బిగ్ బాస్ నుంచి ప్రియా శెట్టి ఎలిమినేట్- కొంపముంచిన ఓవరాక్షన్- 3 వారాలకు డాక్టర్ పాప రెమ్యునరేషన్ ఎంతంటే?-bigg boss telugu 9 priya shetty eliminated this week and her remuneration details for 3 weeks in bigg boss 9 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బిగ్ బాస్ నుంచి ప్రియా శెట్టి ఎలిమినేట్- కొంపముంచిన ఓవరాక్షన్- 3 వారాలకు డాక్టర్ పాప రెమ్యునరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ నుంచి ప్రియా శెట్టి ఎలిమినేట్- కొంపముంచిన ఓవరాక్షన్- 3 వారాలకు డాక్టర్ పాప రెమ్యునరేషన్ ఎంతంటే?

Sanjiv Kumar HT Telugu

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో మరొకరు ఎలిమినేట్ అయ్యారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ను ఇవాళ (సెప్టెంబర్ 28)న చూపించనున్నారు. బిగ్ బాస్ 9 తెలుగు మూడో వారం కామనర్‌గా అడుగుపెట్టిన డాక్టర్ ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలో 3 వారాల పాటు హౌజ్‌లో ఉన్న ప్రియా శెట్టి రెమ్యునరేషన్ ఎంతో ఇక్కడ చూద్దాం.

బిగ్ బాస్ నుంచి ప్రియా శెట్టి ఎలిమినేట్- కొంపముంచిన ఓవరాక్షన్- 3 వారాలకు డాక్టర్ పాప రెమ్యునరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఉత్కంఠంగా సాగుతోంది. ఊహించని ఎలిమినేషన్స్, సీక్రెట్ టాస్క్, సడెన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో జోరుగా నడుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం మరొకరు ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఇప్పటికే బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మొదటి వారం శ్రేష్టి వర్మ, రెండో వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు.

నామినేషన్స్‌లో ఐదుగురు

ఇప్పుడు ఇంకో వికెట్ పడింది. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు సెలెక్ట్ కాగా వారిలో హీరోయిన్ ఫ్లోరా సైని ఇమ్యునిటీ సాధించి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయింది. దాంతో మూడో వారం బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్స్‌లో రీతూ చౌదరి, హరిత హరీష్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కల్యాణ్ పడాల ఐదుగురు ఉన్నారు.

ఆడియెన్స్‌కు ఇరిటేషన్

వీరిలో అతి తక్కువ ఓటింగ్‌తో రావడంతో ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది. అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయి కామనర్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన ప్రియా శెట్టి మొదటి నుంచి బాగా అతి చేయడంతో నెగెటివిటీ మూటగట్టుకుంది. ప్రతి చిన్న విషయానికి ఓవరాక్షన్ చేస్తూ ఆడియెన్స్‌ను ఇరిటేట్ చేసింది.

మూడో వారం ఎలిమినేట్

అయితే, గత వారం హోస్ట్ నాగార్జున ఇచ్చిన హింట్స్‌తో గేమ్ కాస్తా మార్చుకున్నప్పటికీ అప్పటికే తీవ్ర నెగెటివిటీ తెచ్చుకోవడంతో ఎఫెక్ట్ పడింది. ఫలితంగా మూడో వారం బిగ్ బాస్ తెలుగు 9 నుంచి ఎలిమినేట్ అయింది ప్రియా శెట్టి. డేంజర్ జోన్‌లో ఉన్న సోల్జర్ కల్యాణ్ పడాల, ప్రియా శెట్టి మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరిగింది.

ఇవాళ ప్రసారం

ఫైనల్‌గా ప్రియా శెట్టి ఎలిమినేట్ అయినట్లు అనౌన్స్ చేశారు. కల్యాణ్ సేఫ్ అయ్యాడు. దీనికి సంబంధించిన ఎలిమినేషన్ ఎపిసోడ్ షూటింగ్ శనివారం (సెప్టెంబర్ 27)న జరిగింది. ఇవాళ (సెప్టెంబర్ 28) ఈ వారం బిగ్ బాస్ తెలుగు 9 ఎలిమినేషన్ ప్రక్రియను ప్రసారం చేయనున్నారు.

ప్రియా శెట్టి రెమ్యునరేషన్

ఇక ప్రియా శెట్టి ఎలిమినేషన్ నేపథ్యంలో బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు ఆమె రెమ్యునరేషన్ ఎంతనే విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది. బిగ్ బాస్‌కి ప్రియా శెట్టి వారానికి రూ. 60 వేల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన మూడు వారాలు హౌజ్‌లో ఉన్న ప్రియా శెట్టి బిగ్ బాస్ ద్వారా రూ. లక్షా 80 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది.

కొంపముంచిన డాక్టర్ ఓవరాక్షన్

కాగా, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో గెలిచి సీజన్ 9 హౌజ్‌లోకి కామనర్‌గా వెళ్లిన ప్రియా శెట్టి డాక్టర్ చదివింది. తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఎంబీబీఎస్ చేసినట్లు అగ్ని పరీక్షలో జడ్జెస్‌కు చెప్పింది ప్రియా. ఫైనల్‌గా సెలెక్ట్ అయి బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి వెళ్లిన ప్రియా శెట్టి ఓవరాక్షన్ కారణంగా ఎలిమినేట్ అయింది. ప్రియా చేసిన అతి ఆమె కొంపముంచిందని నెటిజన్స్ అంటున్నారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం