Bigg Boss Telugu: ఇక గ్రూప్ వద్దు: ప్రియాంకకు నాగార్జున వార్నింగ్.. గౌతమ్‍కు క్లాస్
Bigg Boss Telugu 7 Day 90 Promo: బిగ్‍బాస్‍లో ప్రియాంకకు హోస్ట్ నాగార్జున స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అమర్ కోసం ఎందుకు ఆరాటపడుతున్నావని, గ్రూప్ గేమ్స్ వద్దని సూచించారు. ఆ వివరాలివే..
Bigg Boss Telugu 7 Day 90 Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో 13వ వారం వీకెండ్‍కు వచ్చేసింది. నేటి శనివారం (డిసెంబర్ 2) ఎపిసోడ్‍లో కంటెస్టెంట్లతో నాగార్జున మాట్లాడనున్నారు. ఫినాలే అస్త్ర కోసం జరిగిన టాస్కుల్లో కంటెస్టెంట్ల ఆట తీరు గురించి చెప్పనున్నారు. నేటి ఎపిసోడ్ ప్రోమో కూడా వచ్చింది. ప్రియాంక, గౌతమ్ కృష్ణకు నాగార్జున క్లాస్ తీసుకున్నారు.
సాండ్ టాస్కులో ప్రిన్స్ యావర్ తీరును నాగార్జున తప్పుబట్టారు. “నీ అవకాశాన్ని ఎవరో పాడు చేశారని.. ఇంకొకరి అవకాశాన్ని నువ్వు పాడుచేయకూడదు కదా” అని నాగ్ అన్నారు. ఆ తర్వాత జెండాను ఎత్తడం వెనుక స్ట్రాటజీ ఏంటి గౌతమ్ కృష్ణను నాగార్జున ప్రశ్నించారు. “ఇసుకను కాస్త తీసేస్తే బరువు తగ్గి తొందరగా లేస్తుందని ప్లాన్ చేశా” అని గౌతమ్ చెప్పారు. దీంతో ఏంటో అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు నాగార్జున.
అమర్‌కు పాయింట్లు ఇవ్వాలని గౌతమ్‍ను ప్రియాంక ఒత్తిడి చేయడం గురించి కూడా నాగార్జున గుర్తు చేశారు. “అర్జున్ అన్న కంటే.. గౌతమ్‍కు ప్రియాంక చెల్లి ఇంపార్టెంట్” అని నాగార్జున అన్నారు.
ఇప్పటి నుంచి హౌస్‍లో వ్యక్తిగత గేమ్ ఆడాలి.. గ్రూప్ గేమ్ వద్దు అని ప్రియాంక జైన్‍ను నాగార్జున హెచ్చరించారు. అయితే తాను వ్యక్తిగతంగానే ఆడుతున్నానని ప్రియాంక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ఏ రకంగా ఇది సొంతంగా ఆడుతున్న గేమ్ అని ప్రియాంకను నాగ్ ప్రశ్నించారు.
“గౌతమ్ ఎవరికి ఇద్దామనుకున్నాడో (పాయింట్లు) అది తన ఇష్టం. నువ్వు వెళ్లి అడగడం అది వ్యక్తిగత గేమా.. లేకపోతే అమర్ బాగా ఫీలైపోతున్నాడు.. ఎమోషనల్‍గా బ్లాక్‍మెయిల్ చేశాడు అని అలా అడగడం వ్యక్తిగత గేమా” అని నాగార్జున నిలదీశారు. అయితే, తన గేమ్ తాను ఆడుతున్నానని, బెస్ట్ ఇస్తున్నానని ప్రియాంక వారించారు.
“నీ ఉద్దేశంలో వ్యక్తిగతం అంటే ముగ్గురు” అని ప్రియాంకతో నాగ్ అన్నారు. అంటే ప్రియాంక, అమర్, శోభా శెట్టి గ్రూప్‍గా ఉన్నారని చెప్పకనే చెప్పారు. పల్లవి ప్రశాంత్, యావర్‌కు సపోర్టుగా ఉన్నాడని శివాజీని నిలదీసిన గౌతమ్ కృష్ణ.. ప్రియాంకను ఎందుకు ప్రశ్నించలేదని నాగార్జున అతడికి క్లాస్ తీసుకున్నారు. “ప్రతీసారి శివాజీని నిలదీసింది ఏంటీ.. ఇద్దరికి మాత్రమే సపోర్టుగా ఉన్నాడని.. మరి అదే విధంగా నువ్వు ప్రియాంకను కూడా అడగాలి కదా.. ఎందుకు అడగలేదు” అని గౌతమ్‍ను నాగ్ ప్రశ్నించారు. శివాజీ ఫస్ట్ నుంచి అంటూ గౌతమ్ తడబడ్డారు. అయితే, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలాంటివి తనకు చెప్పొద్దని, ప్రియాంక ఆడింది వ్యక్తిగత గేమేనా అని గౌతమ్‍ను నాగార్జున ప్రశ్నించారు. కాగా, బిగ్‍బాస్ ఈ సీజన్‍లో ఫినాలే అస్త్రను గెలుచుకొని ఫైనల్ వీక్‍కు వెళ్లిన తొలి కంటెస్టెంట్ అంబటి అర్జున్ అని నాగార్జున ప్రకటించారు. ప్రోమోలు ఇక్కడ చూడండి.
టాపిక్