Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి రోహిణి డైరెక్ట్ ఎలిమినేట్- 9 వారాల్లో సంపాదించింది ఇదే! కమెడియన్ కాదు ఆడపులి!
Bigg Boss Telugu 8 Rohini Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం రోహిణి డైరెక్ట్ ఎలిమినేట్ అయింది. జబర్దస్త్‌లో లేడి కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ 8 తెలుగులో మాత్రం ఆటతో ఆడపులి అనిపించుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో 9 వారాలు ఉన్న రోహిణి రెమ్యునరేషన్ ఎంత అనేది ఆసక్తిగా మారింది.
Bigg Boss 8 Telugu Rohini Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ తుది అంకానికి చేరడంతో వరుసగా రెండు సార్లు ఎలిమినేషన్ నిర్వహిస్తున్నారు. గత వారం అంటే బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం మొదటగా టేస్టీ తేజ ఎలిమినేట్ కాగా.. రెండోసారి పృథ్వీరాజ్ శెట్టి హౌజ్ నుంచి అవుట్ అయ్యాడు.
రోహిణి ఎలిమినేట్
అయితే, బిగ్ బాస్ తెలుగు 8 పద్నాలుగో వారం అంటే చివరి వారం ఎలిమినేషన్ సింగిల్‌గా ఉంటుందని అంతా భావించారు. కానీ, బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు టాప్ 5 కంటెస్టెంట్స్‌ను మాత్రమే పంపించాలన్న ఉద్దేశంతో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఇందులో భాగంగానే మొదటగా బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 7 ఎపిసోడ్‌లో రోహిణి ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయింది.
అయితే, వీకెండ్‌లోలాగా ఇద్దరి కంటెస్టెంట్ల మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించి ఎలిమినేట్ చేయకుండా రోహిణిని డైరెక్ట్ ఎలిమినేట్ చేశారు. గార్డెన్ ఏరియాలో ఈ వారం నామినెషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ స్టాచ్యూలని నిల్చోబెట్టారు. వారిలో ఎవరి విగ్రహం కిందపడుతుందో వారు ఎలిమినేట్ అయినట్లు అని నాగార్జున చెప్పారు. దాంతో రోహిణి స్టాచ్యూ కింద పడి నేరుగా ఎలిమినేట్ అయిపోయింది.
ట్రోఫీ ఒక్కటే గెలవలేదు అంతే..!
ఎలిమినేట్ అనంతరం హౌజ్ మేట్స్ అంతా రోహిణి గేమ్‌కు టేక్ ఏ బౌ అని చెప్పారు. ఆమె ఆటతీరుకు అంతా ఫిదా అయినట్లు చెప్పారు. రోహిణి హీరో అని, శివంగి అని, సరంగి అంటూ ఆకాశానికి ఎత్తేశారు. కమెడియన్‌గా బిగ్ బాస్ తెలుగు 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన రోహిణి టాస్క్‌ల్లో ఆడపులిలా ఆడిన విషయం తెలిసిందే. తనను తక్కువ చేసి జీరో అన్న పృథ్వీపైనే గెలిచి చివరి మెగా చీఫ్ అయింది రోహిణి.
అందుకే ఏ ఎలిమినేట్ కెంటెస్టెంట్‌కు ఇవ్వని వీడ్కోలును రోహిణికి హౌజ్‌మేట్స్ ఇచ్చారు. అలాగే, స్టేజీ మీద రోహిణి బిగ్ బాస్ జర్నీ వీడియోను కూడా మంచి ఎలివేషన్స్ ఇస్తూ చాలా సేపు ప్రదర్శించారు. అంతలా ఏ కంటెస్టెంట్‌కు చూపించలేదు. గెలిచినవారితో సమానంగా నీకు ఆదరణ లభించిందని నాగార్జు అన్నారు. ట్రోఫీ ఒక్కటే లేదు కానీ విన్నర్ అయినంత గర్వంగా ఉందని రోహిణి కూడా చెప్పింది.
బిగ్ బాస్‌కి రోహిణి రెమ్యునరేషన్
ఇలా కమెడియన్ కాదు.. ఆడపులిలా, దాదాపుగా విన్నర్ గెలుచుకునేంత అభిమానాన్ని అందుకున్న రౌడీ రోహిణి అక్టోబర్ 6న బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి ఐదో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. అలా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో 9 వారాలు (63 రోజులు, 2 నెలలకుపైగా) రోహిణి ఉంది. అయితే, ఈ సీజన్‌లో పాల్గొనేందుకు రోహిణి వారానికి రూ. 2 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం.
ఇలా చూస్తే 9 వారాలకు బిగ్ బాస్ 8 తెలుగు ద్వారా రోహిణి రూ. 18 లక్షల పారితోషికం అందుకుందని తెలుస్తోంది. అయితే, 2 లక్షలు మాత్రమే కాకుండా రోహిణి బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు వారానికి రూ. 4 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే బిగ్ బాస్ తెలుగు 8లో 9 వారాలు ఉన్న జబర్దస్త్ రోహిణి రూ. 36 లక్షలు సంపాదించిందని సమాచారం.
అయితే, బిగ్ బాస్ తెలుగు 8 నుంచి ఎలిమినేట్ అయిన రోహిణి రెమ్యునరేషన్ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
టాపిక్