బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో రెండో వారం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 19వ తేది ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో టాస్క్ ఫిజికల్ అయినట్లుగా తెలుస్తోంది.
కెప్టెన్సీ టాస్క్ గురించి భరణి శంకర్ వివరించాడు. "ఈ వారం టెనెంట్స్‌లో ఒకరికి ఓనర్స్‌గా మారి బిగ్ బాస్ మెయిన్ హౌజ్‌లో అడుగుపెట్టడానికి మరో అవకాశం ఇస్తున్నారు. ఓనర్స్ విసిరిన ఐటమ్స్ పట్టుకుని ఎండ్ బజర్ మోగేలోపు వాటిని తమ బాస్కెట్‌లో భద్రంగా దాచుకోవాలి" అని భరణి శంకర్ చెప్పాడు.
ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో తనూజ గౌడ, రాము రాథోడ్, ఫ్లోరా సైని, ఇమ్మాన్యూయెల్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, సంజనతో కలిపి ఏడుగురు కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వీరికి ఓనర్స్ అయిన శ్రీజ దమ్ము, మర్యాద మనీష్ వస్తువులు విసిరారు. వాటిని పట్టుకున్న కెప్టెన్సీ కంటెండర్స్ తమకు కేటాయించిన బాస్కెట్‌లో వస్తువులు పెట్టి కాపాడుకోవాలి.
ఒకరి బాస్కెట్ నుంచి మరొకరు వస్తువులు లాక్కోవడం మొదలుపెట్టారు. సంజన నుంచి రీతూ లాక్కుంది. హీరోయిన్ ఫ్లోరా సైని నుంచి తనూజ గౌడ వస్తువులు లాక్కుంది. ఈ క్రమంలో ఫ్లోరా నెట్టడంతో తనూజ కిందపడింది. దాంతో సంచాలక్‌గా ఉన్న ప్రియా శెట్టి హీరోయిన్ ఫ్లోరా సైనిని టాస్క్ నుంచి ఎలిమినేట్ చేసింది.
తర్వాత ఫ్లోరా, సంజన ఇద్దరు రీతూ చౌదరి బాస్కెట్‌లోని వస్తువులు లాగడం మొదలుపెట్టారు. ఇమ్మాన్యుయెల్ అని రీతూ అరిచింది. తర్వాత డిఫెండ్ చేసుకునే క్రమంలో రీతూ చౌదరిని ఇమ్మాన్యుయెల్ నెట్టాడు. దాంతో బాస్కెట్‌పైన పడిపోయింది రీతూ చౌదరి. అది చూసి అంతా అవాక్కయ్యారు.
తర్వాత కమెడియన్ సుమన్ శెట్టి నుంచి సంజన వస్తువులు లాక్కోవడానికి ప్రయత్నించింది. తనను ఆపే క్రమంలో వెనుక ఉన్న ఫ్లోరా సైనిని సుమన్ శెట్టి అనుకోకుండా కొట్టాడు. ఫ్లోరాను సుమన్ శెట్టి రెండు సార్లు కొడితే తగిలిందని సంచాలక్‌కు సంజన కంప్లైంట్ చేసింది. అన్న కొడితే డైరెక్ట్ ఎలిమినేట్ అంటూ సంచాలక్ ప్రియా వార్నింగ్ ఇచ్చింది.
సుమన్ శెట్టి బాస్కెట్ నుంచి ఓ షర్ట్ తీసుకునేందుకు హీరోయిన్ సంజన ప్రయత్నించింది. దాన్ని ఆపడానికి కమెడియన్ సుమన్ శెట్టి కొట్టాడు. అది చూసిన సంచాలక్ ప్రియా శెట్టి అన్నా.. అవుట్.. ఎలిమినేట్ అని చెప్పేసింది. దానికి కోపంతో బాస్కెట్ తన్నేసి వెళ్లిపోయాడు సుమన్ శెట్టి. అక్కడితో నేటి బిగ్ బాస్ 9 తెలుగు ఎపిసోడ్ ప్రోమో ముగిసింది.
సంబంధిత కథనం