Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి హరితేజ ఎలిమినేట్.. ఐదు వారాల్లో ఆమె సంపాదన ఇంతే.. కానీ, నిఖిల్ కంటే ఎక్కువ!
Bigg Boss Telugu 8 Hari Teja Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం డబుల్ ఎలిమినేషన్ అయింది. ఊహించని విధంగా అనారోగ్య కారణాలతో గంగవ్వ ఎలిమినేట్ అయితే.. అతి తక్కువ ప్రేక్షకుల ఓట్లతో హరితేజ ఎలిమినేట్ అయింది. మరి వైల్డ్ కార్డ్‌గా వచ్చిన హరితేజ బిగ్ బాస్ 8 తెలుగులో 5 వారాల సంపాదన ఎంతో చూద్దాం.
Bigg Boss 8 Telugu Hari Teja Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో పదో వారం ఊహించని విధంగా రెండు సార్లు ఎలిమినేషన్ జరిగింది. అనారోగ్య కారణాలతో గంగవ్వ హౌజ్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఇక ఎప్పటిలాగా జరిగే వీకెండ్ ఎలిమినేషన్‌లో స్ట్రాంగ్ అండ్ వైల్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన నటి హరితేజ ఎలిమినేట్ అయింది.
మారిన స్థానాలు
బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం నామినేషన్స్‌లో గౌతమ్, నిఖిల్, ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ ఏడుగురు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో మొదటి నుంచి అత్యధిక ఓట్లతో గౌతమ్ టాప్ ప్లేస్‌లో ఉంటూ వచ్చాడు. ఆ తర్వాతి స్థానంలో నిఖిల్ ఉన్నాడు. అయితే వీకెండ్ వచ్చేసరికి వీరి స్థానాలు కాస్తా అటు ఇటుగా మారాయి.
నో చెప్పిన నబీల్
ఇక మూడో స్థానంలో ప్రేరణ, నాలుగో స్థానంలో విష్ణుప్రియ, ఐదో స్థానంలో పృథ్వీ నిలిచారు. ఆరు, ఏడు స్థానాలతో డేంజర్ జోన్‌లో వరుసగా యష్మీ, హరితేజ ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ వీరిద్దరి మధ్య జరిగింది. వీరిలో ఒకరికి ఫ్రీ ఎవిక్షన్ షీల్డ్‌ను ఉపయోగిస్తావా అని నబీల్‌ను హోస్ట్ నాగార్జున అడిగారు. కానీ, దానికి నబీల్ నో చెప్పాడు.
హరితేజ ఎలిమినేట్
తన కోసం మాత్రమే ఆ ఎవిక్షన్ షీల్డ్ వాడుకుంటానని చెప్పాడు. దాంతో ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న హరితేజ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున తెలిపారు. యష్మీ సేవ్ అయినట్లు చెప్పారు. అక్టోబర్ 6న జరిగిన బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ రోజున వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హరితేజ ఎంట్రీ ఇచ్చింది.
మెప్పించలేకపోవడంతో
ఇదివరకే బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న హరితేజపై ఈ సారి అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ, ఆశించిన స్థాయిలో ఈ సీజన్‌లో హరితేజ మెప్పించలేకపోయింది. దాంతో ఐదు వారమే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగు ద్వారా హరితేజ ఎంత సంపాదించిందనే టాక్ ఆసక్తిగా మారింది.
నిఖిల్ కంటే ఎక్కువ
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన హరితేజ వారానికి రూ. 3 లక్షల వరకు పారితోషికం తీసుకుందని సమాచారం. అంటే, రోజుకు సుమారు రూ. 42,857. అంతే కాకుండా బిగ్ బాస్ తెలుగు 8లో విన్నర్ మెటీరియల్‌గా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా వచ్చిన నిఖిల్ మలియక్కల్ రెమ్యునరేషన్ కంటే హరితేజ పారితోషికం ఎక్కువ. నిఖిల్‌కు వారానికి రూ. 2,25000 రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్.
గంగవ్వ కంటే తక్కువ
అంటే, నిఖిల్ కంటే హరితేజకు దాదాపుగా రూ. 75 వేలు ఎక్కువ. ఇక అక్టోబర్ 6న హౌజ్‌లోకి అడుగుపెట్టిన హరితేజ ఐదు వారాలు బిగ్ బాస్ తెలుగు 8లో పాల్గొంది. అందుకు గానూ హరితేజ ఐదు వారాల్లో రూ. 15 లక్షల వరకు పారితోషికం తీసుకుందని సమాచారం. అయితే, హరితేజతోపాటు వైల్డ్ కార్డ్‌గా వచ్చిన గంగవ్వ మాత్రం హరితేజ కంటే ఎక్కువగా వారానికి మూడున్నర లక్షల పారితోషికం అందుకుంది.
4 లక్షలు అంటూ
ఇదిలా ఉంటే, హరితేజ బిగ్ బాస్ తెలుగు 8 పాల్గొనేందుకు వారానికి రూ. 4 లక్షల పారితోషికం కూడా తీసుకుందనే మరో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే ఐదు వారాల్లో హరితేజ రూ. 24 లక్షలు సంపాదించినట్లు. ఈ రెమ్యునరేషన్ పరంగా చూస్తే నిఖిల్ పది వారాల రెమ్యునరేషన్‌కు హరితేజ పారితోషికం కాస్తా అటు ఇటుగా సమానంగా ఉంటుంది. అలాగే, గంగవ్వ కంటే ఎక్కువగానే హరితేజ సంపాదించినట్లు అవుతుంది.
టాపిక్