Bigg Boss Elimination Double: ఈ వారం రెండుసార్లు ఎలిమినేషన్.. ఇవాళ మరోకరు ఎలిమినేట్.. నిన్న గంగవ్వ అవుట్.. కారణాలు ఇవే!
Bigg Boss Telugu 8 Elimination Tenth Week: బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఈపాటికే ఊహించనివిధంగా గంగవ్వ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఇవాళ మరొక లేడి కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుంది. దానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇవాళ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే..
Bigg Boss 8 Telugu Double Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ప్రతివారం ఒకరు ఎలిమినేట్ అవుతారన్న విషయం తెలిసిందే. ఒక్కోసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అయితే, అది ఆ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేట్ అవుతారు.
ఈ వారం ఎలిమినేట్
కానీ, తాజాగా బిగ్ బాస్ తెలుగు 8లో పదో వారం గంగవ్వ ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడి వెళ్లిపోయింది. బిగ్ బాస్ 8 తెలుగు 10వ వారం నామినేషన్స్‌లో లేని గంగవ్వ అనుకోని విధంగా ఎలిమినేట్ అయింది. చేతులు, అరికాళ్లలో మంటలు పుట్టడం, తేర్పులు, ఎక్కిళ్లు వరుసగా రావడంతో హౌజ్‌లో ఇక ఆట ఆడలేనని గంగవ్వ తేల్చి చెప్పింది. దాంతో గంగవ్వను బిగ్ బాస్ తెలుగు 8 నుంచి ఈ వారం ఎలిమినేట్ చేశారు.
నామినేషన్స్‌లో ఏడుగురు
బిగ్ బాస్ నుంచి గంగవ్వ ఎలిమినేట్ కావడాన్ని శనివారం (నవంబర్ 9) నాటి ఎపిసోడ్‌లో చూపించారు. ఇదిలా ఉంటే, ప్రతివారం రెగ్యులర్‌గా జరిగే ఎలిమినేషన్ ప్రక్రియను ఇవాళ చూపించనున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయేందుకు నామినేషన్స్ జరిగిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ 8 తెలుగు పదో వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉన్నారు.
టాప్‌లో గౌతమ్, నిఖిల్
నిఖిల్, గౌతమ్, ప్రేరణ, యష్మీ, హరితేజ, పృథ్వీ, విష్ణుప్రియ ఏడుగురు బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్ 2లో గౌతమ్, నిఖిల్ ఉన్నారు. ముందు నుంచి అయితే గౌతమ్ ఓటింగ్‌లో మొదటి స్థానంలో దూసుకువచ్చాడు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ వరుసగా ఉన్నారు. ఇక డేంజర్ జోన్‌లో యష్మీ, హరితేజ ఉన్నారు.
యష్మీ-హరితేజ మధ్య
అంటే, బిగ్ బాస్ ఓటింగ్ లెక్కల ప్రకారం అతి తక్కువగా యష్మీ, హరితేజకు ఓట్లు పడ్డాయి. దాంతో యష్మీ, హరితేజ మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ నడిచింది. అయితే, ఎవిక్షన్ షీల్డ్ గెలుచుకున్న నబీల్‌ను యష్మీ, హరితేజలో ఎవరినైనా కాపాడుతావా అని హోస్ట్ నాగార్జున అడిగారు. ఎవిక్షన్ షీల్డ్ గెలుచుకున్న వ్యక్తి దాని ద్వారా ఒకరిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది.
తక్కువ ఓటింగ్ రావడంతో
అందుకే నబీల్‌ను నాగ్ అడిగారు. కానీ, నబీల్ మాత్రం ఎవిక్షన్ షీల్డ్‌ను ఎవరికీ ఇవ్వను అని, తనే ఉంచుకుంటానని చెప్పాడు. దాంతో ప్రేక్షకుల ఓట్ల ప్రకారం అందరికంటే తక్కువ ఓటింగ్ వచ్చిన హరితేజ ఎలిమినేట్ అయింది. తనకంటే ఎక్కువ ఓట్లు సాధించిన యష్మీ ఎలిమినేషన్ నుంచి సేవ్ అయింది. దీనికి సంబంధించిన షూటింగ్ అంతా శనివారం నాడు పూర్తి అయింది.
గంగవ్వ తర్వాత
ఇక బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను ఎప్పటిలానే ఆదివారం (నవంబర్ 10) ప్రసారం చేయనున్నారు. కాగా, ఈ వారం ఎలిమినేషన్ నుంచి ప్రేరణ, గౌతమ్, నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, యష్మీ సేవ్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం హరితేజ ఎలిమినేట్ అయింది. అంటే, ఈపాటికే గంగవ్వ ఎలిమినేట్ అయి వెళ్లిపోగా.. మరో లేడి కంటెస్టెంట్ అయిన హరితేజ కూడా ఈ వారం ఎలిమినేట్ అయింది.