Bigg Boss Nominations: బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్- ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్- ఈ వారం 5గురు నామినేట్!-bigg boss telugu 8 twelfth week nominations contestants 5 nikhil prerana yashmi bigg boss 8 telugu nominations 12th week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Nominations: బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్- ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్- ఈ వారం 5గురు నామినేట్!

Bigg Boss Nominations: బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్- ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్- ఈ వారం 5గురు నామినేట్!

Sanjiv Kumar HT Telugu
Nov 19, 2024 06:47 AM IST

Bigg Boss Telugu 8 Nominations 12th Week: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్ నిర్వహించారు. ఇది బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి. ఇలా ఏ సీజన్‌లో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్‌తో హౌజ్‌లో ఉన్నవారిని నామినేట్ చేయించలేదు. బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం ఐదుగురు నామినేట్ అయ్యారు.

బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్- ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్- ఈ వారం 5గురు నామినేట్!
బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్- ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్- ఈ వారం 5గురు నామినేట్! (Disney Plus Hotstar/YouTube)

Bigg Boss 8 Telugu Nominations This Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఊహించని ట్విస్టులతో కొనసాగుతోంది. ఫ్యామిలీ వీక్‌తోపాటు గెస్ట్స్ వచ్చి ఎవరెవరు టాప్‌లో ఉంటారు, విన్నర్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయో దాదాపుగా హింట్స్ ఇచ్చేశారు. దాంతో గేమ్ అంతా మారిపోయింది. అప్పటివరకు ఉన్న కోపాలు, పగలు పక్కన పెట్టి ఇతరులతో మంచిగా మెదలడం మొదలుపెట్టారు.

నో ఎలిమినేషన్

అలాగే, బిగ్ బాస్ తెలుగు 8 పదకొండో వారం ఎలిమినేట్ కాలేదు. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఎవరు ఎలిమినేట్ కాని మొదటి వారం అదే. ఇక సండే ఎపిసోడ్ తర్వాత హౌజ్‌లో అనేక గొడవలకు దారి తీసేది నామినేషన్స్ ప్రక్రియ. అది ఈ సారి పూర్తిగా భిన్నంగా నిర్వహించారు. ఏ సీజన్‌లో చేయనివిధంగా, బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారిగా ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్ నిర్వహించారు.

ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్ అనగానే హౌజ్‌లో ఉన్న ఇంటి సభ్యులతోపాటు ఆడియెన్స్ కూడా చాలా షాక్ అయ్యారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను ఒక్కొక్కరిని దించారు. వారు ఇద్దరిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో హౌజ్‌లో భారీగా గొడవలు, వాగ్వాదాలు జరిగాయి. ముందుగా సోనియా ఆకులను బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ చేశారు.

సోనియా రచ్చ రచ్చ

ఆమె ప్రేరణ, నిఖిల్‌ను నామినేట్ చేసింది. ప్రేరణ రూడ్‌గా ఉందని, నిఖిల్ నామినేట్ పాయింట్స్ స్ట్రాంగ్‌గా ఉండవని, పర్సనల్‌గా చేస్తాడని, ఎమోషన్స్‌కు విలువ ఇవ్వడని కారణాలు చెప్పింది సోనియా. ఈ క్రమంలోనే ప్రేరణ, సోనియా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అలాగే, నిఖిల్, సోనియా నామినేషన్స్‌లో యష్మీ టాపిక్ వచ్చి రచ్చ రచ్చ అయింది.

అనంతరం బెజవాడ బేబక్క వచ్చి పృథ్వీని నామినేట్ చేసింది. ఫిజికల్ స్ట్రెంత్ ఉండటమే బలమని ఫీల్ అవడం, మిగతావారిని అగౌవరపరచడం, కించపరచడం వంటివి చేస్తావని నామినేట్ చేసింది. మిమ్మల్ని నామినేట్ చేస్తే ఎలిమినేట్ అయ్యారని ఏడుస్తూ నామినేట్ చేస్తున్నారని పృథ్వీ డిఫెండ్ చేసుకున్నాడు.

మొదటి రోజు ముగ్గురు

అనంతరం ఆర్జే శేఖర్ బాషా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రేరణ, యష్మీలను నామినేట్ చేశాడు. ఇద్దరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని, పానిపట్టు టాస్క్‌లో అంత రూడ్‌గా ప్రవర్తించిన నిఖిల్‌ను నామినేట్ చేయకుండా వాళ్ల టీమ్ అయిన గౌతమ్‌ను నామినేషన్స్‌లో ఉంచడమే ఉదాహరణగా చెబుతూ నామినేట్ చేశాడు. అక్కడితో బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 18న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ ముగిసింది.

ఇక బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 19న అంటే ఇవాళ నామినేషన్స్ రెండో రోజు కొనసాగనున్నాయి. మంగళవారం నాడు హౌజ్‌లోకి నాగ మణికంఠ, కిర్రాక్ సీత, నైనిక, ఆదిత్య ఓం రానున్నారు. వీరిలో నిఖిల్, నబీల్‌ను నాగ మణికంఠ నామినేట్ చేయగా.. యష్మీ, ప్రేరణను సీత నామినేట్ చేసింది. అలాగే, నబీల్, యష్మీని నైనిక నామినేట్ చేసింది.

నామినేషన్స్‌లో ఐదుగురు

ఇలా బిగ్ బాస్ తెలుగు 8 పన్నెండో వారం నామినేషన్స్‌లో నిఖిల్, ప్రేరణ, యష్మీ, నబీల్‌కు రెండసార్లకు ఎక్కువగా నామినేట్ ఓట్లు పడగా.. పృథ్వీకి ఒక్కసారి పడినట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం నామినేషన్స్‌లో ఈ ఐదుగురు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ ఇవాళ ప్రసారం కానుంది. అయితే, కేవలం ఓజీ క్లాన్ అంటే సెప్టెంబర్ 2న హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తోనే ఈ వారం నామినేషన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

Whats_app_banner