Bigg Boss Remuneration: నామినేషన్స్‌లో లేకుండానే గంగవ్వ ఎలిమినేట్.. ఈ సీజన్‌లో ఎంత సంపాదించిందంటే?-bigg boss telugu 8 tenth week elimination gangavva remuneration for 5 weeks bigg boss 8 telugu gangavva remuneration ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Remuneration: నామినేషన్స్‌లో లేకుండానే గంగవ్వ ఎలిమినేట్.. ఈ సీజన్‌లో ఎంత సంపాదించిందంటే?

Bigg Boss Remuneration: నామినేషన్స్‌లో లేకుండానే గంగవ్వ ఎలిమినేట్.. ఈ సీజన్‌లో ఎంత సంపాదించిందంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 10, 2024 06:09 AM IST

Bigg Boss Telugu 8 Gangavva Remuneration: బిగ్ బాస్ తెలుగు 8లో ఊహించనివిధంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఈపాటికే ఈ వారం గంగవ్వ ఎలిమినేషన్ జరిగింది. బిగ్ బాస్ నుంచి గంగవ్వ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఈ క్రమంలో బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ ద్వారా గంగవ్వ ఎంత సంపాదించిందని చూస్తే..

నామినేషన్స్‌లో లేకుండానే గంగవ్వ ఎలిమినేట్.. ఈ సీజన్‌లో ఎంత సంపాదించిందంటే?
నామినేషన్స్‌లో లేకుండానే గంగవ్వ ఎలిమినేట్.. ఈ సీజన్‌లో ఎంత సంపాదించిందంటే?

Bigg Boss 8 Telugu Gangavva Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఊహించని ట్విస్టులు, మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం అనూహ్యంగా డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఎవరు ఊహించనివిధంగా ఈపాటికో బిగ్ బాస్ హౌజ్ నుంచి గంగవ్వ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది.

అనారోగ్యం వల్ల

బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 9 ఎపిసోడ్‌లో గంగవ్వ ఎలిమినేట్ అయి వెళ్లిపోవడం చూపించారు. అక్టోబర్ 6న వైల్డ్ కార్డ్‌గా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి అడుగుపెట్టిన గంగవ్వ బాగానే ఆడింది. టాస్క్‌ల్లో తనకు అర్థమైనంతవరకు బెస్ట్ ఇచ్చింది. అయితే, ఇటీవల గంగవ్వ ఆరోగ్యం సరిగా లేదు. పలుసార్లు కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లగా బిగ్ బాస్ ఆమె ఆరోగ్యంపై ఆరా కూడా తీసేవారు.

ఇక శనివారం నాటి ఎపిసోడ్‌లో గంగవ్వతో హోస్ట్ నాగార్జున ప్రైవేట్‌గా మాట్లాడాడు. అప్పుడు తన చేతులకు మంటలు పుడుతున్నాయని, ఉండాలని ఉంది కానీ, తనవల్ల కావట్లేదని, ఎక్కిళ్లు, తేర్పులు తరచుగా వస్తున్నాయని గంగవ్వ తన ఆరోగ్య సమస్య చెప్పుకుంది. అయితే, ఇంటి నుంచి వెళ్తావా గంగవ్వ అని నాగార్జున అడిగితే.. చేతులకు మంటలు పుట్టడం గురించే చెప్పుకుంది.

హౌజ్ నుంచి ఎలిమినేట్

దాంతో గంగవ్వను ఇంటికి పంపిచేయాలని బిగ్ బాస్ నిర్ణయించుకున్నారని, తాను ఎలిమినేట్ అయి వెళ్లిపోతుందని మిగతా హౌజ్ మేట్స్‌తో నాగార్జున చెప్పారు. దాంతో బిగ్ బాస్ హౌజ్ నుంచి గంగవ్వ అనూహ్యంగా ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. దాంతో రోహిణి, టేస్టీ తేజ, గౌతమ్, అవినాష్, నబీల్ ఎమోషనల్ అయ్యారు.

అయితే, బిగ్ బాస్ 8 తెలుగు 10వ వారం నామినేషన్స్‌లో గంగవ్వ లేదు. బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం నామినేషన్స్‌లో యష్మీ, గౌతమ్, ప్రేరణ, హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్ ఏడుగురు మాత్రమే ఉన్నారు. నామినేషన్స్‌లో లేకుండానే అనారోగ్య కారణాలతో గంగవ్వ ఈ వారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది.

వారానికి మూడున్నర లక్షలు

అక్టోబర్ 6న హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ దాదాపుగా 5 వారాల పాటు బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో పాల్గొంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చిన గంగవ్వకు వారానికి రూ. 3.5 లక్షల పారితోషికం ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. అంటే, రోజుకు సుమారుగా రూ. 50 వేల రెమ్యునరేషన్ అందుకుంది గంగవ్వ.

అలా ఐదు వారాల పాటు ఉన్న గంగవ్వ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో రూ. 17 లక్షల 50 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఇలా చూసుకుంటే హౌజ్‌లో చాలా వరకు కంటెస్టెంట్స్‌తో పోలిస్తే గంగవ్వ బాగానే సంపాదించింది. ఇదిలా ఉంటే, ఇదివరకు బిగ్ బాస్ తెలుగు 4 సీజన్‌లో మొదట పాల్గొన్న గంగవ్వ అప్పుడు కూడా అనారోగ్య కారణాలోతోనే ఇంటి నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది.

సొంతిల్లు నిర్మాణం

అప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లో కూడా ఐదు వారాలు ఉన్నందుకు గంగవ్వకు రూ. 10 లక్షల పారితోషికం వచ్చిందని సమాచారం. అలాగే, గంగవ్వ కల అయినటువంటి సొంతిల్లు నిర్మాణానికి అప్పటి హోస్ట్ అయిన నాగార్జున రూ. 7 లక్షలు అందజేశారట. దాంతో బిగ్ బాస్ 4 తెలుగు ద్వారా కూడా గంగవ్వ రూ. 17 లక్షలు అందుకుంది. అలా వచ్చిన డబ్బుతో సొంతగా ఇల్లు కట్టుకుంది బిగ్ బాస్ గంగవ్వ.

Whats_app_banner