బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్‌లో ఐదుగురు- మాస్క్ మ్యాన్‌కు దెబ్బేసిన సొంత టీమ్- ఓనర్స్ కంటే ఎక్కువ తింటున్నారంటూ!-bigg boss telugu 9 third week nominations tenants nominated owners in bigg boss 9 telugu today episode september 22nd ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్‌లో ఐదుగురు- మాస్క్ మ్యాన్‌కు దెబ్బేసిన సొంత టీమ్- ఓనర్స్ కంటే ఎక్కువ తింటున్నారంటూ!

బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్‌లో ఐదుగురు- మాస్క్ మ్యాన్‌కు దెబ్బేసిన సొంత టీమ్- ఓనర్స్ కంటే ఎక్కువ తింటున్నారంటూ!

Sanjiv Kumar HT Telugu

బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం ముగిసిన మూడో వారానికి చేరుకుంది. రెండో వారం బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. ఇక మూడో వారం మరొకరు ఎలిమినేట్ అవ్వడానికి కావాల్సిన బిగ్ బాస్ నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. దీనికి సంబంధించిన బిగ్ బాస్ ప్రోమోను ఇవాళ రిలీజ్ చేశారు.

బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్‌లో ఐదుగురు- మాస్క్ మ్యాన్‌కు దెబ్బేసిన సొంత టీమ్- ఓనర్స్ కంటే ఎక్కువ తింటున్నారంటూ!

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో రెండో వారం ముగిసింది. సెకండ్ వీక్‌లో బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు. దాంతో బిగ్ బాస్ హౌజ్‌లో 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వారిలో మూడో వారం మరొకరు ఎలిమినేట్ అయ్యేందుకు ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.

మారిపోయిన ఓనర్స్-టెనెంట్స్

దీనికి సంబంధించిన ఇవాల్టీ (సెప్టెంబర్ 22) బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అయితే, ఇప్పుడు హౌజ్‌లో సెలబ్రిటీలుగా వచ్చిన కంటెస్టెంట్స్ ఓనర్స్‌గా, కామనర్స్‌గా వచ్చిన సభ్యులు టెనెంట్స్‌గా ఉన్నారు. ఇంతకుముందు ఇది రివర్స్‌లో ఉండగా శనివారం నాటి ఎపిసోడ్‌లో దీన్ని హోస్ట్ నాగార్జున మార్చాడు.

ఇప్పుడు ఓనర్స్-టెనెంట్స్‌కు ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించాడు బిగ్ బాస్. "బిగ్ బాస్ సీజన్ 9 మూడో వారం నామినేషన్స్ చేసే సమయం వచ్చేసింది. మీ ముందున్న కోర్ట్‌లో టెనెంట్స్‌ అందరూ ఐదుగురుని నామినేట్ చేసి బోర్డ్‌పై వారి ఫొటోలు పెట్టి తగిన కారణాలు చెప్పాలి. తప్పనిసరిగా వారిలో ఒకరు టెనెంట్ అయి ఉండాలి" అని బిగ్ బాస్ ఆదేశించాడు.

మెలికపెట్టిన బిగ్ బాస్

అంటే ఓనర్స్‌ను నామినేట్ చేసే పవర్ ఇచ్చిన బిగ్ బాస్ వారిలో కూడా ఒకరిని నామినేట్ చేయాలని మెలిక పెట్టి ట్విస్ట్ ఇచ్చాడు. హీరోయిన్ సంజనను హరీష్ హరిత నామినేట్ చేశాడు. "ఆమె కెప్టెన్ అయిన నెక్ట్స్ సెకండ్ నుంచి ఆమెలో కొంత ఈవిల్‌నెస్ కనిపించింది. ఫ్లోరా విషయంలో మోసుకెళ్లమని చెప్పడం నాకు చాలా తప్పనిపించింది" అని హరీష్ అన్నాడు.

"నాకు కూడా సంజన గారే" అని ప్రియా అంది. "ఉమెన్‌ను డీ గ్రేడ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు" అని శ్రీజ చెప్పింది. "రాము విషయంలో బొమ్మలు తీసుకోవడం సెల్ఫిష్" అని ప్రియా అంది. "ఓనర్స్ కంటే ఎక్కువ మీరు తింటున్నారు" అని మాస్క్ మ్యాన్ హరీష్ హరిత అన్నాడు.

బూతు కన్న అబద్ధం

"నాకు బూతు కన్న అబద్ధం ఆడటం రాంగ్" అని అరుస్తూ చెప్పాడు డీమోన్ పవన్. "అమ్మాయిలతో చులకనగా మాట్లాడతా అన్నారు. అమ్మాయిలకు ఎంత గౌరవం ఇస్తానో నాకు తెలుసు" అని హరీష్ గట్టిగా చెప్పాడు. ఈ విషయంలో హరీష్ హరిత-శ్రీజ దమ్ము ఇద్దరు గొడవ పడ్డారు. వాదించుకున్నారు. ఇక టెనెంట్స్‌ నుంచి హరీష్‌ను నామినేట్ చేశారు.

మొత్తంగా టెనెంట్స్ అంతా కలిసి ఐదుగురిని నామినేట్ చేశారు. వారిలో హీరోయిన్ సంజన గల్రాని, కమెడియన్ సుమన్ శెట్టి, నువ్వు నాకు నచ్చావ్ హీరోయిన్ ఫ్లోరా సైని, జబర్దస్త్ భామ రీతూ చౌదరితోపాటు మాస్క్ మ్యాన్ హరీష్ హరిత ఉన్నారు. తననే నామినేట్ చేసి మాస్క్ మ్యాన్ హరీష్‌కు సొంత టీమ్ దెబ్బేసింది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం