Bigg Boss Elimination Mid Week: అర్థరాత్రి ఊహించని ఎలిమినేషన్- పెద్ద ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్- వెళ్లనంటూ ఏడ్చేసిన నైనిక-bigg boss telugu 8 unexpected mid week eviction contestant aditya om bigg boss 8 telugu october 3 episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Elimination Mid Week: అర్థరాత్రి ఊహించని ఎలిమినేషన్- పెద్ద ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్- వెళ్లనంటూ ఏడ్చేసిన నైనిక

Bigg Boss Elimination Mid Week: అర్థరాత్రి ఊహించని ఎలిమినేషన్- పెద్ద ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్- వెళ్లనంటూ ఏడ్చేసిన నైనిక

Sanjiv Kumar HT Telugu
Published Oct 04, 2024 06:48 AM IST

Bigg Boss Telugu 8 Mid Week Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8లో ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. హౌజ్‌లో అర్ధరాత్రి కంటెస్టెంట్స్‌కు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో నైనిక వెళ్లనంటూ ఏడ్చేసింది. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురుని బ్యాగ్ సర్దుకోమ్మని బిగ్ బాస్ చెప్పాడు.

అర్థరాత్రి ఊహించని ఎలిమినేషన్- పెద్ద ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్- వెళ్లనంటూ ఏడ్చేసిన నైనిక
అర్థరాత్రి ఊహించని ఎలిమినేషన్- పెద్ద ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్- వెళ్లనంటూ ఏడ్చేసిన నైనిక

Bigg Boss 8 Telugu October 3 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 3వ తేది ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. మధ్యలో కంటెస్టెంట్ వెళ్లిపోయేందుకు చేసే మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియను అర్థరాత్రి మొదలుపెట్టాడు బిగ్ బాస్. దీంతో హౌజ్‌మేట్స్‌కు పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్లు అయింది.

బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్

బిగ్ బాస్ 8 తెలుగు మెగా చీఫ్ టాస్క్ అయిన తర్వాత సుమారు 11 గంటల సమయంలో హౌజ్‌లో లైట్స్ బ్లింక్స్ అవుతూ సైరన్స్ మోగాయి. దాంతో ఏం జరుగుతుందని హౌజ్‌మేట్స్ కంగారుపడ్డారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారేమో అని పృథ్వీ గెస్ చేశాడు. కానీ, కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలోకి వచ్చి నిలబడమని బిగ్ బాస్ ఆదేశించాడు.

మిడ్ వీక్ ఎవిక్షన్

దాంతో పదిమంది కంటెస్టెంట్స్ వచ్చి గార్డెన్ ఏరియాలో నిల్చున్నారు. ఈ రాత్రి ఒకరికి పీడకలగా మారనుందని, మిడ్ వీక్ ఎవిక్షన్ ఇప్పుడు జరగనుందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దాంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు 8 ఐదోవారం నామినేషన్స్‌లో ఉన్న నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, నాగ మణికంఠ, నైనిక, ఆదిత్య ఓం నామినేషన్స్‌లో ఉన్నట్లు బిగ్ బాస్ తెలిపాడు.

వెళ్లనంటూ ఏడ్చిన నైనిక

వారిలో నిఖిల్, నబీల్, నాగ మణికంఠ అధిక ఓటింగ్‌తో ఈరోజుకు సేవ్ అయినట్లు బిగ్ బాస్ తెలిపాడు. ఓటింగ్ చివరిలో ఉన్న విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓంను తమ బ్యాగ్స్ సర్దుకోమ్మని బిగ్ బాస్ చెప్పాడు. హౌజ్‌మేట్స్‌కు వీడ్కోలు పలికి, బ్యాగ్స్ సర్దుకోమ్మని సమయం ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో నాకు వెళ్లాలని లేదు అంటూ నైనిక ఏడ్చింది. తనను ప్రేరణ, సీత, నిఖిల్ ఓదార్చారు.

ఎగ్జిట్ అయ్యేలా

తర్వాత అంతా బ్యాగ్ సర్దుకుని గార్డెన్ ఏరియాకు వచ్చారు. ఆ ముగ్గురి ముందు హౌజ్ గేట్‌కు ఎదురుగా లైన్స్ వేశారు. వారిలో ఎవరికి తక్కువ ఓట్లు పడ్డాయని మీరు అనుకుంటున్నారో కారణాలు చెప్పి ఒక అడుగు ముందుకు తీసుకురావాల్సిందిగా మిగతా కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ చెప్పాడు. అంటే ఒక్కో అడుగు ముందుకు వేస్తూ హౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేలా టాస్క్ పెట్టాడు బిగ్ బాస్.

ఆదిత్యకు ఎక్కువ ఓట్లు

ఒక్కొక్కరు ఒక్కో కారణంతో డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ను ముందుకు నడిపించారు. ఆదిత్య ఓంను నిఖిల్, నాగ మణికంఠ, యష్మీ, సీత ముందుకు నడిపించారు. నైనికను పృథ్వీ, ప్రేరణ ముందుకు తీసుకొచ్చారు. విష్ణుప్రియను నబీల్ ముందుకు తీసుకొచ్చాడు. దీంతో అందరికంటే ఎక్కువ ఓట్లు, అడుగులతో ఆదిత్య ఓం ముందు ఉన్నాడు.

ఆదిత్య ఓం ఎలిమినేట్

ఆడియెన్స్ ఓటింగ్ ప్రకారం ఈరోజు ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ ఆదిత్య ఓం గారు అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దాంతో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు. అందరికీ గుడ్ బై చెప్పి హౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు ఆదిత్య ఓం. అర్థరాత్రి ఊహించని ఎవిక్షన్ అని చెప్పినప్పటినుంచి సీత ఏడుస్తూనే ఉంది. తాను ఎవరినైనా హర్ట్ చేసుంటే క్షమించమని చెప్పింది.

Whats_app_banner