Bigg Boss Aditya Om: సింగిల్ క్యారెక్ట‌ర్‌తో బిగ్‌బాస్ కంటెస్టెంట్ మూవీ - రిలీజ్ ఎప్పుడంటే?-bigg boss telugu fame aditya om single character movie bandi movie release in theaters soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Aditya Om: సింగిల్ క్యారెక్ట‌ర్‌తో బిగ్‌బాస్ కంటెస్టెంట్ మూవీ - రిలీజ్ ఎప్పుడంటే?

Bigg Boss Aditya Om: సింగిల్ క్యారెక్ట‌ర్‌తో బిగ్‌బాస్ కంటెస్టెంట్ మూవీ - రిలీజ్ ఎప్పుడంటే?

Bigg Boss Aditya Om: బిగ్‌బాస్ ఫేమ్ ఆదిత్యం ఓం హీరోగా న‌టిస్తోన్న బంధీ మూవీ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. సింగిల్ క్యారెక్ట‌ర్‌తో ప్ర‌యోగాత్మ‌కంగా ఈ మూవీ తెర‌కెక్కింది. పర్యావరణ సంరక్షణ, ప్రకృతి గొప్పదనం చాటి చెప్పే కాన్సెప్ట్‌తో డైరెక్ట‌ర్ తిరుమ‌ల ర‌ఘు ఈ మూవీని రూపొందించాడు.

బిగ్‌బాస్ ఆదిత్యం ఓం

Bigg Boss Aditya Om: సింగిల్ క్యారెక్ట‌ర్‌తో ప్ర‌యోగాత్మ‌కంగా ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ సినిమాలో ఆదిత్యం ఓం తప్ప ఆర్టిస్టులు ఎవ‌రూ క‌నిపించ‌రు. తిరుమ‌ల ర‌ఘు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ గల్లీ సినిమా బ్యానర్ మీద వెంకటేశ్వర రావు దగ్గు తో క‌లిసి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే బంధీ మూవీ నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. అవార్డులను సొంతం చేసుకుంది.

ప‌ర్యావ‌ర‌ణ సంర‌క్ష‌ణ‌...

పర్యావరణ సంరక్షణ, ప్రకృతి గొప్పదనం చాటి చెప్పే కాన్సెప్ట్‌తో బంధీ మూవీ రూపొందింది. నేచురల్ లొకేషన్స్‌లో ఈ మూవీని షూట్ చేశామ‌ని మేక‌ర్స్ అన్నారు. దేశంలోని వివిద అటవీ ప్రాంతాల్లో కష్టాలు పడుతూ, ఎటు వంటి డూప్స్ లేకుండా ఆదిత్య ఓం చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి.

త్వ‌ర‌లో రిలీజ్ డేట్‌...

ప్రకృతిని నాశనం చేస్తున్న మానవాళికి ఓ కనువిప్పులా మంచి సందేశంతో ఈ సినిమా ఆక‌ట్టుకుంటుంద‌ని తెలిపారు. బంధీ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు. తొంద‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

బిగ్‌బాస్ సీజ‌న్ 8 కంటెస్టెంట్‌...

ఇటీవ‌ల ముగిసిన బిగ్‌బాస్ సీజ‌న్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు ఆదిత్యం ఓం. టైటిల్ ఫేవ‌రేట్ల‌లో ఒక‌డిగా బ‌రిలో దిగిన ఆదిత్య ఓం 32వ రోజు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్‌లో పాల్గొన్నందుకు ఆదిత్య ఓమ్‌కు భారీగానే రెమ్యూన‌రేష‌న్ ద‌క్కిన‌ట్లు స‌మాచారం. వారానికి మూడు ల‌క్ష‌ల రెమ్యూన‌రేష‌న్‌తో ఆదిత్య బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. మొత్తం మూడు వారాల‌కు గాను ప‌దిహేను ల‌క్ష‌ల‌కుపైనే ఆదిత్య ఓంకు ద‌క్కిన‌ట్లు చెబుతోన్నారు.

టాలీవుడ్‌లోకి ఎంట్రీ...

లాహిరి లాహిరి లాహిరిలో మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆదిత్యం ఓం. వైవీఎస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచింది. ధ‌న‌ల‌క్ష్మి ఐ ల‌వ్ యూ,ప్రేమించుకున్నాం పెళ్లికి రండితో పాటు తెలుగులో ఇర‌వైకిపైగా సినిమాలు చేశాడు. హీరోగానే కాకుండా డైరెక్ట‌ర్‌గా హిందీలో బందూక్‌, మాసాబ్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్ని తెర‌కెక్కించాడు.