బిగ్ బాస్ అంటేనే అరుపులు, కేకలు, గొడవలు. ఇదే తెలుగు ఆడియెన్స్ కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్. దానికి తగినట్లుగా ఇవాళ్టీ బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకరిపై కోపాన్ని మరొకరిపై కంటెస్టెంట్స్ చూపిస్తూ సెప్టెంబర్ 25 బిగ్ బాస్ 9 తెలుగు ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగనున్నట్లు ఉంది.
బిగ్ బాస్ హౌజ్‌లో సంజనకు టీ తీసుకొచ్చి ఇచ్చాడు సింగర్ రాము. అందులో షుగర్ లేదని సంజన అంటే తీసుకొచ్చి ఇచ్చాడు. "సంజన గారు ఉదయం టీ తాగారా" అని సంజనను సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ అడిగింది. దానికి "అవును" అని సంజన చెప్పింది. మరి అదేంటీ అని మరో టీ కప్ చూపించింది తనూజ.
"సంజన గారు ప్లీజ్ మీరు ఏమైన అన్నప్పుడు, మాట్లాడినప్పుడు క్లారిటీగా ఉండండి. ఫ్లోరా ఇక్కడ లేదు, ఫ్లోరాకి ఏంటీ అని అనకండి" అని తనూజ అంది. "ఒక్క నిమిషం ఫ్లోరా విషయంలోకి నన్ను లాగొద్దు. ఏయ్.. ఫ్లోరా మ్యాటర్ వచ్చిందా నీ నా మధ్యలో. మజాక్ చేయకు. నేనెందుకు పట్టించుకుంటాను తను తింటుందో లేదో అని. నేనేం తన తల్లిని కాదు" అని తనూజ గౌడకు ఇచ్చిపడేసింది సంజన.
ఈ విషయంపై తనూజకు క్లారిటీ ఇచ్చేందుకు "తను ఇక్కడ లేదు" అని ఏదో చెప్పబోయాడు ఫోక్ సింగర్ రాము. దాంతో సంజన మీద ఉన్న కోపాన్ని రాము రాథోడ్‌పై చూపించింది తనూజ. "హేయ్ నువ్వు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకు రాము. దేంట్లో అవ్వకు. నిమిషానికి ఒక మాట అయితే మాట్లాడనే మాట్లాడకు" అని కోపంగా అరిచేసింది. ఫ్లోరా గురించి రాము చెప్పబోయాడు.
"వద్దు ఆపేయ్. ఆపేయ్ ఇంకా ఆపేయ్" అని గట్టిగా తిట్టేసింది తనూజ. దాంతో పాపం సింగర్ రాము ఏడుపు మొఖం పెట్టాడు. "నేనేమైనా ఆమె అసిస్టెంట్‌నా నాకు అర్థం కాదు. ఊరికే తిడతాంది మళ్లీ ఇప్పుడు" అని సింగర్ రాము అన్నాడు. దానికి తనూజ ఏదో అనుకుంటూ వెళ్లిపోయింది.
"వాన్ని అలా అరవకూడదు. నీ పని వాడితో చేపించి వాడు సరిగ్గా చేయలేదని వాడిని తిడతావేంటీ. అది అందరిముందు పట్టుకుని.. అన్నం తినేవాన్ని అంత గట్టి గట్టిగా అరుస్తావా. నీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్లమీద చూపించు. అది కరెక్ట్" అని జరిగిన గొడవపై న్యాయం చెప్పాడు జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్. దానికి ఫ్లోరా సైని కరెక్ట్ అని చెప్పింది.
మరోవైపు రాము రాథోడ్‌ను జబర్దస్త్ రీతూ చౌదరి ఓదారుస్తూ తీసుకెళ్లింది. మాస్క్ మ్యాన్‌తో జరిగింది చెప్పుకున్నాడు రాము రాథోడ్. అలా బిగ్ బాస్ తెలుగు 9 ఈరోజు ఎపిసోడ్ ప్రోమో ముగిసింది.
సంబంధిత కథనం