్యున‌రేష‌న్ క‌లిపి 90 ల‌క్ష‌ల వ‌ర‌కు సొంతం చేసుకున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం