Bigg Boss Avinash: సీరియస్‌గా మారిన అవినాష్ కామెడీ.. వెళ్లిపోతానన్న గౌతమ్.. బిగ్ బాస్ కన్ఫ్యూజ్ అయ్యాడంటూ! (వీడియో)
Bigg Boss Telugu 8 Avinash Vs Gautham Krishna: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌లో కొత్త టాస్క్ రాయల్ క్లాన్స్ మధ్య గొడవ పెట్టింది. జబర్దస్త్ అవినాష్ చేసిన కామెడీ కాస్తా సీరియస్‌గా మారింది. బయటకు వెళ్లిపోతానంటూ గౌతమ్ కృష్ణ అన్నాడు. బిగ్ బాస్ 8 తెలుగు నేటి ఎపిసోడ్ హైలెట్స్ చూస్తే..

Bigg Boss 8 Telugu Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఊహించని విధంగా సాగుతోంది. కొత్తగా వచ్చిన రాయల్ క్లాన్స్ సభ్యుల మధ్యలో కూడా గొడవలు మొదలు అవుతున్నాయి. నిన్నటి (అక్టోబర్ 8) ఎపిసోడ్‌లో నయని పావనిపై తేజ నోరు పారేసుకున్నాడు. తాజాగా జబర్దస్త్ అవినాష్, గౌతమ్ కృష్ణ మధ్య గొడవ రాజుకుంది.
షాక్‌లో రోహిణి
దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. "ఈ ఇల్లు ఇప్పుడు సమానంగా విభజించబడుతుంది. ఈ ఛాలెంజ్‌లో మొదటి రౌండ్ నవ్వకుండా ఉండటానికి ప్రయత్నించు. అవినాష్ అమ్మాయిల లీడర్‌గా, రోహిణి అబ్బాయిల లీడర్‌గా ఉండాలి" అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. దాంతో రోహిణి షాక్ అవుతుంది. అవినాష్ నవ్వుతాడు.
"బిగ్ బాస్ మీరు కన్ఫ్యూజ్ అయినట్లు ఉన్నారు. నేను అమ్మాయిని. ఈయన అబ్బాయి" అని రోహిణి అంటుంది. దానికి "నేను సరిగానే చెప్పాను" అని బిగ్ బాస్ బదులివ్వడంతో అంతా నవ్వేశారు. తర్వాత నోట్లో నీరు ఉంచుకుని స్టేజీపై ఉన్న అవినాష్ టీమ్‌ను నవ్వించడానికి రోహిణి కామెడీతో ట్రై చేస్తుంది. కానీ, ఎవరు నవ్వరు. "వీళ్లకు హాస్య గ్రంథులు కాదు, ఏ గ్రంథులు లేవు" అంటూ స్టేజ్ దిగిపోయింది రోహిణి.
మణికంఠ పాడినట్లుగా
అనంతరం రోహిణి టీమ్ నోట్లో నీరు ఉంచుకుని స్టేజీపై నిల్చోని ఉంటారు. బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ లాంచ్ రోజున నాగ మణికంఠ పాడిన పాటను అవినాష్ ఇమిటేట్ చేస్తాడు. దాంతో అమ్మాయిలంతా తెగ నవ్వుతారు. కానీ, రోహిణి టీమ్ నవ్వు ఆపుకుంటారు. మళ్లీ మణికంఠ దగ్గరే అలా పాడేందుకు ట్రై చేస్తూ అవినాష్ నవ్వుతాడు. తర్వాత తన లాగే అవినాష్ పాట పాడటంతో మణికంఠ నవ్వేస్తాడు.
తర్వాత "అశ్వాత్థామ 2.0 వచ్చాడు" అని అవినాష్ అంటాడు. అది గౌతమ్‌కు ట్రిగ్గర్ అవుతుంది. దాంతో "బ్రో.. వన్ సెకన్" అని గట్టిగా అరిచి ఆపుతాడు గౌతమ్. "అది సీజన్ 7లో అయిపోయింది. మళ్లీ మళ్లీ తీసి నాకు ఇరిటేషన్ తెప్పియకండి బ్రో.. నన్ను వెళ్లిపోమ్మంటే వెళ్లిపోతా.." అని సీరియస్‌గా చెబుతాడు గౌతమ్. తర్వాత కట్ చేస్తే.. "బిగ్ బాస్ నేను టాస్క్ ఆడను" అవినాష్ కూడా సీరియస్‌గా అంటాడు.
అవినాష్ కామెడీ మిస్‌ఫైర్
ఇలా అవినాష్ చేసిన కామెడీ మిస్‌ఫైర్ అయి ఒక్కసారిగా సీరియస్‌గా మారింది. దాంతో హౌజ్‌మేట్స్ అంతా షాక్ అయ్యారు. అయితే, బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో గౌతమ్ కృష్ణను అప్పటి హౌజ్‌మేట్స్ అంతా కలిసి ఎలిమినేట్ చేస్తారు. కానీ, ఓటింగ్‌లో టాప్ ఉండటంతో సీక్రెట్ రూమ్‌లో ఉంచుతారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లాంచ్ తర్వాత వారితోపాటు హౌజ్‌లోకి గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఇస్తాడు.
అప్పుడు "అంతా కలిసి వెన్నుపోటు పొడిచారు కదా. అశ్వత్థామ 2.0 ఈజ్ బ్యాక్" అంటూ గట్టి గట్టిగా అరుస్తూ గౌతమ్ కృష్ణ హౌజ్‌లోపలికి అడుగుపెడతాడు. దానికి గౌతమ్‌ను అంతా పిచ్చోడిలా చూస్తారు.
అంతేకాకుండా ఇది సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్‌కు గురి అయింది. అలాగే, అశ్వత్థామను అశ్వగంధ అంటూ గౌతమ్‌పై విపరీతమైన ట్రోలింగ్ చేశారు. అది గుర్తుకు వచ్చే గౌతమ్ చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.